Winter Tips: నూనె లేదా బాడీ లోషన్ చలికాలంలో చర్మానికి ఏది మేలు? ఏ టైప్ చర్మం వారు ఏది వాడాలంటే

|

Dec 11, 2024 | 7:47 PM

చలికాలంలో శరీరం డీ హైడ్రేట్ గా మారుతుంది. దాహం లేదంటూ తక్కువగా నీరు తాగడమే కాదు వాతావరణంలో మార్పుల వలన చాలా మంది స్కిన్ బిగుతుగా మారుతుంది. కొందరు దద్దుర్లు, దురదలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. పొడి చర్మాన్ని హైడ్రేట్ గా మార్చుకోవడానికి కొంత మంది బాడీ లోషన్ లేదా బాడీ ఆయిల్ ఉపయోగిస్తారు. అయితే ఈ రెండిటిలో ఏది బెస్ట్ తెలుసుకుందాం..

Winter Tips: నూనె లేదా బాడీ లోషన్ చలికాలంలో చర్మానికి ఏది మేలు? ఏ టైప్ చర్మం వారు ఏది వాడాలంటే
Body Oil Vs Body Lotion
Follow us on

శీతాకాలం చాలా మందికి ఇష్టమైనది. అదే సమయంలో చాలా మందికి రకరకాల సమస్యలు వస్తాయి. ఈ సమయంలో చాలా మంది చర్మం బిరుసుగా, పగినట్లు గా, పొడిగా మారుతుంది. చర్మం తేమను కోల్పోతుంది. చలికాలంలో చాలా మంది శరీరాలు పగిలిపోయేంతగా మారతాయి. చాలా మందికి దద్దుర్లు, దురదలు వస్తాయి. చలికాలపు పొడి చర్మం నుంచి ఉపశమనం కోసం బాడీ లోషన్ లేదా బాడీ ఆయిల్ ఉపయోగించాలా అనే విషయం తెలుసుకుందాం..

బాడీలోషన్ అయినా, బాడీ ఆయిల్ అయినా.. చలికాలంలో వీటిని ఉపయోగించడం చాలా ముఖ్యం. ఎందుకో తెలుసా? శీతాకాలపు పొడి గాలిలో మన చర్మం తేమను కోల్పోతుంది. ఈ సమస్యను నివారించడానికి బాడీ లోషన్ లేదా బాడీ ఆయిల్ ఉపయోగించడం అవసరం. కొంత మంది శరీరం జిడ్డుగా ఉంటుంది. ఇలాంటి వారు నూనే రాసుకుంటే మరింత జిడ్డుగా మారుతుంది. కనుక బాడీ లోషన్‌ వాడొచ్చు.

చర్మ రకాన్ని బట్టి బాడీ లోషన్ లేదా బాడీ ఆయిల్ ఎంపిక చేసుకోవాలి. చర్మం చాలా పొడిగా ఉంటే షియా బటర్, ఆర్గాన్ ఆయిల్ లేదా కోకో బటర్‌తో కూడిన బాడీ లోషన్‌ను ఉపయోగించండి. అదే సమయంలో జిడ్డుగల చర్మం కలిగి ఉంటే తేలికపాటి, ఆస్ట్రింజెంట్ బాడీ లోషన్‌ను ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

కొందరికి బాడీ లోషన్ కంటే ఆయిల్ బెస్ట్ ఎంపిక ఎందుకంటే

  1. బాడీ ఆయిల్ చర్మాన్ని చాలా కాలం పాటు రక్షిస్తుంది.
  2. బాడీ లోషన్ చాలా త్వరగా చర్మంలోకి శోషించబడుతుంది.
  3. బాడీ లోషన్ కంటే బాడీ ఆయిల్ చర్మాన్ని మృదువుగా చేస్తుంది.
  4. బాడీ ఆయిల్ మసాజ్ చేయడం వల్ల చర్మానికి రక్త ప్రసరణ పెరుగుతుంది. చర్మ కణాలకు పోషణ లభిస్తుంది.
  5. బాడీ ఆయిల్ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది. స్నానం చేసిన తర్వాత చర్మం తడిగా ఉన్నప్పుడే బాడీ ఆయిల్ అప్లై చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
  6. రాత్రి పడుకునే ముందు బాడీ ఆయిల్ రాసుకోవచ్చు. ఇలా చేయడం వలన రాత్రి సమయంలో చర్మాన్ని బాగా తేమగా ఉంటుంది.

 

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను నేరుగా సంప్రదించండి.)