కరీంనగర్ స్టైల్.. ఘాటైన నాటు కోడి పులుసు ఇలా చేస్తే దగ్గు జలుబు మాయం!

Samatha

07 April 2026

నాటు కోడి పులుసు అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. ఎప్పుడూ రోటీన్‌గా కాకుండా, కరీంనగర్ స్టైల్‌లో ఇలా వండితే అదిరిపోతుందంట!

నాటుకోడి పులుసు

చాలా మంది దగ్గు, జలుబు వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అయితే అలాంటి వారు ఇలా కరీంనగర్ స్టై్ల్‌లో నాటుకోడి పులుసు చేసి తింటే ఆ సమస్యలన్నీ మటుమాయం అవుతాయంట.

దగ్గు, జలుబు సమస్యలు

కాగా, ఇప్పుడు మనం నాటుకోడి పులుసు కోసం కావాల్సిన పదార్థాలు ఏవో చూసేద్దాం. నాటుకోడి మాంసం కేజీ, ఉల్లిపాయ రెబ్బలు, కొత్తిమీర, పూదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం , ఉప్పు, ఘరం మసాలా, కొబ్బరి పొడి, ధనియాల పొడి.

కావాల్సని పదార్థాలు

లవంగాలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు తరిగినవి, దాల్చిన చెక్క, బగార ఆకు, చిటికెడు మిరియాల పొడి, పసుపు, నూనె.

లవంగాలు, పచ్చిమిర్చి

తయారీ విధానం : ఇప్పుడు నాటు కోడి మాసం తీసుకోవాలి. దానిని శుభ్రంగా కడిగి, దానికి ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్, ఘరం మసాలా వన్ టీ స్పూన్ నూనె వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి.

తయారీ విధానం

తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె పోయాలి. నూనె వేడి అయిన తర్వాత అందులో లవంగాలు, బగారా ఆకు, పూదీన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి మంచిగా బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి.

స్టవ్ ఆన్ చేయడం

తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలా వేయించుకోవాలి. ఆ తర్వాత పసుపు  వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు నాటు కోడి మాంసం వేసి మంచిగా నూనెలో ఉడికేలా చూసుకోవాలి.

కోడి మాసం ఉడకడం

ఇప్పుడు చికెన్ బాగా ఉడికిన తర్వాత కొన్ని నీళ్లు పోసి మళ్లీ ఉడకనివ్వాలి. సూప్ చిక్కబడిన తర్వాత ధనియాల పొడి, ఘరం మసాలా,  ధనియాల పొడి, మిరియాల పొడి వేసి బాగా ఉడికించుకోవాలి. అది ఉడికిన తర్వాత కొత్తిమీర, పూదీన వేయాలి. అంతే టేస్టీ టేస్టీ నాటు కోడి పులుసు రెడీ.

నాటుకోడి పులుసు రెడీ