చలికాలం నువ్వులు తింటే.. శరీరంలో జరిగే మార్పులివే 

Narender Vaitla

21 November 2024

చలికాలంలో గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే నువ్వులను ఆహారంలో భాగం చేసుకోవడం ఆ సమస్య నుంచి యబటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.

నువ్వుల్లో మెగ్నీషియం కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును అదుపు చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని లిగ్నన్స్, ఈ విటమిన్, ఇతర యాంటీఆక్సిడంట్లు ధమనుల్లో పలకలు పేరుకుపోకుండా నిరోధిస్తాయి.

ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా నువ్వులు బాగా ఉపయోగపడతాయి. వీటిలోని క్యాల్షియం కంటెంట్‌ ఎముకలను బలంగా మార్చడంలో దోహదపడతాయి.

చలికాలంలో కీళ్ల నొప్పులు రావడం సర్వసాధారణం. ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టడంలో నువ్వులు బాగా ఉపయోగపడతాయి. నువ్వుల్లో ఉండే సెసామిన్ అనే సమ్మేళనం యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షలు కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

థైరాయిడ్‌ బాధితులకు కూడా నువ్వులు మేలు చేస్తాయి. నువ్వుల్లో ఉండే సెలీనియం థైరాయిడ్ పేషెంట్లకు బాగా ఉపయోగపడతాయని నిపుణులు సూచిస్తున్నారు. 

నువ్వుల్లో ఫైబర్‌ కంటెంట్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.