Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shoes without Socks: సాక్స్‌ లేకుండా బూట్లు ధరించే అలవాటు మీకూ ఉందా? జర భద్రం..

కొంత మంది సాక్స్ లేకుండా బూట్లు ధరిస్తుంటారు. ఈ అలవాటు యువతలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాళ్లు దురదగా అనిపించడం వల్ల.. వీళ్లు ప్రతిరోజూ సాక్స్ ధరించరు. సాక్స్ లేకుండానే బూట్లు వేసుకుని చక్కా తిరిగేస్తుంటారు. పైగా ధరించే సాక్స్ నుండి వాసన వస్తే? అనే కారణంతో కూడా చాలా మంది సాక్క్‌కి దూరంగా..

Shoes without Socks: సాక్స్‌ లేకుండా బూట్లు ధరించే అలవాటు మీకూ ఉందా? జర భద్రం..
Shoes Without Socks
Follow us
Srilakshmi C

|

Updated on: Jun 10, 2025 | 2:05 PM

నేటి కాలంలో ఫ్యాషన్‌ మీనింగ్‌ పూర్తిగా మారిపోయింది. రకరకాల చాలా మంది రకరకాల ట్రెండ్స్ ఫాలో అవుతుంటారు. అయితే కొంత మంది సాక్స్ లేకుండా బూట్లు ధరిస్తుంటారు. ఈ అలవాటు యువతలో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. కాళ్లు దురదగా అనిపించడం వల్ల.. వీళ్లు ప్రతిరోజూ సాక్స్ ధరించరు. సాక్స్ లేకుండానే బూట్లు వేసుకుని చక్కా తిరిగేస్తుంటారు. పైగా ధరించే సాక్స్ నుండి వాసన వస్తే? అనే కారణంతో కూడా చాలా మంది సాక్క్‌కి దూరంగా ఉంటారు. అయితే ఇలా సాక్స్ ధరించకుండా నేరుగా బూట్లు ధరిస్తే ఏమి జరుగుతుందో తెలుసా? ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఈ అలవాటు చాలా సమస్యలను కలిగిస్తుందని చెబుతున్నారు. ఈ అలవాటు కాళ్లకు హాని కలిగించడమే కాకుండా అనేక సమస్యలను కూడా ఆహ్వానిస్తుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

సాక్స్ లేకుండా బూట్లు వేసుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఇవే

రక్త ప్రసరణ సమస్యలు

సాక్స్ లేకుండా బూట్లు ధరించడం వల్ల పాదాల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇది శరీర రక్త ప్రసరణపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. నిజానికి సాక్స్ లేకుండా బూట్లు ధరించడం వల్ల మీ పాదాల భాగాలపై ఎక్కువ ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది రక్త ప్రసరణను కూడా ప్రభావితం చేస్తుంది.

అలెర్జీ సమస్యలు

సాక్స్ లేకుండా బూట్లు ధరించడం వల్ల పాదాలలో అలెర్జీ సమస్యలు వస్తాయి. కొంతమందికి చాలా సున్నితమైన చర్మం ఉంటుంది. కాబట్టి సాక్స్ లేకుండా బూట్లు ధరించడం వల్ల పాదాలలో అలెర్జీ సమస్యలు వస్తాయి.

ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రమాదం

ఆరోగ్య నివేదికల ప్రకారం.. సగటున ఒక వ్యక్తి పాదాలు ప్రతిరోజూ 300 మి.లీ. చెమటను ఉత్పత్తి చేస్తాయి. కాబట్టి సాక్స్ లేకుండా బూట్లు ధరిస్తే, ఈ చెమట తేమను పెంచుతుంది. ఇది అనేక రకాల బాక్టీరియల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.

చెమటలు పట్టడం

సాక్స్ లేకుండా బూట్లు ధరించడం వల్ల పాదాలపై చెమట పేరుకుపోతుంది. దీనివల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. పాదాలు దుర్వాసన వస్తాయి. సాక్స్ సరిగ్గా ధరించకపోతే, పాదాలు మురికిగా మారి బ్యాక్టీరియాకు ఆశ్రయంగా మారుతాయి. దీనివల్ల పాదాలపై దురద, బొబ్బలు కూడా వస్తాయి.

ఈ విషయాలు గుర్తుంచుకోండి..

  • మంచి నాణ్యత గల బూట్లు ధరించాలి.
  • మీరు ధరించే బూట్లు బిగుతుగా లేదా వదులుగా ఉండకూడదు.
  • మంచి నాణ్యత గల సాక్స్ ధరించాలి.
  • ప్రతిరోజూ సాక్స్‌లను మార్చాలి. ఉతికిన శుభ్రమైన సాక్స్‌లు మాత్రమే ధరించాలి.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.

రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో జోరు వానలు!
రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. ఉరుములు, మెరుపులతో జోరు వానలు!
అడవి శేష్‌కు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ..
అడవి శేష్‌కు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఇచ్చిన బిగ్ బాస్ బ్యూటీ..
భారత్ vs న్యూజిలాండ్ షెడ్యూల్ ఇదే.. అందరి చూపు ఆ ఇద్దరివైపే..!
భారత్ vs న్యూజిలాండ్ షెడ్యూల్ ఇదే.. అందరి చూపు ఆ ఇద్దరివైపే..!
ఎల్‌బీనగర్‌లో దారుణం.. స్పాట్‌లోనే ఇద్దరు సజీవదహనం
ఎల్‌బీనగర్‌లో దారుణం.. స్పాట్‌లోనే ఇద్దరు సజీవదహనం
మరికొన్ని గంటల్లోనే ఇంటర్‌ సప్లిమెంటరీ 2025 ఫలితాలు.. లింక్ ఇదే!
మరికొన్ని గంటల్లోనే ఇంటర్‌ సప్లిమెంటరీ 2025 ఫలితాలు.. లింక్ ఇదే!
రిటైర్మెంట్ ఏజ్‌లో భారీ సిక్స్.. కొడితే స్టేడియం దాటిపోయిందిగా..
రిటైర్మెంట్ ఏజ్‌లో భారీ సిక్స్.. కొడితే స్టేడియం దాటిపోయిందిగా..
అతిరథ మహారథుల మధ్య గద్దర్ అవార్డుల ప్రదానోత్సవ వేడుక
అతిరథ మహారథుల మధ్య గద్దర్ అవార్డుల ప్రదానోత్సవ వేడుక
మెగా DSC 2025 అభ్యర్ధులకు బిగ్‌షాక్.. పరీక్షల తేదీలు మారాయ్!
మెగా DSC 2025 అభ్యర్ధులకు బిగ్‌షాక్.. పరీక్షల తేదీలు మారాయ్!
దటీజ్ బావుమా.. 100 ఏళ్లలో ఏ కెప్టెన్ సాధించలేని రికార్డులో..
దటీజ్ బావుమా.. 100 ఏళ్లలో ఏ కెప్టెన్ సాధించలేని రికార్డులో..
నో పవర్‌.. నో థ్రస్ట్‌.. గోయింగ్‌ డౌన్‌.. పైలట్‌ చివరి సంభాషణ ఇదే
నో పవర్‌.. నో థ్రస్ట్‌.. గోయింగ్‌ డౌన్‌.. పైలట్‌ చివరి సంభాషణ ఇదే