Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యోగా వర్సెస్‌ వాకింగ్‌.. బరువు తగ్గడానికి ఏది ఉత్తమమైనదో తెలుసా..? నిపుణుల సూచన ఏంటంటే..

రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటే..విశ్రాంతి, ఒత్తిడి లేకుండా చేస్తుంది. యోగా చేయడం ద్వారా ఎలాంటి సమస్య నుండి అయినా రక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చలికాలం లో ఎండవేడిమి తగ్గడం వల్ల శరీరం లో రక్త ప్రవాహం సరిగా లేక రక్త నాళాలు కుంచించుకు పోతాయి. దీంతో బిపి, కొలస్ట్రాల్ వంటి సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో చలికాలం లో చాలా వరకు యోగ సాధన చేయాలని. యోగా ప్రాణా యామం కలిపి చేయడం ద్వారా శరీరం మనసు, ఆత్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

యోగా వర్సెస్‌ వాకింగ్‌.. బరువు తగ్గడానికి ఏది ఉత్తమమైనదో తెలుసా..? నిపుణుల సూచన ఏంటంటే..
Walking Vs Yoga
Follow us
Jyothi Gadda

|

Updated on: Nov 28, 2023 | 8:15 PM

ఊబకాయం చాలా మందిని వేధించే ఆరోగ్య సమస్య. బరువు తగ్గడానికి ఆహారం, వ్యాయామం చాలా ముఖ్యమైనవి. కొందరు బరువు తగ్గేందుకు వాకింగ్‌ చేస్తుంటారు. మరికొందరు యోగాభ్యాసం చేస్తారు. అయితే, బరువు తగ్గడానికి వాకింగ్‌ లేదా యోగా ఏది ఉత్తమమైన మార్గం..? ఏది మంచిది అనేది చాలా మందిలో కలిగే సందేహం. ఇకపోతే, వాకింగ్‌ కేలరీలు, కొవ్వును కాల్చడానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ గంటసేపు వేగంగా నడవడం వల్ల శరీరంలోని కేలరీలు చాలా వరకు కరిగిపోతాయి. జిమ్‌కి వెళ్లకుండా ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి నడకను అలవాటు చేసుకోండి. ఆరోగ్యకరమైన శరీరానికి ఆరోగ్యకరమైన గుండె అవసరం. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, కరోనరీ హార్ట్ డిసీజ్ ప్రమాదాన్ని తగ్గించడానికి వాకింగ్ ఒక అద్భుతమైన మార్గంగా సూచించబడింది. అంతేకాదు నడక రక్త ప్రసరణను కూడా నియంత్రిస్తుంది.

బరువు నియంత్రణకు యోగా గొప్ప వ్యాయామం. యోగా ఒత్తిడిని నియంత్రించడంలో, మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. వివిధ వ్యాధుల నుండి శరీరాన్ని రక్షించడమే కాకుండా, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో రోగనిరోధక వ్యవస్థ కూడా ముఖ్యమైన అంశంగా పరిగణించబడుతుంది. రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటే..విశ్రాంతి, ఒత్తిడి లేకుండా చేస్తుంది. యోగా చేయడం ద్వారా ఎలాంటి సమస్య నుండి అయినా రక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. చలికాలం లో ఎండవేడిమి తగ్గడం వల్ల శరీరం లో రక్త ప్రవాహం సరిగా లేక రక్త నాళాలు కుంచించుకు పోతాయి. దీంతో బిపి, కొలస్ట్రాల్ వంటి సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిస్థితిలో చలికాలం లో చాలా వరకు యోగ సాధన చేయాలని. యోగా ప్రాణా యామం కలిపి చేయడం ద్వారా శరీరం మనసు, ఆత్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

వాకింగ్‌- యోగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. నడక కేలరీలను కరిగించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మరోవైపు, యోగా దృష్టి కేంద్రీకరించడం, జీవక్రియను పెంచడం, శరీరం మరియు మనస్సును సమతుల్యం చేయడం ద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. మనం నిదానంగా నడవడం వల్ల 15 నిమిషాల్లో 9 కేలరీలు ఖర్చు అవుతాయి. 30 నిముషాల్లో 25 కేలరీలకు ఖర్చుచేయవచ్చు. ఇక నిదానంగా కాకుండా కాస్త సాధారణం కంటే కొంత వేగంతో నడిస్తే 15 నిముషాల్లో 25 కేలరీలు ఖర్చు అవుతుంది. అలాగే అరగంటలో 50 పైగా కేలరీలు ఖర్చవుతాయి. ఇలా యోగా మరియు నడక రెండూ బరువు తగ్గడానికి రెండు ముఖ్యమైన మార్గాలు. యోగా, వాకింగ్‌ ఏది చేసినా సరే…. బరువు తగ్గాలనుకున్నవారు ఆహార నియమాలు తప్పకుండా పాటించాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..