Weight Loss Tips: బకాసురిడిలా తిన్నా బొజ్జ పెరగదు.? ఈ టిప్స్‌తో పొట్టకు మేలు..
ఎక్కువగా లేదా తరచుగా తినే అలవాటు ఉన్నవారికి బరువును నియంత్రించడం చాలా కష్టం. కానీ మీరు ఎన్ని కేలరీలు తీసుకుంటున్నారో గమనిస్తే.. మీరు మీ బరువును కంట్రోల్లో ఉంచుకోవచ్చు. కాబట్టి కొన్ని చిట్కాలు పాటిస్తే మీకు నచ్చింది.. నచ్చినంత తినొచ్చు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం..

తరచుగా ఏదో ఒకటి తినే అలవాటు ఉన్నవారికి బరువు తగ్గడం అనేది ఒక సవాలుగా మారుతుంది. ఈ మధ్య దేశంలో ఎంతో ఊబకాయంతో బాధపడుతున్నారని ఓ సర్వే తెలిపింది. అయితే ఆహారం ఎక్కువగా తింటూ కూడా బరువును అదుపులో ఉంచుకోవచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఎంత తిన్నా బరువు పెరగకుండా ఉండే చిట్కాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..
కేలరీల లోటు అంటే ఏమిటి?
బరువు తగ్గడానికి ముఖ్యమైన సూత్రం ‘కేలరీల లోటు’ అంటే శరీరానికి అవసరమైన కేలరీల కంటే తక్కువ కేలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం. అవును ప్లేట్ నిండా తినాలి. కానీ అందులో అధిక కేలరీలు ఉన్న ఆహారానికి బదులుగా, తక్కువ కేలరీలు ఉన్న ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. ఈ విధంగా ఆహారం ఎక్కువగా తిన్న సంతృప్తి లభిస్తుంది.. కానీ శరీరానికి తక్కువ కేలరీలు అందుతాయి.
ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
పండ్లు: స్ట్రాబెర్రీలు, పుచ్చకాయ, కివి, చెర్రీ వంటి తక్కువ కేలరీలు ఉన్న పండ్లను ఎంచుకోండి.
మాంసం: చికెన్ బ్రెస్ట్, రొయ్యలు, టిలాపియా లేదా ఇతర తెల్ల చేపలు, ట్యూనా వంటివి తీసుకోవచ్చు.
కార్బోహైడ్రేట్లు: కిడ్నీ బీన్స్, ఉడికించిన బంగాళాదుంపలు, చిలగడదుంపలు, కాయధాన్యాలు, బఠానీలు వంటివి మంచి ఎంపికలు.
సమస్య మీరు ఎంత తింటున్నారనేది కాదు మీరు తినే ఆహారంలో ఎన్ని కేలరీలు ఉన్నాయనేది ముఖ్యం. తక్కువ కేలరీల ఆహారాలను ఎక్కువగా తినడం ద్వారా, మీరు ఆకలిని తీర్చుకోవడమే కాకుండా బరువును సమర్థవంతంగా అదుపులో ఉంచుకోవచ్చు. ఈ చిట్కాలను అనుసరిస్తే మీరు కూడా ఎక్కువగా తింటూనే ఆరోగ్యంగా ఉండవచ్చు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




