Glowing Skin: మెరిసే చర్మాన్ని కోరుకుంటున్నారా..? అయితే ఈ పండ్లను ఇలా ఉపయోగించండి.. అద్భుత ఫలితాలు మీ సొంతం..

పండ్లతో మన ఆరోగ్యానికే కాక మన  చర్మానికి కూడా అనేక ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా ముఖ చర్మం మెరిసిపోయేలా, అందంగా కనిపించేలా చేయడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రస్తుత కాలంలో ముఖ సౌందర్యం అనేది.. ఆ కారణంగా..

Glowing Skin: మెరిసే చర్మాన్ని కోరుకుంటున్నారా..? అయితే ఈ పండ్లను ఇలా ఉపయోగించండి.. అద్భుత ఫలితాలు మీ సొంతం..
Fruits For Glowing Skin
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jan 03, 2023 | 6:17 PM

సహాజంగా లభించే పండ్లు మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలను అందిస్తాయి. వీటిలో పుష్కలంగా ఉండే విటమిన్లు, ప్రోటీన్లు, ఫైబర్లు, కార్బోహైడ్రేట్లు మన శరీరానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అందుకే ఆరోగ్య నిపుణులు కూడా నిత్యం పండ్లను తినాలని సూచిస్తుంటారు. ఈ పండ్లతో మన ఆరోగ్యానికే కాక మన  చర్మానికి కూడా అనేక ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా ముఖ చర్మం మెరిసిపోయేలా, అందంగా కనిపించేలా చేయడంలో ఇవి ప్రధాన పాత్ర పోషిస్తాయి. ప్రస్తుత కాలంలో ముఖ సౌందర్యం అనేది మనుషుల అర్హత, వ్యక్తి వ్యక్తిత్వానికి ప్రతీకగా మారిపోయింది. అలాంటి పరిస్థితుల కారణంగానే అనేక మంది తమకు సాధ్యమైనంతవరకూ.. అవసరమైతే లక్షల రూపాయలు వెచ్చించి మరి అందంగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. అందంగా కనిపించాలని, మెరిసే చర్మం కావాలనే కోరిక ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అందుకే చర్మ సంరక్షణ కోసం రకరకాల క్రీములు వాడుతుంటారు కొందరు. మాయిశ్చరైజర్లు, లోషన్లు  ముఖానికి, చర్మానికి అప్లై చేస్తుంటారు. చర్మ సంరక్షణలో లేదా మెరిసే చర్మం కోసం ఈ కాస్మొటిక్స్ కంటే మనం పాటించే ఆహారపు అలవాట్లు, జీవన విధానమే ఎక్కువగా ప్రభావం చూపుతాయి.

అయితే కాస్మొటిక్స్ చేయలేని మేలు సహజసిద్ధంగా లభించే కొన్ని రకాల పండ్లు చేయగలవు. మనకు తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల చర్మ సౌందర్య పాడవుతుంది. మెరిసిపోవాల్సిన చర్మం కళ తప్పి కనిపించడానిక మనం చేసే తప్పులే ప్రధాన కారణం. ఇలా చేయడం వల్లనే చిన్న వయస్సులోనే చర్మ ముడతలు బాధిస్తాయి. అందువల్ల చర్మ ఆరోగ్యం కోసం కొన్ని రకాల ఆహారాలను, పండ్లను మన ఆహారంలో భాగంగా తీసుకోవాలి. మరి చర్మ సంరక్షణ కోసం, ముఖం అందంగా కనిపించేందుకు, మెరిసే చర్మం పొందేందుకు ఏయే పండ్లను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

  1. అంజూర పండ్లు: కొన్ని అంజూర పండ్లను మెత్తగా చేసి దానిలో వాల్‌నట్‌ పేస్టు, కొద్దిగా పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసుకొని పావుగంట తరువాత పచ్చిపాలతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. ఫలితంగా మెరిసే చర్మం మన సొంతమవుతుంది.
  2. యాపిల్స్‌: ఒక యాపిల్‌‌ను నీళ్లలో ఉడికించి మెత్తగా చేయాలి. దీనిలో ఒక టీస్పూను తేనె కలిపి ముఖానికి రాసుకోవాలి. పదినిమిషాల తరువాత కడుక్కుంటే చర్మం మృదువుగా మారి మెరిసిపోతుంది.
  3. ఇవి కూడా చదవండి
  4. దానిమ్మ: దానిమ్మ గింజలతో వింటర్‌ స్క్రబ్‌ని తయారు చేసుకోవచ్చు. ఒక దానిమ్మకాయ గింజల్ని పేస్టు చేసి దానిలో రెండు టేబుల్‌స్పూన్ల బాదం గింజల పొడి, రెండు టీస్పూన్లు పాల పొడి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంతో చర్మాన్ని రుద్దుకొని ముందు పాలతో ఆ తరువాత గోరువెచ్చని నీళ్లతో కడిగేసుకోవాలి. అలా చేయడం వల్ల తక్షణమే గ్లోయింగ్ స్కిన్‌ను పొందవచ్చు.
  5. స్ట్రా‌బెర్రీ: చలికాలంలో చర్మ సంరక్షణ కోసం స్ట్రాబెర్రీలు ఎంతగానో సహాయపడతాయి. ఈ పండ్లతో స్క్రబ్‌ను తయారు చేయవచ్చు. స్ట్రాబెర్రీలను పేస్టులా చేసి దానిలో పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని పావుగంట తరువాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల చర్మం డీహైడ్రేషన అవ్వడం తగ్గుతుంది. తద్వారా మెరిసే చర్మం మన సొంతం అవుతుంది.
  6. నారింజ: నారింజ పండ్లతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ పండ్లతోనే కాక వీటి తొక్కలతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందుకోసం నారింజ తొక్కల్ని ఎండబెట్టి పొడి చేయాలి. ఈ పొడిలో కొద్దిగా పాలు, తేనె కలిపి స్క్రబ్‌ తయారు చేసుకోవచ్చు. దీన్ని వాడడం వల్ల చలికాలం చర్మం పగలడం, పొడిబారడం వంటివి తగ్గుతాయి
  7. బొప్పాయి: బొప్పాయి చర్మ సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. దీని ప్రయోజనాలను పొందడం కోసం ఒక కప్పు బొప్పాయి గుజ్జులో రెండు టీస్పూన్లు పైనాపిల్‌ జ్యూస్‌, ఒక్కో టీస్పూను చొప్పున గ్లిజరిన, పాలపొడి కలపాలి. ఈ మిశ్రమంతో ముఖానికి ప్యాక్‌ వేసి ఇరవైనిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై మొటిమలు, ఇతరత్రా కురుపులు, మచ్చలు త్వరగా తగ్గిపోతాయి. ఆపై ముఖ చర్మం మెరిసిపోతుంది.

హెచ్చరిక: ఈ కథనంలో అందించిన సమాచారం పాఠకుల ప్రయోజనాల కోసం రాసినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా సూచనను అనుసరించే ముందు దయచేసి వైద్యులను సంప్రదించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పాట్నాలో పుష్ప2 ట్రైలర్ రిలీజ్‌ వేడుక.. పోటెత్తిన ఫ్యాన్స్
పాట్నాలో పుష్ప2 ట్రైలర్ రిలీజ్‌ వేడుక.. పోటెత్తిన ఫ్యాన్స్
ఇండియాలో డయాబెటీస్ డేంజర్ బెల్స్
ఇండియాలో డయాబెటీస్ డేంజర్ బెల్స్
బ్యాగ్ వద్దకు పరిగెత్తుకు వెళ్లిన స్నిఫర్ డాగ్.. చెక్ చేయగా !!
బ్యాగ్ వద్దకు పరిగెత్తుకు వెళ్లిన స్నిఫర్ డాగ్.. చెక్ చేయగా !!
చావు బతుకుల్లో ఉన్నోడిని తన గొప్ప మనసుతో కాపాడిన తమన్
చావు బతుకుల్లో ఉన్నోడిని తన గొప్ప మనసుతో కాపాడిన తమన్
స్నేహతో.. అల్లు అర్జున్ ప్రేమ !! తెలియగానే నిర్మలమ్మ 1st రియాక్ష
స్నేహతో.. అల్లు అర్జున్ ప్రేమ !! తెలియగానే నిర్మలమ్మ 1st రియాక్ష
చిరుతో మొదలెట్టి ప్రభాస్‌ వరకు.. ఫ్యాన్స్‌కు బన్నీ పిచ్చ క్లారిటీ
చిరుతో మొదలెట్టి ప్రభాస్‌ వరకు.. ఫ్యాన్స్‌కు బన్నీ పిచ్చ క్లారిటీ
బన్నీ టీం మాస్టర్ ప్లాన్. అందుకే పుష్ప2 ట్రైలర్ రిలీజ్‌ బిహార్‌లో
బన్నీ టీం మాస్టర్ ప్లాన్. అందుకే పుష్ప2 ట్రైలర్ రిలీజ్‌ బిహార్‌లో
శివాలయంలో అరుదైన 2 తలల పాము !! పూజారి ఏం చేశారంటే ??
శివాలయంలో అరుదైన 2 తలల పాము !! పూజారి ఏం చేశారంటే ??
పోలీసులా.. మాజాకా !! ఇది చూశాక కూడా స్పీడ్‌గా నడిపే దమ్ముందా ??
పోలీసులా.. మాజాకా !! ఇది చూశాక కూడా స్పీడ్‌గా నడిపే దమ్ముందా ??
ఎంత పెద్ద ప్రమాదం పెళ్లికూతురికి రాసిపెట్టుంది... అందుకే !!
ఎంత పెద్ద ప్రమాదం పెళ్లికూతురికి రాసిపెట్టుంది... అందుకే !!