Womens Day: మహిళలూ.. కాస్త మీ ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోండి.

ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన తర్వాత జీర్ణ వ్యవస్థ బలహీనంగా మారేది. కానీ ప్రస్తుతం జీవక్రియ మందగించడం 30 ఏళ్ల నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి 30 ఏళ్లలోకి ఎంటర్‌ కాగానే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 20 ఏళ్ల వయసులో ఏది తిన్న జీర్ణమవుతుంది, కానీ 30 ఏళ్ల తర్వాత జీవక్రియ నెమ్మదికావడం కారణంగా, కేలరీల బర్నింగ్...

Womens Day: మహిళలూ.. కాస్త మీ ఆరోగ్యం గురించి కూడా పట్టించుకోండి.
Women Health
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 07, 2024 | 8:26 PM

ఇంట్లో ఉండే కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి నిత్యం ఆలోచించే వారిలో మహిళలే ముందుంటారు. ఇంట్లో ఉండే వారందరీ అవసరాలను తీరుస్తుంటారు. కానీ తమ ఆరోగ్యం గురించి ఎప్పుడూ పట్టించుకోరు. అనారోగ్యం బారినా పని చేస్తూనే ఉంటారు. అయితే మహిళలు వయసు పెరుగుతున్నాకొద్దీ అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. అందుకే 30 ఏళ్లు ఎంటర్‌కాగానే మహిళలు తమ ఆరోగ్యం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 30 ఏళ్లలోకి ఎంటర్‌ అవుతోన్న మహిళలు తమ ఆరోగ్యం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఉమెన్స్‌ డే రోజు సందర్భంగా తెలుసుకుందాం..

ఒకప్పుడు 50 ఏళ్లు దాటిన తర్వాత జీర్ణ వ్యవస్థ బలహీనంగా మారేది. కానీ ప్రస్తుతం జీవక్రియ మందగించడం 30 ఏళ్ల నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి 30 ఏళ్లలోకి ఎంటర్‌ కాగానే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 20 ఏళ్ల వయసులో ఏది తిన్న జీర్ణమవుతుంది, కానీ 30 ఏళ్ల తర్వాత జీవక్రియ నెమ్మదికావడం కారణంగా, కేలరీల బర్నింగ్ ప్రక్రియ మందగిస్తుంది. సరైన ఆహారం తీసుకోకపోతే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ముప్పై ఏళ్లు దాటిన తర్వాత బరువు అదుపులో ఉండేలా ఆహారంలో మార్పులు చేసుకోవాలి.

మహిళలు 30 ఏళ్ల తర్వాత వారు తీసుకునే ఆహారంలో ఫైబర్‌ కంటెంట్ ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం తృణధాన్యాలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఐరన్‌ లోపాన్ని జయించేందుకు ఆకుపచ్చ కూరగాయలు తీసుకోవాలి. ముఖ్యంగా ఆహారంలో కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, గింజలు, బీన్స్ వంటి వాటిని చేర్చుకోవాలి. అలాగే వీలైనంత వరకు ఎక్కువగా నీరు తాగాలి. నీటితో జీవక్రియ వేగంగా ఉంటుంది, శరీరం నుంచి టాక్సిన్స్ బయటకు వెళ్తాయి.

ఇక 30 ఏళ్లు నిండిన తర్వాత మహిళలు కచ్చితంగా వ్యాయామం, యోగా వంటివి చేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇది మీ శరీరం ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది. స్టామినాని కూడా కాపాడుతుంది. రోజూ నడవడం అలవాటు చేసుకోండి, తద్వారా మీ బరువు అదుపులో ఉంటుంది. అలాగే యోగా ఒత్తిడిని జయించేందుకు సహాయపడుతుంది. 30 ఏళ్లు నిండిన మహిళలు స్వీట్లను తక్కువగా తీసుకోవాలి. 35 ఏళ్ల తర్వాత టైప్ 2 డయాబెటిస్ బారినపడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. 30 ఏళ్ల తర్వాత గుండె ఆరోగ్యంపై కూడా దృష్టిసారించాలి. అదనపు కొలెస్ట్రాల్‌ ఉండే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
భారత్‌-జర్మనీ మధ్య సుస్థిర అభివృద్ధికి రోడ్‌మ్యాప్‌..!
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..