ప్రోటీన్ ఎక్కువగా తీసుకున్నా.. మీ కిడ్నీలు మటాషే!

06 April 2026

TV9 Telugu

TV9 Telugu

శరీర నిర్మాణానికి ఎంతో కీలకమైన ప్రోటీన్‌ శరీరంలోని అనేక కీలక విధులను సక్రమంగా నిర్వహించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. అయితే ప్రస్తుత రోజుల్లో చాలా మంది బరువు తగ్గడం, కండరాలను పెంచుకోవడం, ఫిట్‌నెస్ కోసం హై-ప్రోటీన్ ఫుడ్‌ తీసుకుంటున్నారు

TV9 Telugu

ఇలా అవసరానికి మించి ప్రోటీన్‌ను దీర్ఘకాలం తీసుకోవడం వ‌ల్ల కిడ్నీలపై ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీలు రక్తాన్ని శుద్ధి చేసి వ్యర్థాలను బయటకు పంపే ముఖ్య అవయవాలు

TV9 Telugu

శరీరం ప్రోటీన్‌ను విభజించే సమయంలో నైట్రోజన్, యూరియా, క్రియాటినిన్ వంటి వ్యర్థ పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. ఈ పదార్థాలను తొలగించేందుకు కిడ్నీలు ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది

TV9 Telugu

ప్రోటీన్ తీసుకునే పరిమాణం పెరిగితే కిడ్నీలపై పడే పని కూడా పెరుగుతుంది. ఆరోగ్యవంతమైన కిడ్నీలు కొంతవరకు దీనిని తట్టుకోగలిగినా, దీర్ఘకాలంలో అధిక ప్రోటీన్ వినియోగం కిడ్నీ నష్టం కలిగించే అవకాశం ఉంది

TV9 Telugu

ఇప్పటికే కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారికి హై-ప్రోటీన్ ఆహారం మరింత ప్రమాదకరం. ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల కిడ్నీలు శుద్ధి చేయాల్సిన వ్యర్థాలు పెరుగుతాయి

TV9 Telugu

ఇది కిడ్నీ పనితీరును మరింత దెబ్బతీసే అవకాశం ఉంటుంది. అందుకే దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి ఉన్నవారికి వైద్యులు సాధారణంగా మితమైన ప్రోటీన్ తీసుకోవాలని సూచిస్తారు

TV9 Telugu

ప్రస్తుతం ప్రోటీన్ పౌడర్లు, సప్లిమెంట్ల వాడకం పెరిగింది. ముఖ్యంగా బాడీ బిల్డింగ్ చేసే వారు వీటిని అధికంగా తీసుకునే సందర్భాలు కనిపిస్తున్నాయి

TV9 Telugu

ఇలాంటి పరిస్థితుల్లో ప్రోటీన్ అధికంగా తీసుకోవడం వల్ల కిడ్నీ పనితీరు తగ్గిపోవడం, మూత్రంలో ప్రోటీన్ వెలువడటం (ప్రోటీన్యూరియా) వంటి సమస్యలు తలెత్తవచ్చు. అదనంగా డీహైడ్రేషన్, కిడ్నీ రాళ్లు, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి హై-ప్రోటీన్ డైట్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి