Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valentine Week: నేడు టెడ్డీ డే.. ఒకొక్క రంగు టెడ్డీకి ఒకొక్క అర్ధం.. ఏ రంగు టెడ్డీ ఇస్తే ఏ భావాన్ని వ్యక్తం చేసినట్లు అంటే..

ప్రేమికులు వాలెంటైన్స్ వీక్ ను వైభవంగా జరుపుకుంటున్నారు. తమకు తమ ప్రియమైవారికి ఈ ఏడు రోజుల పాటు.. రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే, హగ్ డే, కిస్ డే.. వాలెంటైన్స్ డేలుగా జరుపుకుంటారు. వాలెంటైన్స్ వీక్ లో భాగంగా నేడు టెడ్డీ డేగా ప్రేమికులు జరుపుకుంటున్నారు.  

Surya Kala

|

Updated on: Feb 10, 2023 | 11:06 AM

తమ ప్రియమైన వారికి అందమైన టెడ్డీ బేర్‌లను బహుమతిగా ఇచ్చి.. తమ ప్రేమని..  భావోద్వేగాలను వ్యక్తపరుస్తారు.టెడ్డీ బేర్స్ వివిధ రంగులు ఉన్నాయి.. ఒకొక్క రంగు ఒకొక్క అర్ధాన్ని భావాన్ని వ్యక్తం చేస్తాయి. నేడు టెడ్డీ డే.. ఈ రోజున తమ భాగస్వామికి ఏ కలర్ టెడ్డీ ఇస్తే బాగుంటుందో  తెలుసుకుందాం.. 

1 / 10
ప్రేమలో ఉన్న వారు ఈ రోజున తమ ప్రియమైన వ్యక్తికి టెడ్డీ బేర్‌ను బహుమతిగా ఇస్తారు. వాస్తవానికి అమ్మాయిలు టెడ్డీ బేర్ లు అంటే చాలా ఇష్టపడతారు. అయితే బహుమతిగా ఇచ్చే టెడ్డీ బేర్.. మీ భాగస్వామి మనసుని హత్తుకోవాలి.. మీ మనసులోని భావాన్ని మీరు చెప్పకుండానే ఆ టెడ్డీ బేర్ చెప్పాలి. మీరు ఐసీసీ టెడ్డీ ని యువతి సంతోషంగా తీసుకుంటే.. మీ ప్రేమని ఆమె అంగీకరించినట్లే.. 

2 / 10
ఆరెంజ్ కలర్ టెడ్డి : ఆరెంజ్  ఆశకు, కాంతికి చిహ్నం.. అంతేకాదు ఆనందం, సానుకూలతకు సంకేతం. కనుక ఆరెంజ్ కలర్ టెడ్డిని నీతో భవిష్యత్ లో కలిసి నడవాలని కోరుకుంటున్నా.. అని చెబుతూ ఇవ్వవచ్చు.  ఈ కలర్ టెడ్డీని ఎవరైనా ఇస్తే, వారు మిమ్మల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారని అర్ధం. 

3 / 10

నీలం రంగు టెడ్డి: నీలం జ్ఞానం , నిబద్ధతను, కేరింగ్ ను సూచిస్తుంది. నీపై ప్రేమ ఉంది.. నన్ను కొంచెం పట్టించుకో.. నా ప్రేమని అర్ధం చేసుకో అని చెబుతుంది నీలం రెండు టెడ్డి.  అంతేకాదు ఇది ప్రేమ తీవ్రతను సూచిస్తుంది

4 / 10
ఆకుపచ్చ రంగు టెడ్డి: గ్రీన్ కలర్ టెడ్డీ బంధం లోతును సూచిస్తుంది. ఈ రంగు టెడ్డీని ఇస్తే.. నీ కోసం ఎంతకాలమైనా వేచి ఉండటానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తుంది. అంతేకాదు సంబంధంలో బాధ్యతను తెలియజేస్తుంది, జీవిత భాగస్వామిగా పొందాలనుకుంటే రంగు టెడ్డీని అందిస్తారు.

5 / 10
ఎరుపు రంగు టెడ్డి : ఎరుపు రంగు ప్రేమకు చిహ్నం. సాధారణంగా ప్రేమ తీవ్రతను తెలియజేస్తుంది. రెడ్ కలర్ టెడ్డీ అందిస్తే ఐ లవ్ యూ అని చెప్పేసినట్లే

6 / 10
పింక్ రంగు టెడ్డి: ఈ రంగు ప్రశంసలకు గుర్తు. ఈ పింక్ రంగు టెడ్డి చాలా క్యూట్ గా ఉంటుంది. ఈ రంగు టెడ్డీలను గిప్ట్ గా ఇస్తే.. అమ్మాయిలు చాలా ఈజీగా ప్రేమని అంగీకరిస్తారు. మీకు ఇష్టమైన వ్యక్తికి ఈ పింక్ టెడ్డీని ఇస్తే, వారు దానిని స్వీకరిస్తే మీ ప్రేమను అంగీకరించినట్లే.

7 / 10
పసుపు టెడ్డీ బేర్: పసుపు రంగు ఆనందం,  సూర్యరశ్మి, శక్తికి సంబంధించినది. అయినప్పటికీ, పసుపు టెడ్డీ బేర్ మీ భావాల ప్రతికూల అర్థాన్ని సూచిస్తుంది. ఈ టెడ్డీని బహుమతిగా ఇవ్వడమంటే.. మీరు ఇక నుంచి ఆమెతో కలిసి ఉండలేరని.. విడిపోలనుకుంటున్నారని గుర్తు.. కనుక ఈ టెడ్డీ డే రోజున  మీ ప్రియురాలి కోసం ఈ టెడ్డీని కొనుగోలు చేసే ముందు ఆలోచించండి

8 / 10
పర్పుల్ టెడ్డీ బేర్: పర్పుల్ రంగు బలం, లగ్జరీ, గొప్పతనాన్ని సూచిస్తుంది. ఈ రంగు ప్రేమ, ఆప్యాయత భావాలను సూచిస్తుంది. వాలెంటైన్స్ డే కోసం రసిక వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడుతుంది.

9 / 10
బ్రౌన్ టెడ్డీ బేర్: బ్రౌన్ రంగు స్థిరత్వం, బాధ్యత, రక్షణ , మద్దతును సూచిస్తుంది. అయితే ఈ బ్రౌన్ టెడ్డీ బేర్ విరిగిన హృదయానికి చిహ్నం.. కనుక ఈ టెడ్డీ డేలో మీ ప్రేమికుడు మీకు బ్రౌన్ టెడ్డీ బేర్‌ని అందజేస్తే, అతనితో మనసు విప్పి మాట్లాడడం మంచిది. అయితే ఇక్కడ విచిత్రమేమిటంటే, మొత్తం వాలెంటైన్ సీజన్‌లో అత్యధికంగా విక్రయించబడే రంగు ఇదే.

10 / 10
Follow us