టేస్టీ టెస్టీ ఫిష్ ఫ్రై.. చేపలను వేయించుకోవడానికి ఏ నూనె బెస్ట్ అంటే?
samatha
8 april 2025
Credit: Instagram
ఫిష్ ఫ్రై అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. చాలా మంది ఎంతో ఇష్టంగా ఫిష్ ఫ్రైని తింటుంటారు.ఇది తినడానికి చాలా రుచిగా ఉంటుంది.
దీంతో చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఫిష్ ఫ్రై తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అందువల్ల ఈ ఫిష్ ఫ్రై వేపుకోవడం కోసం వాడే నూనె విషయంలో జాగ్రత్త అవసరం అంట.
అయితే ఈ ఫిష్ ఫ్రై వేపుకోవడానికి ఎలాంటి నూనె వాడితే మంచిదో తెలుసుకుందాం. చేపలను వేయించడానికి వాడే నూనెలో ఎక్కువ స్మోక్ పాయింట్ ఉండాలంట.
వేరుశెనగ నూనెలో చేపలను వేయించడానికి ఎక్కువ స్మోక్ పాయింట్ ఉంటుంది. కాబట్టి ఇది వేయించడానికి అనుకూలంగా ఉంటుంది. కానీ ఇది ఫిష్ రుచిని మారుస్తుందంట.
ఆలివ్ ఆయిల్ నూనె తేలికగా ఉంటుంది. ఫిష్ ఫై చేసుకోవడానికి ఈ నూనె బెస్ట్ అంటున్నారు ఆరోగ్య నిపుపుణులు. ఇది చేపలను క్రిస్పీగా, రుచిగా ఉండేలా చేస్తుందంట.
ఆవాల నూనె కూడా ఫిష్ ఫ్రైకి చాలా మంచి ఆయిల్. ఇందులో గనుక చేపలను ఫ్రై చేసుకుంటే, చేపలు చాలా రుచిగా ఉంటాయంట. దీనిని ఎక్కువ బెంగాల్, ఒడిశా ప్రాంతంలో ఉపయోగిస్తారు.
కొత్త రుచిలో చేపల ఫ్రై ట్రై చేయాలనుకుంటే,కొబ్బరి నూనె మంచి ఎంపిక. దీంతో చేస్తే చేపలు చాలా క్రిస్పీగా ఫ్రై అవుతాయి. కానీ, ఈ రుచిని అందరూ ఇష్టపడరు.
అంతే కాకుండా చేపల ఫ్రైని మరింత రుచిగా మార్చడానికి సన్ ఫ్ల వర్ నూనె, ఆవాల నూనె చాలా బెస్ట్ అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది రుచిని మరింత పెంచుతాయంట.