రాత్రి భోజనం తర్వాత సోంపు తినే అలవాటు ఉందా..? అయితే, మీ బాడీలో ఏం జరుగుతుందో తెలిస్తే..
భోజనం చేసిన తర్వాత సోంపు గింజలను తీసుకునే అలవాటు ఉంటే అది ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే, రాత్రి భోజనం తర్వాత సోంపు నమలడం మంచిదేనా అనే సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా..? అయితే, రాత్రి భోజనం చేశాక సోంపు తినటం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు కలుతాయో ఇక్కడ తెలుసుకుందాం..

సోంపు ఒక రుచికరమైన, కరకరలాడే మసాలా. ఇందులో విటమిన్ సి, పొటాషియం, డైటరీ ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు నిండివున్నాయి. భోజనం చేసిన తర్వాత సోంపు గింజలను తీసుకునే అలవాటు ఉంటే అది ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే, రాత్రి భోజనం తర్వాత సోంపు నమలడం మంచిదేనా అనే సందేహం మీకు ఎప్పుడైనా కలిగిందా..? అయితే, రాత్రి భోజనం చేశాక సోంపు తినటం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు కలుతాయో ఇక్కడ తెలుసుకుందాం..
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రి భోజనం తర్వాత సోంపు నమలడం వల్ల ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి కడుపు సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. సోంపులో కేలరీల కంటెంట్ చాలా తక్కువగా ఉందని, ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుందని అనేక పరిశోధనాల్లో వెలుగులోకి వచ్చింది. ఇది బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఫైబర్, పొటాషియం, ఇలాంటి అనేక పోషకాలు సోంపులో కనిపిస్తాయి. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
సోంపులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీనిని తినడం వల్ల మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. ఇది మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. మీరు ప్రతిరోజూ తిన్న తర్వాత సోంపును నమలాలి. నొప్పి, పీరియడ్స్ సంబంధిత ఇతర సమస్యల నుండి ఉపశమనం పొందడానికి రాత్రి భోజనం తర్వాత సోంపును తీసుకోవచ్చు. రాత్రిపూట సోంపు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించవచ్చు. రాత్రి భోజనం తర్వాత కూడా మీరు సోంపు నమలాలని నిపుణులు సూచిస్తున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..