AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఆ ఐపీఎల్ రూల్‌ని మరోసారి బ్రేక్ చేసిన కేకేఆర్ కంత్రీగాడు.. బిగ్ షాక్ ఇవ్వనున్న బీసీసీఐ?

Harshit Rana Breaching IPL Code Of Conduct: లక్నో జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 36 బంతుల్లో 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిచెల్ మార్ష్ 81 పరుగులతో అర్ధ సెంచరీ చేశాడు. ఐడెన్ మార్క్రమ్ 47 పరుగులు చేశాడు. హర్షిత్ రాణా 2 వికెట్లు పడగొట్టాడు. ఆండ్రీ రస్సెల్ ఒక వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం కోల్‌కతా జట్టు 6 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 90 పరుగులు చేసింది. రహానే, నరైన్ క్రీజులో నిలిచారు.

Video: ఆ ఐపీఎల్ రూల్‌ని మరోసారి బ్రేక్ చేసిన కేకేఆర్ కంత్రీగాడు.. బిగ్ షాక్ ఇవ్వనున్న బీసీసీఐ?
Lsg Vs Kkr Harshit Rana
Venkata Chari
|

Updated on: Apr 08, 2025 | 6:08 PM

Share

Harshit Rana Breaching IPL Code Of Conduct: గత ఐపీఎల్ సీజన్‌లో హర్షిత్ రాణా అద్భుతంగా ఆకట్టుకున్నాడు. దీంతో భారత జట్టులో కూడా స్థానం సంపాదించాడు. అయితే, కొన్ని కారణాలతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాడు. బౌలింగ్ వేస్తున్న సమయంలో బంతితో అద్భుతంగా రాణించినప్పటికీ, కొన్ని చెత్త సిగ్నల్స్‌తో వార్తల్లో నిలుస్తున్నాడు. దీంతో ఈ కేకేఆర్ బౌలర్‌కు భారీ జరిమానా విధించారు. ఇంతకుముందు ఫ్లయింగ్-కిస్ వేడుకలతో పేరుగాంచిన ఈ ప్లేయర్.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని పలుమార్లు ఉల్లంఘించాడు.

అయితే, ఐపీఎల్ 2025 సీజన్‌లో మాత్రం తీవ్రంగా నిరాశకు గురయ్యాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హర్షిత్ తన దూకుడును ప్రదర్శించాడు. డేంజరస్ ఐడెన్ మార్క్రమ్‌ను ఔట్ చేసిన తర్వాత మరోసారి ఇదే విధంగా వీడ్కోలు పలికాడు. దీంతో మరోసారి ఈ ఆటగాడికి భారీ జరిమానా విధించే అవకాశం ఉంది.

హర్షిత్ రాణాకు జరిమానా పడుతుందా?

ఐడెన్ మార్క్రమ్‌ను అద్భుతమైన ఆఫ్-కట్టర్‌తో అవుట్ చేసిన హర్దిత్ రాణా.. పెవిలియన్ వైపు చూపిస్తూ లక్నో బ్యాటర్‌కు దారి చూపించాడు. అయితే, ఇది తీవ్రమైన నేరం కానప్పటికీ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడం కిందకు వస్తుంది.

ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.5 ప్రకారం , మరొక ఆటగాడిని కించపరిచే లేదా దూకుడుగా స్పందించేలా చేసే భాష, సంజ్ఞలను ఉపయోగించడం అభ్యంతరకరంగా పరిగణిస్తుంటారు.

ఇందులో అవుట్ అయిన బ్యాటర్‌ని లక్ష్యంగా చేసుకుని, అతనికి ఇబ్బంది కలిగించేలా వేడుకలు చేయకూడదు. పెవిలియన్ వెళ్తోన్న బ్యాటర్‌ను మాటలతో దుర్భాషలాడటం పెవిలియన్ వైపు చూపడం లేదా సైగ చేయడం వంటివి కూడా వస్తాయి.

కాగా, లక్నో స్పిన్నర్ దిగ్వేష్ రతి నోట్‌బుక్ సెలబ్రేషన్స్ కూడా ఉన్నాయి. ఇలాంటి వేడుకకు మరుసటి రోజే జరిమానా ఎదుర్కొన్నాడు.

కేకేఆర్ బౌలర్లపై లక్నో ఆధిపత్యం..

కోల్‌కతా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో లక్నో ఓపెనర్లు ఐడెన్ మార్క్రామ్, మిచెల్ మార్ష్ తొలి వికెట్‌కు 99 పరుగులు జోడించడంతో అజింక్య రహానే టాస్ నిర్ణయం తప్పని రుజువైంది.

ఈ అద్భుతమైన ఓపెనింగ్ జోడీ ముందు కేకేఆర్ బౌలర్లు తేలిపోయారు. లక్నో జట్టు 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 36 బంతుల్లో 87 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మిచెల్ మార్ష్ 81 పరుగులతో అర్ధ సెంచరీ చేశాడు. ఐడెన్ మార్క్రమ్ 47 పరుగులు చేశాడు. హర్షిత్ రాణా 2 వికెట్లు పడగొట్టాడు. ఆండ్రీ రస్సెల్ ఒక వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం కోల్‌కతా జట్టు 6 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 90 పరుగులు చేసింది. రహానే, నరైన్ క్రీజులో నిలిచారు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..