శీతాకాలంలో ప్రజలు వేడి ఆహార పదార్థాలను తినాలని, చల్లని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని కోరతారు. దీని కారణంగా ప్రజలు కొన్ని పోషక పొరపాట్లను చేస్తారు.
ఈ సీజనల్ లో దొరికే కమలా ఫలంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అయితే శీతాకాలంలో దగ్గు, జలుబు వస్తుందని భావించి తినరు. ఈ విషయంపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకోండి
సిట్రస్ జాతికి చెందిన కమలా ఫలంలో విటమిన్ సి మాత్రమే కాదు ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, ఫైబర్, పొటాషియం, బి6 వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.
శీతాకాలంలో కమలా ఫలానికి మాత్రమే కాదు నిమ్మ, ఉసిరి మొదలైన పండ్లకు కూడా దూరంగా ఉంటారు.
జైపూర్‌కు చెందిన ఆయుర్వేద వైద్యలు మాట్లాడుతూ చలికాలంలో కమలా ఫలం, నిమ్మ, ఉసిరి వంటి పుల్లని పండ్లను తీసుకోవడం మంచిదని చెప్పారు. ఎందుకంటే వీటిల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది
విటమిన్ సి పుష్కలంగా ఉండటం వలన కమలా ఫలం , నిమ్మ, ఉసిరికాయ వంటి సిట్రస్ పండ్లు సీజనల్ వ్యాధుల నుంచి రక్షించడంలో ప్రభావవంతంగా ఉంటాయి.
చలికాలంలో పగలు పుల్లని పండ్లను తినాలి. అంటే ఈ సీజనల్ పండ్లను మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల మధ్య తినడం మంచిది.