ఇండియాలో పెరుగుతున్న విడాకుల సంఖ్య.. షాకింగ్ విషయాలు మీకోసం..!
ఇండియాలో కుటుంబ విలువలకు ఎప్పుడూ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అయినప్పటికీ గత దశాబ్దంలో విడాకుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి పెద్ద నగరాల్లో విడాకుల కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. జీవనశైలి మార్పులు, మహిళల ఆర్థిక స్వాతంత్య్రం, సోషల్ మీడియా ప్రభావం ఈ పరిస్థితికి ప్రధాన కారణాలు.

ఇండియాలో కుటుంబ విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నప్పటికీ.. ఇప్పుడు విడాకులు సర్వసాధారణం అవుతున్నాయి. ముఖ్యంగా గత పదేళ్లలో.. ఢిల్లీ, ముంబై, బెంగళూరు లాంటి పెద్ద నగరాల్లో విడాకుల సంఖ్య బాగా పెరిగిందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ విషయంపై పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దేశవ్యాప్తంగా విడాకుల శాతం
అమెరికా, యూరప్ వంటి దేశాలతో పోలిస్తే మన భారతదేశంలో విడాకుల శాతం ఇంకా తక్కువే. అయినప్పటికీ.. ప్రతి 1,000 వివాహాల్లో సుమారు 13 విడాకులతో ముగుస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విడాకుల రేటు 1 శాతం నుంచి 1.3 శాతం మధ్య ఉంది.
నగరాలు వర్సెస్ గ్రామాలు
గ్రామీణ ప్రాంతాల్లో విడాకులు ఇప్పటికీ పెద్ద తప్పుగా భావిస్తారు. ఆ భయంతో చాలా మంది విడిపోవడానికి వెనుకాడతారు. కానీ నగరాల్లో పరిస్థితి వేరు. యువతరం తమ బంధంలో అసంతృప్తిగా ఉంటే.. కేవలం సమాజం కోసమే కలిసి ఉండాలని భావించడం లేదు. వారు విడిపోవడానికే ఇష్టపడుతున్నారు.
గత పది సంవత్సరాల్లో పెద్ద నగరాల్లో విడాకుల రేటు 30 నుంచి 40 శాతం పెరిగింది. ప్రస్తుతం పట్టణాల్లో ప్రతి రోజూ దాదాపు 100 విడాకుల పిటిషన్లు దాఖలవుతున్నాయి. జీవనశైలిలో మార్పులు, ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం వంటివి ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలని నిపుణులు అంటున్నారు.
విడాకులకు బిగ్ రీజన్స్
- జెండర్ రోల్స్‌లో చేంజ్.. మహిళలు కెరీర్ లో టాప్‌కి వెళ్తుండటంతో, ఇంటి పనుల విషయంలో గొడవలు పెరుగుతున్నాయి.
- అర్బన్ లైఫ్ స్టైల్.. ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి, అణు కుటుంబాలు పెరిగాయి. దీని వల్ల ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు పెద్దల సలహాలు, సపోర్ట్ తగ్గి విడాకులకు దారితీస్తున్నాయి.
- ఉమెన్ ఎంపవర్‌మెంట్.. విద్య, జాబ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పెరగడంతో మహిళలు తమ ఆత్మగౌరవానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. హ్యాపీగా లేని పెళ్లి బంధంలో ఉండటానికి వాళ్ళు ఇష్టపడటం లేదు.
- లీగల్ రైట్స్‌పై అవేర్‌నెస్.. యూత్ తమ చట్టపరమైన హక్కుల గురించి బాగా తెలుసుకున్నారు. వేధింపులు, మోసం వంటివి జరిగితే లీగల్ సపోర్ట్ తీసుకుని విడాకులు కోరుతున్నారు.
- సోషల్ మీడియా ఇంపాక్ట్.. సోషల్ మీడియా ఆన్‌లైన్ మోసాలకు, ఎక్కువ స్క్రీన్ టైమ్‌కు కారణమవుతోంది. ఇవి కపుల్స్ మధ్య సమస్యలు పెంచుతున్నాయి.
- మ్యారేజ్ పై న్యూ థింకింగ్.. నేటి కపుల్స్ పెళ్లిని ఒక పార్ట్‌నర్‌షిప్‌గా చూస్తున్నారు. వారి ఎక్స్‌పెక్టేషన్స్ మ్యాచ్ అవ్వకపోతే త్వరగా విడిపోవడానికి రెడీ అవుతున్నారు.
ప్రస్తుతం సమాజంలో వస్తున్న ట్రెండ్స్ వల్ల విడాకుల సంఖ్య పెరుగుతోంది. మహిళల ఫైనాన్షియల్ ఫ్రీడమ్, లీగల్ రైట్స్‌పై ఉన్న అవేర్‌నెస్, అలాగే లైఫ్ స్టైల్‌లో వచ్చిన చేంజ్‌లు దీనికి మెయిన్ రీజన్స్. మ్యారేజ్ లైఫ్‌లో ప్రాబ్లమ్స్ వస్తే.. వాటిని సాల్వ్ చేసుకోలేనప్పుడు కపుల్స్ విడిపోవడానికి ఏ మాత్రం వెనుకాడటం లేదు.
