AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Saffron: కుంకుమపువ్వుతో ప్రయోజనాలెన్నో.. ఇలా చేసుకుని తీసుకుంటే అదిరిపోయే బెనెఫిట్స్..

కుంకుమపువ్వు.. ఈ పేరు వినగానే కాశ్మీర్ గుర్తుకొస్తుంది. ఎందుకంటే మనదేశంలో కాశ్మీర్ లో మాత్రమే పండుతుంది. కుంకుమ పువ్వులో అనేక ఔష‌ధ గుణాలున్నాయి. ఆయుర్వేదంలోనూ కుంకుమ పువ్వుకు విశిష్ట స్థానం ఉంది. ఇది వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు...

Ganesh Mudavath
|

Updated on: Jan 30, 2023 | 7:06 PM

Share
పుత్తడితో తులతూగే కుంకుమపువ్వులో నిజంగానే బంగారంలాంటి ఔషధ గుణాలు ఉన్నాయి. రంగు, రుచి వాసనా ఉన్న అరుదైన సుగంధ ద్రవ్యమే కుంకుమపువ్వు. అందుకే ఇది అందరికీ ‘ప్రియమైన ఎర్ర బంగారం.  కుంకుమపువ్వు తో తయారు చేసిన టీ తాగడం వలన మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది.

1 / 5
మానసికంగా ఒత్తిడితో ఉన్నప్పుడు.. లేదా టెన్షన్‌గా ఉన్నప్పుడు ఒక కప్పు కుంకుమపువ్వు కలిపిన పాలు తాగాలి. వెంటనే మీ ఒత్తిడి లేదా  డిప్రెషన్ నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇదే అనేక అధ్యయనాలు పేర్కొన్నాయి. అంతేకాదు యాంటిడిప్రెసెంట్ లక్షణాలు ఒత్తిడి లేదా డిప్రెషన్‌ను తగ్గిస్తుంది.

2 / 5
మహిళలకు రుతుక్రమ సమయంలో వచ్చే నొప్పి నుంచి మంచి ఉపశమనం ఇస్తుంది. కనుక రుతుక్రమ సమయంలో ఒక కప్పు వేడి కుంకుమపువ్వు టీ నొప్పిని తగ్గించడమే కాదు.. శరీరాన్ని శక్తివంతంగా చేస్తుంది.  ప్రీమెన్‌స్ట్రువల్ సిండ్రోమ్  లక్షణాలను నియంత్రిస్తుంది.

3 / 5
కుంకుమపువ్వులో యాంటీఆక్సిడెంట్ల అధికంగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఇన్ఫ్లమేటరీ లక్షణాలు, రోగనిరోధక శక్తిని పెంచడంలో,  రక్త నాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగుప రుస్తుంది. అంతేకాదు రక్తపోటు,  కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

4 / 5
నాడీవ్యవస్థను బలోపేతం చేస్తుంది: కుంకుమపువ్వు చిటికెడు పాలల్లో వేసుకొని తాగుతూ ఉంటే ఇది నాడీవ్యవస్థను బలోపేతం చేస్తుంది, మెదడుకు ఆక్సీకరణ హానిని నివారిస్తుంది, అల్జీమర్స్ వంటి వ్యాధులను దూరం చేస్తుంది. కుంకుమపువ్వును బిర్యానీలో కూడా కలుపుతారు.

5 / 5
Follow Us