గుండె ఆరోగ్యాన్ని సంరక్షించడంలో మెంతి కూర కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. ధమనుల్లోని కొలెస్ట్రాల్‌ను దూరం చేయడంలో మెంతి కూర ఉపయోగపడుతుంది.
జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి మెంతికూర ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా అజీర్తి, గ్యాస్, కడుపుబ్బరం వంటి సమస్యలతో బాధపడేవారికి ఎంతో మేలు చేస్తుంది.
బరువు తగ్గాలనుకుంటున్నారా..? అయితే తీసుకునే ఆహారంలో మెంతికూర ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్ కంటెంట్ త్వరగా కడుపు నిండిన భావన కలిగిస్తుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో కూడామెంతికూర కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చబుతున్నారు. మెంతికూర టైప్ 2 డయాబెటిస్‌ని కంట్రోల్ చేస్తుందని పలు అధ్యయనాల్లో తేలింది.
చర్మ ఆరోగ్యాన్ని కాపాడంలో కూడా మెంతికూర ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని మంచి గుణాలు కణాలను రిపేర్ చేసి.. విష వ్యర్థాల్ని బయటకు పంపి, చర్మంపై ముడతల్ని తొలగిస్తాయి.
కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా మెంతికూర కీలకపాత్ర పోషిస్తుంది. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడడకుండా చేయడంలో మంతికూర ఉపయోగపడుతుంది. లివర్ సమస్యలు కూడా దూరమవుతుంది.
మెంతికూరలో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.