AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఎవర్రా సామీ నువ్వు.. క్యాచ్ కోసం ప్రాణాలే లెక్క చేయలేగా.. టీ20 ప్రపంచకప్ 2026లో బెస్ట్..?

Brian Bennett Stunning Catch: ఓమన్‌తో జరిగిన మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఓమన్ జట్టు 103 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే జట్టు 13.3 ఓవర్లలో 106 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జింబాబ్వే జట్టు ఇప్పుడు తన తదుపరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది.

Video: ఎవర్రా సామీ నువ్వు.. క్యాచ్ కోసం ప్రాణాలే లెక్క చేయలేగా.. టీ20 ప్రపంచకప్ 2026లో బెస్ట్..?
Brian Bennett Catch
Venkata Chari
|

Updated on: Feb 10, 2026 | 9:41 PM

Share

Zimbabwe Player Brian Bennett Catch: టీ20 ప్రపంచ కప్ 8వ మ్యాచ్‌లో జింబాబ్వే ఆటగాడు బ్రియాన్ బెన్నెట్ అద్భుతమైన క్యాచ్‌తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఒమన్, జింబాబ్వే జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో, జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఒమన్ ఆశించిన ఆరంభాన్ని పొందలేదు. కేవలం 27 పరుగులు చేసే సమయానికి వారి టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లలో ఐదుగురు పెవిలియన్ చేరారు. ఈ దశలో బరిలోకి దిగిన నదీమ్ ఖాన్ 18 బంతుల్లో 20 పరుగులు చేశాడు.

కానీ, చివరి ఓవర్లో బ్రియాన్ బెన్నెట్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో బ్రాడ్ ఎవాన్స్ నదీమ్ ఖాన్ పెవిలియన్ చేరాల్సి వచ్చిది. 20వ ఓవర్ ఐదవ బంతికి నదీమ్ ఖాన్ దానిని డీప్ మిడ్-వికెట్ వైపు కొట్టాడు. బౌండరీ లైన్ నుంచి పరిగెత్తిన బ్రియాన్ బెన్నెట్ అద్భుతమైన డైవ్‌తో బంతిని క్యాచ్‌గా తీసుకున్నాడు.

బ్రియాన్ బెన్నెట్ తీసుకున్న ఈ అద్భుతమైన క్యాచ్‌తో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం ఈ క్యాచ్‌ను 2026 టీ20 ప్రపంచ కప్‌లో అత్యుత్తమ క్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు. రాబోయే మ్యాచ్‌లలో ఎవరు మెరుగైన క్యాచ్ తీసుకుంటారో అని క్రికెట్ ప్రేమికులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తు్న్నారు.

మొదట బ్యాటింగ్ చేసిన ఒమన్ 19.5 ఓవర్లలో 103 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో జింబాబ్వే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ 36 బంతుల్లో 7 ఫోర్లతో సహా అజేయంగా 48 పరుగులు చేశాడు.

బెన్నెట్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో, జింబాబ్వే 13.3 ఓవర్లలో 106 పరుగులు చేసి 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జింబాబ్వే ఇప్పుడు ఫిబ్రవరి 13న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.

ఆస్ట్రేలియాతో మ్యాచ్ తర్వాత జింబాబ్వే ఐర్లాండ్, శ్రీలంకతో తలపడుతుంది. అంటే జింబాబ్వే ఆసీస్ చేతిలో ఓడిపోయినా, శ్రీలంక, ఐర్లాండ్‌లను ఓడించి సూపర్-8 దశకు చేరుకునే అవకాశం ఉంది. అందువల్ల, తదుపరి మ్యాచ్‌లలో కూడా జింబాబ్వే నుంచి తీవ్రమైన పోటీని ఆశించవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..