Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆదివారం మాంసాహారం ఎందుకు తినకూడదు..? అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు..!

మనలో చాలా మంది ఆదివారం వచ్చిందంటే మాంసం తెచ్చుకోవడం, మందు సేవించడం, కుటుంబంతో కలిసి హ్యాపీగా ఉంటారు. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ఒక పవిత్రమైన రోజు. దీనిని రవివారం అని కూడా అంటారు ఎందుకంటే ఇది సూర్య భగవానుని రోజు. సూర్యునికి ప్రాధాన్యం ఉన్న ఈ రోజున మాంసాహారం తినడం వల్ల అనేక ప్రతికూల ప్రభావాలు వస్తాయని చెబుతారు.

ఆదివారం మాంసాహారం ఎందుకు తినకూడదు..? అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు..!
Nonveg
Follow us
Prashanthi V

|

Updated on: Feb 16, 2025 | 3:54 PM

భారతదేశానికి స్వాతంత్య్రం రాకముందు విద్యా విధానం గురుకులాల్లో ఉండేది. గురుకులాల్లో విద్యార్థులు గురువులను గౌరవిస్తూ ఆదివారాన్ని ప్రత్యేకంగా ఆరాధన రోజుగా జరుపుకునేవారు. ముఖ్యంగా సూర్య భగవానునికి పూజలు చేసేవారు. సూర్యునికి పూజలు చేయడం ద్వారా ఆరోగ్య పరంగా మంచి ఫలితాలు కలుగుతాయని, దీర్ఘాయువు కలుగుతుందని నమ్మేవారు.

ఆదివారం సెలవు

సూర్యుని దినంగా ఆదివారం ఎంతో పవిత్రమైన రోజుగా ఉండేది. అయితే బ్రిటిష్ పాలనలో భారతీయ సంస్కృతిని మార్పు చేయాలని అనుకున్నారు. బ్రిటీష్ ప్రభుత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేసి భారతదేశ ప్రజల సాంప్రదాయాలను మార్చకపోతే తమ పాలన కష్టమవుతుందని భావించారు. అందుకే వారు ఆదివారాన్ని అధికారిక సెలవుదినంగా ప్రకటించారు.

ఇది భారతీయ సంప్రదాయాలను పూర్తిగా మార్చడానికి ఒక వ్యూహంగా ఉపయోగించారు. బ్రిటిష్ పాలకులు ఆదివారం విశ్రాంతి దినంగా ప్రకటించి పాశ్చాత్య జీవన విధానం భారతీయులకు అలవాటు చేయడం మొదలుపెట్టారు. మాంసాహారం, మద్యం సేవనాన్ని ప్రోత్సహించారు. దీని వల్ల భారతీయులు తమ సంప్రదాయాలను మర్చిపోయి కొత్త జీవన విధానాన్ని అంగీకరించడం ప్రారంభించారు.

ఆదివారంతో బ్రిటిష్ కుట్ర

పూర్వం బ్రిటిష్ వాళ్లకు ఆదివారం వచ్చిందంటే వారు కొన్ని పనులు అస్సలు చేయరు. ఉదాహరణకు కటింగ్, షేవింగ్ చేసుకోరు. బంగారం కొనరు. వీటిని సూర్య భగవానునికి నిషిద్ధంగా భావించేవారు. కానీ భారతీయుల పట్ల ఈ విషయాన్ని విభిన్నంగా చేశారు.

బ్రిటిష్ వారు భారతీయుల మనసులో పాశ్చాత్య సంస్కృతిని నాటడానికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రణాళికలో భాగంగా ఆదివారం మాంసాహారం తినే అలవాటు చేయించారు. ఇలా చేయడం ద్వారా భారతీయులు నెమ్మదిగా తమ సాంప్రదాయాలను మరచిపోతారని బ్రిటిష్ పాలకులు భావించారు.

నాన్ వెజ్ తినకూడదా..?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారాన్ని పవిత్రంగా పూజించడం వల్ల శరీర శుద్ధి మానసిక ప్రశాంతత లభిస్తాయి. మాంసాహారం తినడం వల్ల శరీరంలో అధిక వేడి పెరుగుతుందని ఇది ఆరోగ్యపరంగా మంచిది కాదని చెప్పబడింది.

సూర్యుడు శరీరానికి ప్రతిరోజూ శక్తినిచ్చే శక్తి స్థానం. కాబట్టి ఆ రోజున శరీరాన్ని స్వచ్ఛంగా ఉంచి సౌమ్యమైన ఆహారం తీసుకోవడం శ్రేయస్కరం. అలాగే ఆ రోజు మాంసాహారం తినడం వల్ల సూర్యుని శక్తిని కలుషితం చేయడమేనని నమ్మకం ఉంది.

ఆదివారం రోజు పూజలు

ఆదివారం రోజు పూజలు, ధ్యానం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల మన శరీరం, మనసు స్వచ్ఛంగా ఉంటాయి. ఈ రోజున కఠినమైన ఆహారం తీసుకోవడం మాంసాహారం తినడం అనేక ప్రతికూల ఫలితాలను కలిగించవచ్చు.

అందువల్ల హిందూ సంప్రదాయం ప్రకారం ఆదివారం మాంసాహారం తినకుండా ఆ రోజున సూర్య భగవానునికి పూజలు చేసి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఉత్తమం. ఇది మన ఆరోగ్యానికి మంచిదే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా ఎంతో మేలు చేస్తుంది.

మన భారతీయ సంప్రదాయాలు అనేవి ఆరోగ్యంతో పాటు మన జీవితాన్ని సుసంపన్నం చేసే విధంగా ఉండేవి. అయితే కాలక్రమేణా విదేశీ సంస్కృతుల ప్రభావంతో మన సంప్రదాయాలు కొంతమేరకు మారిపోయాయి. ఆదివారాన్ని పవిత్రంగా పాటిస్తూ మాంసాహారం తినకుండా ఉంటే ఆరోగ్యపరంగా ఆధ్యాత్మికంగా ఎంతో మేలు పొందవచ్చు.

(ఇక్కడ ఇచ్చిన సమాచారం మత విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించబడింది)