వేసవి కాలంలో శరీరానికి చలువనిచ్చే పండ్లను, కూరగాయలను ఆహారంలో తప్పకుండా తీసుకోవాలి. కాలానుగుణంగా లభించే పండ్లను అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో నీటి స్థాయులు పెరుగుతాయి
TV9 Telugu
అంతేకాకుండా కాలక్రమేణా రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుందంటున్నారు నిపుణులు. ఎండ వేడిమి నుంచి శరీరానికి తక్షణ శక్తినందించే పండ్లు ఎన్నో ఉన్నప్పటికీ తర్బూజా ప్రత్యేకత వేరు
TV9 Telugu
ర్బూజా పండ్లలో ఏకంగా 90 శాతం నీరే ఉంటుంది. అందుకే ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ఉక్కపోతగా ఉన్నప్పుడు ఈ పండు తింటే శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది
TV9 Telugu
ఇది మన శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. అలాగే జ్వరం వచ్చినప్పుడు ఈ పండు తింటే శరీరం త్వరగా చల్లబడి, త్వరగా కోలుకుంటారు
TV9 Telugu
ఈ పండులోని వివిధ పోషకాలు శరీరంలో నీటి స్థాయులను పెంచి డీహైడ్రేట్ కాకుండా కాపాడతాయి. ఇందులోని ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచి మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తుంది
TV9 Telugu
తర్బూజాలో విటమిన్-ఎ కూడా అధికంగా ఉంటుంది. ఇది కంటి సమస్యలను దూరం చేయడమే కాకుండా కంటి చూపు సామర్థ్యాన్ని పెంచుతుందట
TV9 Telugu
క్యాలరీలు తక్కువగా ఉండే ఈ పండును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీర బరువును నియంత్రించుకోవడంలో సహాయపడుతుంది. ఈ పండుని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుందట
TV9 Telugu
ఈ పండులోని పోషకాలు ఒత్తిడి, ఆందోళన సమస్యలను తగ్గించడమే కాకుండా కురుల సంరక్షణకు కూడా ఉపయోగపడతాయంటున్నారు నిపుణులు. ఇన్ని ప్రయోజనాలున్నందుకే సమ్మర్‌లో ఈ పండును కచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలంటున్నారు నిపుణులు