మామిడి కాయలతో పూరీలు.. ఇలా చేస్తే, నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి!
Samatha
07 April 2026
పూరీలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా పూరీలు తింటారు.
పూరీలు
అయితే పూరీలు అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది, మైదా, గోధుమ పిండి. కానీ వీటితో మాత్రమే కాకుండా మామిడి పండ్లతో కూడా పూరీలు చేయవచ్చునంట.
గోధుమ, మైదా
మామిడి పండ్లతో పూరీలు చేస్తూ అద్భుతంగా ఉంటాయంట. కాగా, ఇప్పుడు మనం మామిడి పండ్లతో పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
మామిడిపండ్లతో పూరీలు
కావాల్సిన పదార్థాలు, మామిడి గుజ్జు ఒక కప్పు, గోధుమ పిండి రెండు కప్పుల, బొంబాయి రవ్వ రెండు టేబుల్ స్పూన్స్ , పొడి చెక్కెర రెండు టేబుల్ స్పూన్స్. యాలకులు, నూనె, ఉఫ్పు.
కావాల్సిన పదార్థాలు
తయారీ విధానం.. మామిడి గుజ్జును నీరు కలపకుండా చాలా మెత్తగా రసంలా తయారు చేసుకోవాలి. తరవాత దీనిని ఒక బౌల్ లోకి తీసుకొని అందులో పిండి వేసి, బొంబాయి రవ్వ వేయాలి.
తయారీ విధానం
తర్వాత చిటికెడు ఉప్పు, కొంచెం నెయ్యి వేసి మంచిగా కలపుకోవాలి. నీళ్లు లేకుండా మామిడి రసంతోనే పిండిని పూరీ పిండిలా గట్టిగా కలుపుకొని పదినిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
ఉప్పు, నెయ్యి
ఇప్పుడు పిండిని చేతితో చిన్న చిన్న ముద్దల్లా తయారు చేసుకొని, రోటీ పై అచ్చం పూరీలలా తయారు చేసుకోవాలి.
మామి గుజ్జు వేస్తూ
తర్వాత ఈ పూరీలను కాల్చుకోవడానికి, స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి అందులో నూనె పోసి, నూనె బాగ వేడి అయిన తర్వాత పూరీలు వేసి కాల్చుకోవాలి. అంతే పూరీలు రెడీ.