AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్రిజ్‌లో పెట్టిన పుచ్చకాయ తింటే ఏమవుతుందో తెలుసా..? ఈ నిజాలు తెలిస్తే మీ మైండ్ బ్లాంకే..

వేసవి తాపం నుండి ఉపశమనం పొందేందుకు మనందరికీ గుర్తొచ్చే మొదటి పండు పుచ్చకాయ. సుమారు 92శాతం నీటి శాతాన్ని కలిగి ఉండే ఈ పండు, శరీరానికి అవసరమైన హైడ్రేషన్‌ను అందించడమే కాకుండా రుచిలోనూ అద్భుతంగా ఉంటుంది. అయితే చాలామంది పుచ్చకాయను ఫ్రిజ్‌లో ఉంచి తీసిన వెంటనే చల్లచల్లగా తినడానికి ఇష్టపడతారు. కానీ ఇలా చేయడం ఆరోగ్యానికి మంచిదేనా? దీనిపై సీనియర్ డైటీషియన్ గీతికా చోప్రా కొన్ని కీలక హెచ్చరికలు జారీ చేశారు.

Krishna S
|

Updated on: Apr 08, 2026 | 7:00 AM

Share
జీర్ణక్రియ మందగించడం: అతి చల్లని పదార్థం కడుపులోకి వెళ్ళినప్పుడు, శరీరం తన సాధారణ ఉష్ణోగ్రతను సమతుల్యం చేసుకోవడానికి అదనంగా శ్రమించాల్సి వస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఫలితంగా కడుపు ఉబ్బరం, గ్యాస్ లేదా పొట్ట బరువుగా అనిపించడం వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం మేలు.

1 / 5
గొంతు సమస్యలు: ఫ్రిజ్‌లో పెట్టిన చల్లటి పుచ్చకాయ నేరుగా గొంతులోని సున్నితమైన పొరలపై ప్రభావం చూపుతుంది. వీటిని తినడం వల్ల గొంతు నొప్పి, దగ్గు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏసీ గదుల్లో ఎక్కువ సేపు గడిపేవారు లేదా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు దీనివల్ల త్వరగా ప్రభావితమవుతారు.

2 / 5
నిల్వ చేయడంలో పొరపాట్లు వద్దు: చాలామంది పుచ్చకాయను ముక్కలుగా కోసి ఎక్కువ కాలం ఫ్రిజ్‌లో ఉంచుతారు. ఇలా చేయడం వల్ల పండులోని విటమిన్ సి వంటి కీలక పోషకాలు తగ్గిపోవడమే కాకుండా బ్యాక్టీరియా వృద్ధి చెందే ప్రమాదం ఉందని గీతికా చోప్రా హెచ్చరించారు.

3 / 5
పుచ్చకాయలోని పోషక విలువలెన్నో: పుచ్చకాయ కేవలం నీటి శాతం కోసమే కాదు, ఇందులోని పోషకాల వల్ల కూడా విశేషమైనది. విటమిన్ సి, ఎ, బి6 పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీనికి ఎరుపు రంగునిచ్చే లైకోపీన్ యాంటీఆక్సిడెంట్ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కేలరీలు తక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక.

4 / 5
పుచ్చకాయ వేసవికి వరమే, కానీ దానిని తినే పద్ధతి సరిగ్గా లేకపోతే అది శాపంగా మారవచ్చు. పుచ్చకాయను గది ఉష్ణోగ్రత వద్ద లేదా కొద్దిపాటి చల్లదనంతో ఉన్నప్పుడు తినడం అత్యంత ఉత్తమం. పండును కోసిన వెంటనే తాజాగా ఉన్నప్పుడే తింటే పూర్తి పోషకాలు అందుతాయి. కాబట్టి పుచ్చకాయను సరైన పద్ధతిలోనే తీసుకుని ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూసుకోండి..

5 / 5
Follow Us
శ్రావణ సోమవారం వ్రతం మహిమ తెలుసా? శివారాధనతో కలిగే శుభఫలితాలు ఇవే

కేబీఆర్ పార్క్ వైపు వెళుతున్నారా..? ట్రాఫిక్ పోలీసులు బిగ్ అర్ట్.

తీరు మార్చుకోని NTA.. UGC NET 2026 పరీక్ష రద్దు! ఏం జరిగిందంటే..

డిఫరెంట్ రవితేజను చూడబోతున్నారు.
డిఫరెంట్ రవితేజను చూడబోతున్నారు.
ఉత్తమ సోలార్‌ ప్యానెల్‌ ఏది..? ఏది అత్యధిక విద్యుత్‌ ఉత్పత్తి?

శ్రావణ మాసం స్పెషల్.. బాదం సేమియా..కమ్మ కమ్మగా ఎలా చేయాలంటే?

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు తొలి షెడ్యూల్డ్ విమానం..

అనుకోని ప్రమాదం ఎదురైతే ఇలా తప్పించుకోండి.. తెలివైన తాబేళ్లు కథ

మేషం నుంచి మీనం వరకు.. సోమవారం రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే..

నాగపంచమి ఎందుకు జరుపుకుంటారు? పూజా విధానం, ప్రాముఖ్యత తెలుసా?