AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Winter Melon: బూడిద గుమ్మడితో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు… అవేంటో తెలిస్తే అవ్వాకవ్వాల్సిందే..!

కొన్ని ప్రాంతాల్లో బూడిద గుమ్మడిని వడియాలుగా పెట్టుకుని పప్పు వండినప్పడు నంజుకోడానికి వాడుతుంటారు. పప్పులో బూడిద గుమ్మడి వడియం కాంబినేషన్ నచ్చని వారు ఎవరూ ఉండరు. అయితే బూడిద గుమ్మడిని ఈ అవసరాల కోసమే కాకుండా ఎక్కువగా తింటే చాలా ఆరోగ్య సమస్యలు పోతాయని నిపుణులు చెబుతున్నారు.

Winter Melon: బూడిద గుమ్మడితో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు… అవేంటో తెలిస్తే అవ్వాకవ్వాల్సిందే..!
Winter Melon
Nikhil
|

Updated on: Jan 30, 2023 | 6:05 PM

Share

వింటర్ మెలన్ అంటే ఏంటో తెలుసా? తెలుగువారందరికీ సుపరిచితమైన బూడిద గుమ్మడిని చాలా ప్రాంతాంల్లో వింటర్ మెలన్ లేదా పెటా అని పిలుస్తున్నారు. సాధారణంగా ఇంటికి దిష్టి పోవడం కోసం అంటూ బూడిద గుమ్మడిని గుమ్మం వద్ద వేలాడిస్తుంటారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో బూడిద గుమ్మడిని వడియాలుగా పెట్టుకుని పప్పు వండినప్పడు నంజుకోడానికి వాడుతుంటారు. పప్పులో బూడిద గుమ్మడి వడియం కాంబినేషన్ నచ్చని వారు ఎవరూ ఉండరు. అయితే బూడిద గుమ్మడిని ఈ అవసరాల కోసమే కాకుండా ఎక్కువగా తింటే చాలా ఆరోగ్య సమస్యలు పోతాయని నిపుణులు చెబుతున్నారు. బూడిద గుమ్మడిలో దాదాపు 96 శాతం నీరే ఉంటుంది. అలాగే ప్రోటీన్లు, క్యాలరీలు, కొవ్వు, కార్భోహైడ్రేట్లు అన్నీ కూడా చాలా తక్కువ ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు బూడిద గుమ్మడి చాలా మేలు చేస్తుంది. అలాగే బరువు తగ్గాలనుకునే వారు రోజు వారీ ఆహారంలో బూడిద గుమ్మడిని యాడ్ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బూడిద గుమ్మడి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం. 

ఆరోగ్యకరమైన జీర్ణక్రియ

బూడిద గుమ్మడికాయలో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది ఆహారం జీర్ణం కావడానికి జెల్ లాంటి పదార్థాన్ని రిలీజ్ చేస్తుంది. అలాగే ఆహారం కూడా పూర్తిగా జీర్ణం కావడంలో సాయం చేస్తుంది. 

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలం

బూడిద గుమ్మడి కాయలో పాలిఫెనాల్స్, ఫెవనాయుడ్లు, ఆంథోసైనిన్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇది ప్రీరాడికల్స్ వల్ల కలిగే సెల్ డ్యామెజ్ ను తట్టుకుంటుంది. తీవ్రమైన హాని కలిగించే ప్రీ రాడికల్స్ సమ్మేళనాలతో పోరాడడం ద్వారా యాంటిఆక్సిడెంట్లు మన శరీరానికి మంచి చేస్తాయి. 

ఇవి కూడా చదవండి

గుండె ఆరోగ్యం మెరుగు

బూడిద గుమ్మడికాయలో అధిక శాతం పొటాషియం, విటమిన్ -సి ఉంటాయి. దీని వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. వాసోడిలైటర్ గా పొటాషియం, రక్త కేశనాలికలు, ధమనులను సడలిస్తుంది. దీంతో రక్తాన్ని మరింత స్వేచ్ఛగా ప్రవహించేలా సాయం చేస్తుంది. అలాగే గుండెపోటు వచ్చే అవకాశాన్ని తగ్గిస్తుంది.

మెరుగైన రోగనిరోధక శక్తి 

విటమిన్ -సి, రోబోఫ్లెవిన్ పుష్కలంగా ఉండే బూడిద గుమ్మడి ద్వారా శరీరంలోని రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. ప్రీ రాడికల్స్ ను తటస్తం చేస్తుంది. అలాగే కణాల మ్యూటేషన్ ను నిరోధించడానికి యాంటీ ఆక్సిడెంట్ గా కూడా పని చేస్తుంది. దీంతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

యాంటి ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు

బూడిద గుమ్మడికాయలో ఎక్కువగా గాలిక్ యాసిడ్ ఉంటుంది. తద్వారా శరీరంలో యాంటి ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు పెరుగుతాయి. కాబట్టి బూడిద గుమ్మడిని విరివిగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు.