Protein: ఆరోగ్యానికి మంచిదని.. ప్రొటీన్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారా..? మీరు డేంజర్ లో పడినట్టే..!
జీర్ణక్రియ, రక్తం గడ్డకట్టడం, కండరాల కదలికలు వంటి అనేక జీవరసాయన కార్యకలాపాలలో సహాయపడే కెమికల్స్‌ను తయారు చేయడంలో ప్రోటీన్లు కీలక పాత్ర. ఇటీవల కాలంలో ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. ఈ క్రమంలోనే ప్రొటీన్ ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధతో తీసుకుంటున్నారు. కానీ, మన శరీరంలో ప్రొటీన్ ఎక్కువైతే కూడా నష్టాలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. దాని పరిణామాలు ఎలా ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం..

ప్రోటీన్ అనేది ఒక పోషక పదార్థం. మన శరీరంలో అవయవాల ఎదుగుదలలో ప్రొటీన్ అవసరం చాలా ఎక్కువ. దెబ్బతిన్న కణజాలాన్ని సాధారణ స్థితికి తీసుకురావడంలో ప్రోటీన్ కీలకం. కండరాల నిర్మాణం, ఎముకల దృఢత్వాన్ని పెంచడంలో, రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ప్రొటీన్లు సహాయపడతాయి. ఎముకలు, జుట్టు, గోర్లతో పాటు శరీర వృద్ధికి ప్రొటీన్లు సహకరిస్తాయి. జీర్ణక్రియ, రక్తం గడ్డకట్టడం, కండరాల కదలికలు వంటి అనేక జీవరసాయన కార్యకలాపాలలో సహాయపడే కెమికల్స్‌ను తయారు చేయడంలో ప్రోటీన్లు కీలక పాత్ర. ఇటీవల కాలంలో ప్రజల్లో ఆరోగ్యం పట్ల అవగాహన పెరిగింది. ఈ క్రమంలోనే ప్రొటీన్ ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధతో తీసుకుంటున్నారు. కానీ, మన శరీరంలో ప్రొటీన్ ఎక్కువైతే కూడా నష్టాలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు. దాని పరిణామాలు ఎలా ఉంటాయో ఇక్కడ తెలుసుకుందాం..
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రొటీన్ అధికంగా తింటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు అంటున్నారు. ప్రొటీన్ ఎక్కువగా తీసుకుంటే అధిక దాహంతో ఇబ్బంది పడాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇది కిడ్నీలపై భారం పడుతుంది. నోటి దుర్వాసనకు కూడా దారితీస్తుందని చెబుతున్నారు. ప్రొటీన్‌లో ఆమ్లాలు ఉంటాయి. ఇది ఓరల్ హెల్త్ పై ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఎక్కువ ప్రొటీన్ తీసుకోవడం ఎముకలపై కూడా ప్రభావం ఉంటుందని చెబుతున్నారు.
ప్రొటీన్ అధికంగా తీసుకుంటే మలబద్ధకానికి కూడా దారితీస్తుంది. అంతేకాదు మన శరీరంలో వేడి కూడా పెరుగుతుంది. ప్రొటీన్ అధికంగా తీసుకుంటే ఒళ్లు నొప్పులు కూడా వేధిస్తాయని అంటున్నారు. ఎక్కువ ప్రొటీన్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్‌కు దారితీస్తుంది. అత్యధిక ప్రొటీన్ వల్ల శరీరంలో కొన్ని ఇతర పోషకాలు తగ్గి పోషకాల అసమతుల్యత ఏర్పడుతుంది. అంతేకాదు.. ప్రొటీన్లలో కూడా కేలరీలు ఉంటాయి. అదనపు ప్రొటీన్ వల్ల మీకు అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..