AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హ్యాపీ హార్మోన్ల రహస్యం.. శరీరంలో లవ్ హార్మోన్ పెరగాలంటే ఇలా చేయండి..!

శరీరంలో ప్రేమ, అనుబంధం వంటి భావాలను పెంపొందించే ముఖ్యమైన హార్మోన్ ఆక్సిటోసిన్. ఇది మన బంధాలను బలపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ హార్మోన్‌ను సహజంగా ఎలా పెంచుకోవచ్చో తెలుసుకోండి. సులభమైన అలవాట్లతో మనం ప్రేమను, ఆనందాన్ని, శాంతిని ఎక్కువగా పొందగలుగుతాము.

హ్యాపీ హార్మోన్ల రహస్యం.. శరీరంలో లవ్ హార్మోన్ పెరగాలంటే ఇలా చేయండి..!
Happy Couple
Prashanthi V
|

Updated on: Apr 08, 2025 | 5:49 PM

Share

మన శరీరంలో పలు రకాల హార్మోన్లు పనిచేస్తూ మన భావోద్వేగాలను ప్రభావితం చేస్తుంటాయి. అందులో ముఖ్యమైనది ఆక్సిటోసిన్. దీనిని లవ్ హార్మోన్, బాండింగ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. ఇది మనుషుల మధ్య ప్రేమ, విశ్వాసం, అనుబంధాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఆక్సిటోసిన్ లెవెల్స్ పెరిగితే మానసిక ప్రశాంతత, సంతోషకరమైన అనుభూతి కూడా కలుగుతుంది.

రోజూ కొద్దిసేపు అయినా వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటంతో పాటు హార్మోన్ల స్థాయిలు సర్దుబాటు అవుతాయి. ముఖ్యంగా యోగా, వాక్, లైట్ జిమ్ వర్కౌట్లు వంటివి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇది ఆక్సిటోసిన్ హార్మోన్ స్థాయిని పెంచుతుంది.

పాటలకి కాలు కదిలితే సరిపోతుంది. డ్యాన్స్ వల్ల శరీరంలో ఆక్సిటోసిన్‌తో పాటు డోపమైన్, ఎండార్ఫిన్స్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మనలో ఉల్లాసాన్ని, ప్రేమను, శక్తిని పెంచుతాయి.

మనకు ఇష్టమైన వాళ్లతో సమయాన్ని గడిపితే మనసు ప్రశాంతంగా మారుతుంది. దీని ప్రభావంతో శరీరంలో ప్రేమ హార్మోన్ అయిన ఆక్సిటోసిన్ విరబూస్తుంది. ఇది సంబంధాలను మరింత బలంగా తయారు చేస్తుంది.

ఎప్పుడూ మనకు దక్కిన మంచి విషయాలపై కృతజ్ఞతతో ఉండటం వల్ల హృదయం ఆనందంతో నిండిపోతుంది. ఈ సానుకూల భావం శరీరంలో ఆక్సిటోసిన్ విడుదలకు దోహదం చేస్తుంది. కృతజ్ఞతతో ఉండడం వల్ల మానసిక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.

ఇష్టమైనవాళ్లతో కలిసి నవ్వుతూ గడిపిన ప్రతీ క్షణం మనలోని ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అలాంటి సాన్నిహిత్యంతో శరీరంలో ఆక్సిటోసిన్ హార్మోన్ స్వాభావికంగా విడుదలవుతుంది. నవ్వు ఒక చిన్న చర్యగా కనిపించినా జీవితం మీద గొప్ప ప్రభావం చూపగలదు.

నిత్యం కొద్ది నిమిషాలైనా ధ్యానం చేయడం వల్ల మనస్సు శాంతిస్తుంటుంది. అంతే కాకుండా ఇది శరీరంలోని ఆక్సిటోసిన్ స్థాయిని పెంచుతుంది. రోజూ ఉదయం లేదా సాయంత్రం ధ్యానం చేసేందుకు కొంత సమయం కేటాయించండి.

మనసు ప్రశాంతంగా ఉండేందుకు సంగీతం ఓ అద్భుతమైన మార్గం. మెలోడీ పాటలు వినడం వల్ల ఆక్సిటోసిన్ విడుదలవుతుంది. దీనివల్ల మనసు హాయిగా మారుతుంది ఒత్తిడి కూడా తగ్గుతుంది.

వెనిలా, లావెండర్ వంటి సహజ సువాసనల వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇవి శరీరంలో ఆక్సిటోసిన్ విడుదలను ప్రేరేపిస్తాయి. ఈ సుగంధాలను రోజూ ఇన్‌హేల్ చేయడం వల్ల మెదడు హాయిగా మారుతుంది.

శారీరక స్పర్శ, ప్రత్యేకంగా హగ్ చేసుకోవడం వల్ల ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. ఇది ప్రేమ భావనను పెంపొందిస్తుంది. మనిషి శరీరానికి హగ్ కూడా ఓ ధైర్యంగా, బలంగా ఉండే అస్త్రంగా మారుతుంది.

శరీరంలో లవ్ హార్మోన్‌గా పిలువబడే ఆక్సిటోసిన్ స్థాయి పెరగడం వల్ల శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత, బంధాల మధ్య గాఢత పెరుగుతుంది. పై సూచనలను నిత్యజీవితంలో అనుసరిస్తే మీరు ఆనందంగా, సంతోషంగా జీవించగలుగుతారు. ప్రేమని పొందాలంటే మొదటగా ప్రేమను పంచాలి.. అప్పుడు ఆ హార్మోన్ సహజంగానే పెరుగుతుంది.