Valentine Week 2023: మోకాళ్లపై నిల్చొని ఎందుకు ప్రపోజ్ చేస్తారు..? దీని వెనకున్న ఆసక్తికర చరిత్ర తెలుసా..
ప్రేమించడం పెద్ద కష్టమైన పని కాదు..కానీ దాన్ని నచ్చిన వ్యక్తికి చెప్పడం కాస్త కష్టమే. ప్రపోజ్ చేస్తే..ఒప్పుకుంటారో లేదో అనే సందేహం వెంటాడుతుంది. ఇలాంటివారికి వాలెంటైన్స్ వీక్ బెస్ట్ టైమ్.

ప్రేమించడం పెద్ద కష్టమైన పని కాదు..కానీ దాన్ని నచ్చిన వ్యక్తికి చెప్పడం కాస్త కష్టమే. ప్రపోజ్ చేస్తే..ఒప్పుకుంటారో లేదో అనే సందేహం వెంటాడుతుంది. ఇలాంటివారికి వాలెంటైన్స్ వీక్ బెస్ట్ టైమ్. ఈ వాలెంటైన్స్ డే మీ మనస్సుకు నచ్చిన వారికి మీ ప్రేమ గురించి చెప్పడానికి ఇంతకంటే మరో అవకాశం రాదు. ప్రేమను వ్యక్తపర్చడానికి ఇప్పటికే మీ బుర్రలో ఎన్నో ఐడియాలు ఉండే ఉంటాయి. కానీ మోకాళ్ల మీద కూర్చుండి…పువ్వు కానీ..రింగ్ కానీ ఇస్తూ మీ ప్రేమ గురించి వ్యక్తపరిస్తే…ఏ అమ్మాయి కాదంటుంది చెప్పండి.
మోకాళ్లమీద కూర్చుండి ప్రేమను వ్యక్తపరచడం ఇదేమీ కొత్త ఐడియా కాదు. ఎన్నో ఏళ్ల నుంచి ఎంతోమంది ప్రేమికులు వాళ్ల ప్రేమను ఇలాగే చెబుతున్నారు. టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ ఏ వుడ్లో అయినా సరే హీరో హీరోయిన్‌కు ఇలానే ప్రపోజ్ చేయడం మనం చాలా సార్లు చూసే ఉంటాం. కేవలం సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా మోకాళ్లపై నిల్చుండి ప్రేమను వ్యక్తపరచడం చూసే ఉంటారు. అయితే దీనివెనక పెద్ద కథే ఉంది. అదేంటో తెలుసుకుందాం.
ఈ ట్రెండ్ ఇప్పటిది కాదు..మధ్యయుగం నాటి సంప్రదాయం. ఈ సమయంలో పెళ్లి, మతానికి దగ్గరి సంబంధం ఉండేది. ఒక సైనికుడు గౌరవం, విధేయతను చూపించేందుకు ప్రభువు ముందు మోకాళ్లపై నిల్చున్నట్లుగా పురుషులు కూడా…తమ మనస్సుకు నచ్చిన అమ్మాయి ముందు మోకాళ్లపై నిల్చుండి..పెళ్లి చేసుకోమంటూ ప్రతిపాదించేవాళ్లు. నన్ను పెళ్లి చేసుకుంటావా..అని అడిగేందుకు ఇదొక మార్గం వంటింది. మోకాళ్లపై కూర్చుని ప్రేమించమని అడగడం అంటే..ఎదుటివారికి గౌరవం ఇస్తున్నట్లు అర్థం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. మనస్సుకు నచ్చినవారిని ప్రపోజ్ చేసేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. నచ్చినవారికి తమ ప్రేమను వ్యక్తపరిచేందుకు ఎలాంటి పద్దతి ఎంచుకున్నారనేది పట్టింపు లేదు. మీలో నిజాయితీ ఉంటే..మీ ప్రతిపాదన మరుపురానిది, ప్రత్యేకంగా ఉంటుంది.




మరిన్ని ఆఫ్‌బీట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..