ఇలా చేశారంటే.. గ్యాస్ స్టవ్ బర్నర్ మురికి మటుమాయం.. తళతళలాడుతుంది..

Prudvi Battula 

Images: Pinterest

12 December 2025

మనం వంటకి ప్రతిరోజూ గ్యాస్ స్టవ్ వాడుతున్నప్పుడు బర్నర్ మీద దుమ్ము, ధూళి, నూనె పేరుకుపోయి బర్నర్ వెంట్లు మూసుకుపోయి వెలిగించిన మంట ఎక్కువగా మండదు.

గ్యాస్ స్టవ్

మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక చిక్కని చిట్కాతో బర్నర్ శుభ్రం అయిపోతుంది. ఖర్చు లేకుండా కొన్ని నిమిషాల్లో బర్నర్‌ను ప్రకాశవంతంగా వెలిగిపోతుంది.

బర్నర్‌ను ప్రకాశవంతంగా వెలిగిపోతుంది

గ్యాస్ స్టవ్ శుభ్రం చేయడానికి 2 కప్పుల వేడి నీరు, నిమ్మరసం లేదా 1 టేబుల్ స్పూన్ వెనిగర్, యాంటాసిడ్ పౌడర్ కావాలి.

కావలసిన పదార్థాలు

ఒక గిన్నెలో బర్నర్ మునిగిపోయేంత వేడి నీటిని పోసి, నిమ్మరసం లేదా తెల్ల వెనిగర్ కలపండి. నిమ్మకాయ లేదా వెనిగర్ మురికిని తొలగించడానికి సహాయపడుతుంది.

ఎలా శుభ్రం చేయాలి?

ఇప్పుడు గ్యాస్ బర్నర్‌ను ఈ ద్రావణంలో ముంచి, ఆపై బర్నర్‌పై ఈనో పౌడర్‌ను చల్లి 10 నిమిషాలు అలాగే ఉంచండి. మధ్యలో ఒకసారి బర్నర్‌ను తిప్పండి.

10 నిమిషాలు ఉంచండి

10 నిమిషాల తర్వాత, మీరు బర్నర్‌ను బయటకు తీస్తే, దానిలోని అన్ని రంధ్రాలు పూర్తిగా తెరుచుకుంటాయి. గ్యాస్ బర్నర్ శుభ్రం అయిపోతుంది.

రంధ్రాలు పూర్తిగా తెరుచుకుంటాయి

మురికి పేరుకుపోయిన గ్యాస్ బర్నర్‌ను శుభ్రం చేసే ఈ పద్ధతి సులభం మాత్రమే కాదు. మీ డబ్బును కూడా ఆదా చేస్తుంది.

మీ డబ్బు ఆదా

గ్యాస్ బర్నర్ మురికిగా మారకుండా క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. దీనివల్ల బర్నర్ సరిగ్గా పనిచేస్తుంది. అలాగే, గ్యాస్ వృధా కాదు.

గ్యాస్ వృధా కాదు