AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga Benefits: మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారా.. ఈ యోగాసనాలు ట్రై చేయండి.. నిద్రలేమి పారిపోతుంది..

యోగా మన శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంతో పాటు మన మానసిక ఆరోగ్యాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కనుక శారీరక, మానసిక ఆరోగ్యం కోసం మీరు కొన్ని యోగాసనాలను ప్రయత్నించవచ్చు. అదే విధంగా ప్రస్తుతం ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ నేపధ్యంలో ఒత్తిడిని తగ్గించడంలో సహాయ పడే యోగాసనాల గురించి యోగా నిపుణులు చెప్పారు. వీటిని చేయడం వలన ఒత్తడి తగ్గి.. హ్యాపీగా నిద్రపడుతుంది.

Surya Kala
|

Updated on: Jun 24, 2025 | 8:26 PM

Share
ఒత్తిడి ఇప్పుడు కొత్త విషయం కాదు. ఇది మన దినచర్యలో ఒక భాగంగా మారింది. మానసిక ఒత్తిడి తగ్గకపోతే సమస్య పెరుగుతుంది.  నిరాశ రూపంలోకి మారుతుంది. దీని నుంచి బయటపడటానికి, మందులు తీసుకునే బదులు.. యోగా సహాయం తీసుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాల్లో కోట్లాది మంది యోగా చేయడం ద్వారా రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలను పొందారు. ఇది సహజంగా ఒత్తిడిని తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది. కనుక ఒత్తిడిని తగ్గించగల యోగాసనాల గురించి నిపుణుల అభిప్రాయం తెలుసుకుందాం..

ఒత్తిడి ఇప్పుడు కొత్త విషయం కాదు. ఇది మన దినచర్యలో ఒక భాగంగా మారింది. మానసిక ఒత్తిడి తగ్గకపోతే సమస్య పెరుగుతుంది. నిరాశ రూపంలోకి మారుతుంది. దీని నుంచి బయటపడటానికి, మందులు తీసుకునే బదులు.. యోగా సహాయం తీసుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాల్లో కోట్లాది మంది యోగా చేయడం ద్వారా రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలను పొందారు. ఇది సహజంగా ఒత్తిడిని తగ్గించడం ద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి సహాయపడుతుంది. కనుక ఒత్తిడిని తగ్గించగల యోగాసనాల గురించి నిపుణుల అభిప్రాయం తెలుసుకుందాం..

1 / 8
యోగా నిపుణురాలు మాన్సి గులాటి మాట్లాడుతూ యోగా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని అన్నారు. యోగా  ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్‌ను కూడా తగ్గిస్తుంది, దీనివల్ల తక్కువ ఒత్తిడికి గురవుతారు. యోగా మీ నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఈ 6 యోగాసనాలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి అవి ఏమిటంటే..

యోగా నిపుణురాలు మాన్సి గులాటి మాట్లాడుతూ యోగా ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుందని అన్నారు. యోగా ఒత్తిడి హార్మోన్ కార్టిసాల్‌ను కూడా తగ్గిస్తుంది, దీనివల్ల తక్కువ ఒత్తిడికి గురవుతారు. యోగా మీ నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా ఈ 6 యోగాసనాలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి అవి ఏమిటంటే..

2 / 8

శవాసనం  
శవాసనం మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీని కోసం  మీరు సౌకర్యవంతమైన స్థితిలో పడుకోవాలి. ఇది మీ శరీరానికి విశ్రాంతిని ఇవ్వడమే కాదు మనస్సును కూడా ప్రశాంతపరుస్తుంది. ఈ ఆసనం దృష్టిని పెంచడంలో నిద్రలేమిని అధిగమించడంలో, మనస్సును ప్రశాంతపరచడంలో సహాయపడుతుంది.

శవాసనం శవాసనం మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీని కోసం మీరు సౌకర్యవంతమైన స్థితిలో పడుకోవాలి. ఇది మీ శరీరానికి విశ్రాంతిని ఇవ్వడమే కాదు మనస్సును కూడా ప్రశాంతపరుస్తుంది. ఈ ఆసనం దృష్టిని పెంచడంలో నిద్రలేమిని అధిగమించడంలో, మనస్సును ప్రశాంతపరచడంలో సహాయపడుతుంది.

3 / 8
బాలాసనం  
ఒత్తిడి సమస్య నుంచి బయటపడాలంటే బాలాసనం చేయాలి. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. బాలాసనం చేయడానికి.. మొదట మీ మోకాళ్లపై కూర్చుని, తరువాత మీ చీలమండలను కలిపి, గాలి పీల్చుకుంటూ, మొదట రెండు చేతులను పైకి లేపండి. ఆ తర్వాత గాలి వదులుతూ ముందుకు వంగి 5 నిమిషాలు ఈ స్థితిలో ఉండండి. ఈ యోగాసనం చేయడం ద్వారా మనస్సు రిలాక్స్‌గా ఉంటుంది.

బాలాసనం ఒత్తిడి సమస్య నుంచి బయటపడాలంటే బాలాసనం చేయాలి. ఇది మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. బాలాసనం చేయడానికి.. మొదట మీ మోకాళ్లపై కూర్చుని, తరువాత మీ చీలమండలను కలిపి, గాలి పీల్చుకుంటూ, మొదట రెండు చేతులను పైకి లేపండి. ఆ తర్వాత గాలి వదులుతూ ముందుకు వంగి 5 నిమిషాలు ఈ స్థితిలో ఉండండి. ఈ యోగాసనం చేయడం ద్వారా మనస్సు రిలాక్స్‌గా ఉంటుంది.

4 / 8
సుఖాసనం 
సుఖాసన ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీని కోసం కాలు మీద కాలు వేసి కూర్చోండి.. తరువాత కళ్ళు మూసుకోండి. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. కొన్ని నిమిషాలు ఈ ఆసనంలో కూర్చోండి. ఈ ఆసనంలో, మీరు మీ నడుము, మెడ , వెన్నెముకను నిటారుగా ఉంచాలి. మీరు చిన్న విషయాల గురించి కూడా ఒత్తిడికి గురైతే.. ఈ ఆసనం మీకు ఉత్తమమైనది.

సుఖాసనం సుఖాసన ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. దీని కోసం కాలు మీద కాలు వేసి కూర్చోండి.. తరువాత కళ్ళు మూసుకోండి. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. కొన్ని నిమిషాలు ఈ ఆసనంలో కూర్చోండి. ఈ ఆసనంలో, మీరు మీ నడుము, మెడ , వెన్నెముకను నిటారుగా ఉంచాలి. మీరు చిన్న విషయాల గురించి కూడా ఒత్తిడికి గురైతే.. ఈ ఆసనం మీకు ఉత్తమమైనది.

5 / 8

మార్జారి ఆసనం లేదా పిల్లి ఆవు భంగిమ
ఒత్తిడిని తగ్గించడానికి పిల్లి-ఆవు భంగిమ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని కోసం మీరు నేలపై మోకరిల్లి, ఆపై మీ చేతులను మీ ముందు నేలపై ఉంచాలి. తర్వాత మీ వీపును క్రిందికి వంచి, మీ తలను పైకి తీసుకువచ్చి దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. ఈ ఆసనంలో మీరు ఆవులా కూర్చోవాలి. హెల్త్‌లైన్ ప్రకారం ఈ ఆసనం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

మార్జారి ఆసనం లేదా పిల్లి ఆవు భంగిమ ఒత్తిడిని తగ్గించడానికి పిల్లి-ఆవు భంగిమ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. దీని కోసం మీరు నేలపై మోకరిల్లి, ఆపై మీ చేతులను మీ ముందు నేలపై ఉంచాలి. తర్వాత మీ వీపును క్రిందికి వంచి, మీ తలను పైకి తీసుకువచ్చి దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. ఈ ఆసనంలో మీరు ఆవులా కూర్చోవాలి. హెల్త్‌లైన్ ప్రకారం ఈ ఆసనం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

6 / 8
 కపలాభతి  
కపాలభాతి ప్రాణాయామం మీ మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీని కోసం సుఖాసనంలో కూర్చుని, వెన్నెముకను నిటారుగా ఉంచి దీర్ఘంగా శ్వాసలను తీసుకోండి. ఈ సమయంలో మీరు మీ కడుపుని లోపలికి లాగుతూ గాలిని పీల్చుకుని, ఆపై గాలిని వదులుతూ ఉండాలి. ఈ ఆసనం మీ శరీరాన్ని సమతుల్యంగా ఉంచడంతో పాటు ఒత్తిడిని తగ్గిస్తుంది.

కపలాభతి కపాలభాతి ప్రాణాయామం మీ మానసిక ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దీని కోసం సుఖాసనంలో కూర్చుని, వెన్నెముకను నిటారుగా ఉంచి దీర్ఘంగా శ్వాసలను తీసుకోండి. ఈ సమయంలో మీరు మీ కడుపుని లోపలికి లాగుతూ గాలిని పీల్చుకుని, ఆపై గాలిని వదులుతూ ఉండాలి. ఈ ఆసనం మీ శరీరాన్ని సమతుల్యంగా ఉంచడంతో పాటు ఒత్తిడిని తగ్గిస్తుంది.

7 / 8
భుజంగాసనం 
భుజంగాసనము చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. దీనికోసం మీ పొట్ట మీద పడుకుని, మీ చేతులను నేలపై ఉంచండి. తరువాత మీ తల పైకెత్తి ముందుకు చూడండి. ఈ భంగిమలో దాదాపు 5 నిమిషాలు ఉండండి. ఈ ఆసనం చేస్తున్నప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకొని నెమ్మదిగా గాలిని వదలండి. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో మీకు సహాయపడే కొన్ని యోగాసనాలను మేము మీకు చెప్పాము. కనుక ఈ యోగాసనాలను ప్రతిరోజూ ప్రయత్నించండి. ఇవి మీ ఒత్తిడిని తగ్గిస్తాయి.

భుజంగాసనం భుజంగాసనము చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. దీనికోసం మీ పొట్ట మీద పడుకుని, మీ చేతులను నేలపై ఉంచండి. తరువాత మీ తల పైకెత్తి ముందుకు చూడండి. ఈ భంగిమలో దాదాపు 5 నిమిషాలు ఉండండి. ఈ ఆసనం చేస్తున్నప్పుడు దీర్ఘంగా శ్వాస తీసుకొని నెమ్మదిగా గాలిని వదలండి. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో మీకు సహాయపడే కొన్ని యోగాసనాలను మేము మీకు చెప్పాము. కనుక ఈ యోగాసనాలను ప్రతిరోజూ ప్రయత్నించండి. ఇవి మీ ఒత్తిడిని తగ్గిస్తాయి.

8 / 8