Water Diet: వాటర్ డైట్ అంటే ఏమిటి? ఈ డైట్ ను ఎంతకాలం..? ఎలా చేయాలంటే..
ప్రస్తుతం ప్రజలు బరువు తగ్గడానికి లేదా ఊబకాయం తగ్గడానికి రకరకాల డైట్ ను పాటిస్తున్నారు. రకాల ఆహారాలను తినే వాటిల్లో చేర్చుకున్తున్నారు. వాటిల్లో ఒకటి నీటి ఉపవాసం కూడా. అయితే నీళ్లు మాత్రమే తాగడం ఆరోగ్యానికి మేలా? హానికరమా? ఈ డైట్ శరీరానికి ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది? హాని కలిగిస్తుంది? ఈ డైట్ ని ఎన్ని రోజులు అనుసరించవచ్చో నిపుణుల సలహా ఏమిటంటే..

ప్రస్తుతం బరువు తగ్గడానికి ప్రజలు వివిధ మార్గాలను ప్రయత్నిస్తున్నారు. ఇందులో వ్యాయామంతో పాటు డైట్ కూడా .. ప్రస్తుతం కీటో డైట్ వంటి అనేక రకాల డైట్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఎవరైనా తమ సొంత అభిప్రాయంతోనే ఈ డైట్ ప్లాన్ ను ఎంచుకుంటున్నారు. వీటన్నింటిలో వాటర్ డైట్ కూడా ఒకటి. ఈ డైట్ ని పాటించేవారు ద్రవ వస్తువులను మాత్రమే తీసుకుంటారు. వాటర్ డైట్ అంటే పేరులో ఉన్నట్లే కేవలం నీటిని మాత్రమే తాగడం. అయితే ఈ డైట్ సరైనదేనా అని భావిస్తున్నారు. ఎందుకంటే మన శరీరం సరిగ్గా పనిచేయడానికి అన్ని రకాల పోషకాలు అవసరం. కనుక నీటి ఉపవాసం శరీరానికి ప్రయోజనం చేకూరుస్తుందా లేదా హానికరమా..? ఈ డైట్ చేసే సమయంలో చేసే తప్పులు ఆరోగ్యానికి తీవ్రమైన హానిని కలిగిస్తాయా తెలుసుకుందాం..
నిపుణులు ఏమంటున్నారు? ఢిల్లీలోని శ్రీ బాలాజీ యాక్షన్ మెడికల్ ఇన్స్టిట్యూట్ చీఫ్ డైటీషియన్ ప్రియా పాలివాల్ మాట్లాడుతూ.. వాటర్ డైట్ అంటే కేవలం నీళ్లు త్రాగి బరువు తగ్గడం. ఇతర ఆహారాలు తీసుకోకుండా కేవలం నీరు మాత్రమే త్రాగటం. దీనిని సాధారణంగా వాటర్ ఫాస్టింగ్ అని కూడా అంటారు. ఈ డైట్ వల్ల బరువు తగ్గడం సాధ్యం కావచ్చు. శరీరాన్ని నిర్విషీకరణ చేయడానికి, బరువు తగ్గడానికి, జీర్ణవ్యవస్థకు విశ్రాంతి ఇవ్వడానికి అప్పుడప్పుడు వాటర్ డైట్ అవలంబించవచ్చు. అయితే దీనిని చాలా పరిమిత కాలం వరకు మాత్రమే పాటించాలి. ఈ ఆహారం శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో సహాయపడుతుంది. దీనితో పాటు ఆకలిని నియంత్రించడం సులభం అవుతుంది. ఇన్సులిన్ స్థాయిలు కూడా మెరుగుపడతాయి.
వాటర్ డైట్ ప్రతికూలతలు కొంతమంది దీనిని మతపరమైన ఉపవాసం లేదా మానసిక స్పష్టత కోసం కూడా స్వీకరిస్తారు. అయితే ఈ వాటర్ డైట్ చేయడం వలన చాలా నష్టాలు కూడా ఉన్నాయి. ఎక్కువ కాలం నీటిని మాత్రమే తాగడం వల్ల శరీరం బలహీనపడుతుంది. ఈ వాటర్ డైట్ వల్ల తలతిరగడం, అలసట, తక్కువ రక్తపోటు, రక్తంలో చక్కెర తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. ఈ వాటర్ డైట్ లో ముఖ్యంగా మధుమేహం, రక్తపోటు లేదా గుండె సంబంధిత సమస్యలతో బాధపడేవారికి ప్రమాదకరం. వాటర్ డైట్ ప్రారంభించే ముందు, ఆరోగ్య తనిఖీ చేయించుకోవడం, శరీర అవసరాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. అంతేకాదు వాటర్ డైట్ ని ఎల్లప్పుడూ నిపుణుడి సలహా మేరకే చేయాలి. ఈ సమయంలో చాలా విశ్రాంతి తీసుకోవాలి. వ్యాయామం చేయవద్దు. శరీరంలో కనిపించే లక్షణాలను అర్థం చేసుకోవాలి. ఈ వాటర్ డైట్ పాటించే వారు బలహీనత, వికారం లేదా తలనొప్పి వంటి సమస్యలు ఉంటే.. వెంటనే డైట్ ని ఆపి ఆరోగ్యకరమైనది ఏదైనా తినండి.
వాటర్ డైట్ ను ఎంతకాలం? ఎలా చేయాలి? ఈ వాటర్ డైట్ ని ఒకటి లేదా రెండు రోజుల కంటే ఎక్కువ కాలం పాటించలేమని నిపుణులు అంటున్నారు. వైద్య పర్యవేక్షణలో మాత్రమే ఈ వాటర్ డైట్ ను అనుసరించడం చాలా ముఖ్యం. ఈ వాటర్ డైట్ ని స్వీకరించే ముందు.. ఈ డైట్ అందరికీ మంచిది కాదని తెలుసుకోవడం ముఖ్యం. ఈ డైట్ ని సరిగ్గా , పరిమిత సమయం పాటు చేస్తేనే ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. లేకుంటే ఈ వాటర్ డైట్ ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే ఈ రకమైన వాటర్ డైట్ ని స్వీకరించడం తెలివైనది. సురక్షితమైనది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




