Health: పేగు క్యాన్సర్‌ బారినపడొద్దంటే.. ఈ ఆహారం కచ్చితంగా తీసుకోవాలి..

పేగు క్యాన్సర్ బారిన పడుతోన్న వారి సంఖ్య ఇటీవల ఎక్కువుతోంది. తీసుకుంటున్న ఆహారంలో వస్తున్న మార్పుల కారణంగా ఈ సమస్య ఎక్కువుతోంది. అయితే ఆహారంలో ఒక విటమిన్ లోపం కారణంగానే ఈ సమస్య బారిన పడుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇంతకీ ఏంటా విటమిన్.? ఈ సమస్య బారినపడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Health: పేగు క్యాన్సర్‌ బారినపడొద్దంటే.. ఈ ఆహారం కచ్చితంగా తీసుకోవాలి..
Cancer
Follow us

|

Updated on: Oct 31, 2024 | 3:32 PM

ప్రస్తుత రోజుల్లో క్యాన్సర్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా చాలా మంది క్యాన్సర్‌కి గురవుతున్నారు. క్యాన్సర్‌ మహమ్మారితో మరణిస్తున్న వారి సంఖ్య కూడా ఎక్కువుతోంది. మారిన జీవన విధానం కారణంగా పేగు క్యాన్సర్‌ బారిన పడుతోన్న వారి సంఖ్య ఇటీవల ఎక్కువుతోంది. పేగు క్యాన్సర్‌ రావొద్దంటే తీసుకునే ఆహారంలో కచ్చితంగా కొన్ని రకాల మార్పులు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

‘ది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్’లో ఇందుకు సంబంధించి ఓ నివేదికను ప్రచురించారు. శరీరంలో సరిపడ ఫోలెట్‌ లభించకపోతే దీర్ఘకాలంలో పేగు క్యాన్సర్‌ బారిన పడే అవకాశం ఉంటుందని ఈ నివేదికలో పేర్కొన్నారు. పరిశోధనల్లో భాగంగా సుమారు 70 వేల మంది వ్యక్తుల డేటాను పరిశీలించారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం శరీరానికి ఫోలేట్‌ శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది.

260 మైక్రోగ్రాముల ఫోలేట్ తీసుకోవడం వల్ల కొలొరెక్టల్ క్యాన్సర్ ప్రమాదాన్ని 7% తగ్గిస్తుంది. వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్‌లోని పోషకాహార నిపుణులు, ఆరోగ్య సమాచార నిర్వాహకుడు మాట్ లాంబెర్ట్ ప్రకారం, క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, పప్పులను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

శరీరానికి సరిపడ ఫోలేట్ లభించాలంటే తీసుకునే ఆహారంలో బచ్చలికూర, బ్రోకలీ వంటి ఆకుపచ్చ ఆకు కూరలను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కేవలం పేగు క్యాన్సర్‌ వచ్చే వవకాశాన్ని తగ్గించడం మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్యాన్ని మెరుపరుస్తుందని నిపుణులు తెలిపారు. శరీరంలో కీలక పాత్ర పోషించే ఈ విటమిన్‌ను కచ్చితంగా భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ఆర్మీ యూనిఫాంలో ప్రధాని మోదీ దీపావళి..!
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..