Vettaiyan OTT : ఓటీటీలోకి రజినీకాంత్ వేట్టయాన్.. అఫీషియల్ ప్రకటన వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

దీపావళి పండగ సందర్భంగా సినీ ప్రియులకు, రజినీకాంత్ అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు వేట్టయాన్ మూవీ మేకర్స్. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలోని మనసిలాయే సాంగ్ విడుదలకు ముందే మంచి క్రేజ్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

Vettaiyan OTT : ఓటీటీలోకి రజినీకాంత్ వేట్టయాన్.. అఫీషియల్ ప్రకటన వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Vettaiyan
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 31, 2024 | 3:22 PM

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం వేట్టయాన్ ది హంటర్. జైభీమ్ మూవీ ఫేమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సుభాస్కరన్ నిర్మించగా.. ఇందులో మంజు వారియర్, అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, ఫహద్ ఫాజిల్, రోహిణి అభిరామి, రితికా సింగ్, దుషరా విజయన్ కీలకపాత్రలు పోషించారు. విడుదలకు ముందే సాంగ్స్, ట్రైలర్‏తో హైప్ పెంచేసిన ఈ సినిమా థియేటర్లలో మంచి విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా రిలీజ్ కంటే ముందే మనసులాయే పాట సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. అక్టోబర్ 10 దసరా కానుకగా అడియన్స్ ముందుకు వచ్చిన మంచి స్పందన సొంతం చేసుకుంది.

కానీ మరోవైపు ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ కూడా వచ్చాయి. ఈ సినిమా కాస్తా స్లోగా సాగిందని.. బోరింగ్ ఫీలింగ్ వచ్చిందని కొందరు రివ్యూస్ ఇచ్చారు. రజినీతోపాటు మిగతా యాక్టర్స్ యాక్టింగ్ కూడా అదిరిపోయిందని.. ప్రతి సీన్ గూస్ బంప్స్ అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలా ఉంటే.. వేట్టయాన్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా దీపావళీ కానుకగా వేట్టయాన్ స్ట్రీమింగ్ డేట్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబర్ 8 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నారట. మొత్తం 240 దేశాల్లో వేట్టయాన్ చిత్రాన్ని తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, తమిళం భాషలలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

మొత్తం ఐదు భాషలలో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కానీ ఈ చిత్రాన్ని రూ.160 కోట్లతో నిర్మించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా.. ఈ మూవీతో రజినీ మరో హిట్ అందుకున్నారు. ప్రస్తుతం లోకేష్ దర్శకత్వంలో కూలీ చిత్రంలో నటిస్తున్నారు.

ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‏గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..

Tollywood: ఫోక్ సాంగ్‏తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్‏గా అదరగొట్టేసింది..

Tollywood: అమ్మడు ఇది నువ్వేనా.. ఈ రేంజ్ ఛేంజ్ ఏంటమ్మా.. దృశ్యంలో వెంకీ కూతురు చూస్తే మైండ్ బ్లాంకే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!