మటన్ పాయా.. టేస్టీ.. టేస్టీగా.. మీ ఇంట్లోనే చేసుకోండిలా..

Prudvi Battula 

Images: Pinterest

12 December 2025

మటన్ కాళ్ళు, పెద్ద ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిర్చి, తురిమిన కొబ్బరి, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నూనె, ఏలకులు, లవంగాలు, పుదీనా, కొత్తిమీర

మటన్ పాయా వండడానికి కావలసినవి

ముందుగా మటన్ కాళ్ళను కాల్చాలి. తర్వాత వాటిని బాగా కడిగితే మురికి వెంట్రుకలు తొలగిపోతాయి. తరువాత, తురిమిన కొబ్బరిని మిక్సర్ జార్‌లో కొద్దిగా నీటితో రుబ్బుకోవాలి.

మటన్ కాళ్ళను కాల్చాలి

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని, దానిపై కుక్కర్‎ని పెట్టి మటన్, ముప్పావు వంతు ఉల్లిపాయ ముక్కలు, టమోటాలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, అవసరమైన ఉప్పు వేసి కలపాలి.

రెసిపీ

తరువాత కావలసినంత నీరు పోసి, కలిపి, కుక్కర్‌ను మూసివేసి, 6-7 విజిల్స్ వచ్చే వరకు హై-ఫ్లేమ్ మీద ఉడికించాలి.

6-7 విజిల్స్

కుక్కర్‌లోని ప్రెజర్ ఆటోమేటిక్‌గా విడుదలైన తర్వాత, మూత తెరిచి, తక్కువ మంట మీద మరికొన్ని నిమిషాలు మరిగించాలి.

తక్కువ మంట మీద

తరువాత తురిమిన కొబ్బరి పేస్ట్ వేసి మరిగించాలి. ఈలోగా స్టవ్ మీద పాన్ పెట్టి నూనె పోయాలి. అది వేడెక్కిన తర్వాత లవంగాలు, బే ఆకులు, యాలకులు వేయాలి.

కొబ్బరి పేస్ట్ మరిగించాలి

తరువాత మిగిలిన తరిగిన ఉల్లిపాయ వేసి బాగా వేయించాలి. తరువాత అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.

బాగా వేయించాలి

తరువాత తరిగిన పుదీనా, కొత్తిమీర వేసి 2 నిమిషాలు వేయించి మరిగే మటన్ పాయాలో పోయాలి. రుచికరమైన మటన్ పాయా సిద్ధం అయిపోయినట్టే.

మటన్ పాయా రెడీ