World Coconut Day 2025: కొబ్బరి బోండాంకీ ఓ దినోత్సవం.. దీని ప్రత్యేకత ఏంటో తెలుసా?
కొబ్బరి చెట్టులోని ప్రతి భాగం ఉపయోగకరంగా ఉంటుంది. కొబ్బరి పీచుతో తాడును తయారు చేస్తారు. కొబ్బరి మట్టలతో చీపురును తయారు చేస్తారు. కొబ్బరి కాయలను వంట, పూజకు ఉపయోగిస్తారు. అందువల్ల కొబ్బరి ఒక బహుళార్ధసాధక చెట్టు. కొబ్బరిలోని పోషక విలువలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి..

కొబ్బరిని ఇంటికి పెద్ద కొడుకు అని పిలుస్తారు. ఎందుకంటే దానిలోని ప్రతి భాగం ఉపయోగకరంగా ఉంటుంది. కొబ్బరి పీచుతో తాడును తయారు చేస్తారు. కొబ్బరి మట్టలతో చీపురును తయారు చేస్తారు. కొబ్బరి కాయలను వంట, పూజకు ఉపయోగిస్తారు. అందువల్ల కొబ్బరి ఒక బహుళార్ధసాధక చెట్టు. కొబ్బరిలోని పోషక విలువలు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి సాగు, దాని ఆర్థిక ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన కల్పించడానికి, కొబ్బరి రైతులను గౌరవించడానికి యేటా సెప్టెంబర్ 2న ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ప్రత్యేక రోజు ప్రాముఖ్యత ఏమిటో మనమూ తెలుసుకుందాం..
ప్రపంచ కొబ్బరి దినోత్సవం ఎందుక జరుపుకుంటారంటే?
కొబ్బరి పండించే ప్రతి దేశం సెప్టెంబర్ 2న ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ దినోత్సవాన్ని మొదటిసారిగా 2009లో జరుపుకున్నారు. ఆసియా పసిఫిక్ కొబ్బరి సంఘం (APCC) ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించింది. అంతర్జాతీయ కొబ్బరి సంఘం (ICC) 1969 సెప్టెంబర్ 2న… ఐక్యరాజ్యసమితి ఆసియా, పసిఫిక్ ఆర్థిక, సామాజిక కమిషన్ (UN-ESCAP) ఆధ్వర్యంలో స్థాపించింది. ఈ దినోత్సవాన్ని గుర్తుచేసుకునేందుకు సెప్టెంబర్ 2న ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆ తర్వాత అంతర్జాతీయ కొబ్బరి సంఘం ఆసియా పసిఫిక్ కొబ్బరి సంఘంగా పేరు మార్చుకుంది. దీని ప్రధాన కార్యాలయం ఇండోనేషియాలోని జకార్తాలో ఉంది. భారత్‌తో సహా అనేక దేశాలు ఈ సంస్థలో సభ్యులుగా ఉన్నాయి.
ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలంటే?
మన దైనందిన జీవితంలో కొబ్బరి ప్రాముఖ్యతను, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావాన్ని గుర్తించడానికి ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2న జరుపుకునే ఈ దినోత్సవం.. ముఖ్యంగా లక్షలాది మంది రైతులకు కొబ్బరి ప్రధాన ఆదాయ వనరు, జీవనోపాధిగా ఉంటుంది. ఉష్ణమండల ప్రాంతాలలో పెరిగే కొబ్బరి పోషక, ఆర్థిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను సంతరించుకుంది. కొబ్బరి సాగు, దాని పరిశ్రమ గురించి అవగాహన కల్పించడం ప్రధాన లక్ష్యంగా యేటా ఈ దినోత్సవం జరుపుకోవడం పరిపాటి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




