Beauty Tips: ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా? ఐతే ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి..
వయసు పెరిగే కొద్దీ చర్మంపై ముడతలు రావడం సహజం. ఐతే ప్రస్తుత జీవనశైలి, ఆహార అలవాట్ల కారణంగా ఈ సమస్య చిన్న వయసులోనే ప్రారంభమవుతుంది. ఫలితంగా అసలు వయసు కంటే కూడా పెద్ద వాళ్లలా..
How to Prevent Wrinkles: వయసు పెరిగే కొద్దీ చర్మంపై ముడతలు రావడం సహజం. ఐతే ప్రస్తుత జీవనశైలి, ఆహార అలవాట్ల కారణంగా ఈ సమస్య చిన్న వయసులోనే ప్రారంభమవుతుంది. ఫలితంగా అసలు వయసు కంటే కూడా పెద్ద వాళ్లలా కన్పిస్తుంటారు. ముఖంపై ఏర్పడే ముడతల నివారణకు కొన్ని ఫేస్ ప్యాక్‌లను సూచిస్తున్నారు నిపుణులు. ఈ చిట్కాలతో ఎక్కువ కాలం ముఖంపై ముడతలు రాకుండా నివారిస్తాయి. అవేంటో తెలుసుకుందాం..
నిమ్మ – తేనె ఫేస్ ప్యాక్
ఒక గిన్నెలో కొంచెం తేనె తీసుకుని, దానికి కొన్ని చుక్కల నిమ్మరసం కలుపుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి, 10 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ముఖాన్ని మాయిశ్చరైజ్ చేసుకోవాలి. ఇది చర్మం pH స్థాయిని సమతుల్యం చేసి, మృదువుగా చేస్తుంది. నిమ్మకాయలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ముఖంపై ముడతలు తొలగించడానికి పని చేస్తారు.
అరటి – పెరుగు ఫేస్ ప్యాక్
గుజ్జు అరటిపండులో ఒక స్పూన్ నారింజ రసం, సాధారణ పెరుగు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖం, మెడపై అప్లై చేసుకుని 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ముడతలను తొలగించడానికి పనిచేస్తుంది. ఇది చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
దోసకాయ రసం ఫేస్ ప్యాక్
ఒక గిన్నెలో దోసకాయ రసం తీసుకుని ముఖంపై మసాజ్ చేసుకోవాలి. ఆరిపోయేంత వరకు అలాగే ఉంచుకుని ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది ముడతలను తొలగించడంలో సహాయపడుతుంది. కీరదోసకాయలో మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
కొబ్బరి నూనే ఫేస్ ప్యాక్
ప్రతి రాత్రి నిద్రపోయే ముందు కొంచెం కొబ్బరి నూనె తీసుకుని ముఖంపై 10 నిముషాల పాటు మసాజ్ చేసుకోవాలి. ముఖంపై ముడుతలను తొలగించడంలో ఈ చిట్కా చక్కగా పనిచేస్తుంది. ఇది ముఖం మెరిసేలా చేస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది.