
ఇప్పుడు దాదాపు ప్రతి ఇంట్లో వంట కోసం ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్‌ను ఉపయోగిస్తున్నారు. LPG గ్యాస్ సహాయంతో వంట చేయడం మహిళలకు చాలా సులభంగా, ఆరోగ్య వంతంగా మారింది. గ్యాస్ స్టౌవ్‌పై వంట చేయడానికి మనవాళ్లకు పెద్దగా శ్రమపడాల్సిన కష్టం తీరిపోయింది. సాంప్రదాయ పాత విధానంలోగా ఎక్కువ సమయం, శ్రమ అవసరం లేకుండా పోయింది. అందువల్ల, ఇది చిన్న గ్రామాలు, పట్టణాలు మొదలు..నగరాల్లో విస్తృతంగా LPG గ్యాస్ ఉపయోగిస్తున్నారు ప్రజలు. అయితే, మీ ఇంట్లో ఉండే ఈ LPG సిలిండర్ ఎరుపు రంగులోనే ఎందుకు ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా?
ఎరుపు రంగు అంటేనే ప్రమాదానికి చిహ్నం. గ్యాస్ సిలిండర్ అంటే ప్రమాదకరమే. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని కంపెనీ సిలిండర్‌కు ఎరుపు రంగును వేస్తుంది. ఎరుపు రంగును హెచ్చరికకు చిహ్నంగా చెబుతాం. ఎల్‌పీజీ సిలిండర్‌లో కూడా మండే వాయువు ఉంటుంది. ఈ కారణంగానే సిలిండర్ వల్ల కూడా ప్రమాదం ఉంటుందని మనందరికీ తెలిసిందే. వినియోగదారుల భద్రత కోసం గ్యాస్ సిలిండర్లకు ఎరుపు రంగు వేస్తారు. ఎరుపు రంగు అనేది ప్రమాదాలకు చిహ్నం కనుక దూరం నుంచి కూడా ఎరుపు రంగును ఈజీగా గుర్తించే అవకాశం ఉంటుంది. అందుకే సిలిండర్‌కు ఈ రంగు వేయడానికి కారణమని తెలుస్తోంది.
అయితే, గ్యాస్ సిలిండర్ ఆకారం ఎందుకు గుండ్రంగా ఉంటుంది? అనేది కూడా చాలా మందిలో ఎదురయ్యే సందేహం.. అయితే, సిలిండర్ గుండ్రంగా ఉండటానికి అతి ముఖ్యమైన కారణం దానిలోని వాయువుపై ఒత్తిడిని సృష్టించడం. గుండ్రని ఆకారం సిలిండర్‌లోని గ్యాస్‌ను ఒత్తిడి చేయడం, కుదించడం సులభం చేస్తుంది. అలాగే, గుండ్రని ఆకారం సిలిండర్‌ను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకెళ్లడం సులభం అవుతుంది. ఈ కారణాల వల్ల, సిలిండర్ ఆకారం గుండ్రంగా ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..