స్వీట్ కార్న్‌ తింటున్నారా.? లేదా.? 

Narender Vaitla

30 October 2024

స్వీట్‌కార్న్‌లో విటమిన్‌-సి, కెరోటినాయిడ్స్‌, బయోఫ్లెవనాయిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె పనితీరును మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

స్వీట్‌కార్న్‌లోని ఫాస్ఫరస్‌, మెగ్నీషియం, మ్యాంగనీస్‌, ఐరన్‌, కాపర్‌, జింక్‌ వంటి ఖ‌నిజాలు.. ఎముకలు, కిడ్నీల పనితీరు మెరుగుప‌డేలా చేస్తాయి. బలమైన ఎముకలకు మొక్క జొన్న ఉపయోగపడుతుంది.

వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీరాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. ముఖ్యంగా బ్రెస్ట్‌, లివర్‌ క్యాన్సర్‌కు చెక్‌ పెడుతుంది.

స్వీట్‌కార్న్‌లో పుష్కలంగా ఉండే ఫైబర్‌ కంటెంట్‌ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. దీంతో మలబద్ధకం, పైల్స్‌ సమస్య దరిచేరకుండా ఉంటాయి.

మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా స్వీట్ కార్న్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని ఫినోలిక్‌ ఫైటో కెమికల్స్‌ హైపర్‌ టెన్షన్‌ను తగ్గిండచంలో బాగా పనిచేస్తాయి.

స్వీట్‌కార్న్‌లు శరీరానికి కావాల్సిన శక్తిని తక్షణమే అందిస్తాయి. ఉదయం టిఫిన్‌గా స్వీట్ కార్న్‌ తీసుకుంటే.. రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.