షాపింగ్ మాల్ లోకి దూసుకెళ్లిన వ్యాన్ !

A car was driven through the Woodfield Mall in Schaumburg Illinois, షాపింగ్ మాల్ లోకి దూసుకెళ్లిన వ్యాన్ !

అమెరికాలోని షికాగోలో ఓ షాపింగ్ మాల్ లోకి ఎలా దూసుకు వచ్చిందో గానీ ఓ నల్లని ఎస్యూవీ వాహనం అతి వేగంగా ఎంటరైంది. దాన్ని నడుపుతున్న డ్రైవర్ అసలు కస్టమర్స్ ఉన్నారన్న జ్ఞానం గానీ, తానేం చేస్తున్నాడన్న స్పృహగానీ లేకుండా వాహనాన్ని మాల్ లో డ్రైవ్ చేసుకుంటూ పోయాడు. హఠాత్తుగా వస్తున్న వ్యాన్ ను చూసి.. సిబ్బంది, కస్టమర్లంతా భయంతో కేకలు పెడుతూ తలో దిక్కూ పరుగులు తీశారు. చివరకు ఆ వాహనం మాల్ లో ఓ గోడను ఢీకొని ఆగిపోయింది. దీంతో బతుకుజీవుడా అంటూ మాల్ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ఇంతకీ ఆ వాహనం నడిపిన 22 ఏళ్ళ యువకుడికి మతి స్థిమితం లేదని తెలిసింది. మాల్ యాజమాన్యం ఇఛ్చిన ఫిర్యాదుతో పోలీసులు వెంటనే అతడిని పట్టుకుని మొదట పోలీసు స్టేషనుకు తీసుకు వెళ్లారు. అయితే అక్కడ వారడిగిన ప్రశ్నలకు తలాతోకాలేని సమాధానాలు ఇవ్వడంతో అతడిని మానసిక చికిత్సాలయానికి తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *