తేనెతో కలిపి వీటిని అస్సలు తినకూడదు.. తింటే అది విషమే అవుతుంది..!

|

Jun 09, 2023 | 1:57 PM

తేనె, నెయ్యి సమభాగాలుగా కలిపి ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని హెచ్చరిస్తున్నారు. తేనెను వాన నీటితో సమంగా కలిపి వాడితే అది అనారోగ్యాన్ని తెస్తుంది. తేనెను కొంచెం గోరువెచ్చని నీటితో తప్ప బాగా వేడిగా వున్న నీటితో తాగితే అది విషతుల్యమవుతుంది. ఇంకా ఇలాంటి పదార్థాలతో కూడా తేనెను కలిపి తీసుకుంటే..

తేనెతో కలిపి వీటిని అస్సలు తినకూడదు.. తింటే అది విషమే అవుతుంది..!
Honey
Follow us on

చాలామంది ఆరోగ్యం కోసం తేనెను ఉపయోగిస్తారు. కొందరు టేస్ట్ కోసం వాడతారు. అయితే ఈ తేనెను కొన్ని పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల అనారోగ్యం బారినపడే అవకాశం ఉంది. తేనెలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక ప్రయోజనాలు దాగివున్నాయి. ఇదే తేనెను కొన్ని విరుద్ధ పదార్థాలతో కలిపి తింటే అది విషతుల్యమవుతుంది. తేనె, నెయ్యి సమభాగాలుగా కలిపి ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని హెచ్చరిస్తున్నారు. తేనెను వాన నీటితో సమంగా కలిపి వాడితే అది అనారోగ్యాన్ని తెస్తుంది. తేనెను కొంచెం గోరువెచ్చని నీటితో తప్ప బాగా వేడిగా వున్న నీటితో తాగితే అది విషతుల్యమవుతుంది.

తేనెను నెయ్యితో కలిపి అస్సలు తినకూడదు. ఇలా చేయడం జీర్ణశక్తి మందగిస్తుంది. జీర్ణ సమస్యలతో పాటు మలబద్ధకం సమస్య తలెత్తే అవకాశం ఉంది.. నిమ్మపండు రసాన్ని తేనె, నెయ్యిలతో కలిపిగానీ, మినపప్పు-బెల్లము-నెయ్యితో కానీ తీసుకోరాదు. తేనెను గోరువెచ్చని నీటితో మాత్రమే తీసుకోవాలి. కానీ బాగా వేడి నీటితో కలిపి తాగితే ఇది విషతుల్యమవుతుంది. నిమ్మపండు రసాన్ని తేనె, నెయ్యిలతో గానీ, మినపప్పు-నెయ్యి, బెల్లంతో కానీ అస్సలు తీసుకోకూడదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు తప్పవు.

మాంసంతో కూడా తేనెను కలిపి తీసుకోకూడదు. ఇలా చేస్తే అనేక అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంది. చేపలు తిన్న తర్వాత కూడా పాలతో కలిపి తేనె తినరాదు. ఇలా చేయడం వల్ల ఎలర్జీతో పాటు జీర్ణ సంబంధ వ్యాధులు తలెత్తుతాయి. అలాగే, వెల్లుల్లి, మునగ, తులసి మొదలైన పదార్థాలను తిని వెంటనే తేనెతో కలిపిన పాలు కూడా తాగరాదు. ఇలా చేయడం వల్ల కూడా జీర్ణసంబంధ వ్యాధులు వస్తాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…