Indian Women: ఆ దేశంలో భారతీయ మహిళలు భారీగా సంపాదన.. మన యువతులకు వెల్కమ్ చెబుతోందిగా
ఐరిష్ మహిళల జీతం విషయంలోకి వెళ్తే.. వీరి జీతం కూడా భారతీయ మహిళల సంపాదన కంటే చాలా తక్కువగా ఉంది. నివేదిక ప్రకారం ఐరిష్ మహిళలు ప్రతి వారం 611.60 యూరోలు పొందుతుంది. అంటే ఐర్లాండ్‌లో పనిచేస్తున్న భారతీయ మహిళల వారపు జీతం ఐరిష్ మహిళల కంటే 45 శాతం ఎక్కువ. ఐర్లాండ్‌లో మహిళల సగటు జీతం 592.92 యూరోలు అంటే రూ. 54,115.81. వీరి కంటే భారతీయ మహిళలు జాతీయ సగటు జీతం 50 శాతం ఎక్కువ.

ప్రపంచం ఏ మూల వెదికినా ఎక్కడోచోట భారతీయ మూలలను చెందిన ప్రజలు కనిపిస్తారని అంటారు. ఒకప్పుడు ఎక్కువగా పురుషులు, లేదా తమ ఫ్యామిలీలతో మాత్రమే ఇతర దేశాలకు ఉద్యోగం వ్యాపారం లేదా పని కోసం వెళ్లేవారు. అయితే మారిన కాలంతో పాటు ఇపుడు మహిళలు కూడా ఒంటరిగా ఇతర దేశాలకు వెళ్తున్నారు. కష్టపడి పనిచేసే భారతీయ మహిళలు అమెరికా, కెనడా, బ్రిటన్‌ల కంటే ఐర్లాండ్‌కు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. సంపన్న దేశాలకంటే భారతీయ మహిళలకు ఐర్లాండ్ ఇష్టమైన వర్కింగ్ డెస్టినేషన్‌గా మారడానికి కారణం ఏమిటి? అనే వారి ఆలోచనకు సమాధానంగా ఐరిష్ సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ ఇటీవల విడుదల చేసిన నివేదిక చూస్తే తెలుస్తోంది. ప్రపంచంలోని మిగతా మహిళలతో పోలిస్తే ఐర్లాండ్‌లో పనిచేస్తున్న భారతీయ మహిళలు సంపాదనలో చాలా ముందున్నారని నివేదిక పేర్కొంది.
ఐర్లాండ్‌లో పనిచేసే పురుషుల కంటే భారతీయ మహిళల జీతం ఎక్కువ. నివేదికలో పేర్కొన్న భారతీయ మహిళల జీతం ఎంత? ఇతరులతో లేదా పురుషులతో పోలిస్తే ఎంత జీతం ఎక్కువ పొందుతున్నారో ఈ రోజు తెల్సుకుందాం..
50% ఎక్కువ సంపాదిస్తున్న భారతీయ మహిళలు
ఐరిష్ సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ డేటా ప్రకారం 2022లో భారతీయ మహిళల వారపు సగటు జీతం 886.93 యూరోలు అంటే రూ. 80,950. మరోవైపు.. వివిధ దేశాల నుండి వచ్చిన పురుషుల జీతం 200 యూరోల కంటే తక్కువగా ఉంది. నివేదిక ప్రకారం.. ఆ సమయంలో పురుషుల జీతం 670.90 యూరోలు అంటే రూ. 61,226.
ఐరిష్ మహిళల జీతం విషయంలోకి వెళ్తే.. వీరి జీతం కూడా భారతీయ మహిళల సంపాదన కంటే చాలా తక్కువగా ఉంది. నివేదిక ప్రకారం ఐరిష్ మహిళలు ప్రతి వారం 611.60 యూరోలు పొందుతుంది. అంటే ఐర్లాండ్‌లో పనిచేస్తున్న భారతీయ మహిళల వారపు జీతం ఐరిష్ మహిళల కంటే 45 శాతం ఎక్కువ. ఐర్లాండ్‌లో మహిళల సగటు జీతం 592.92 యూరోలు అంటే రూ. 54,115.81. వీరి కంటే భారతీయ మహిళలు జాతీయ సగటు జీతం 50 శాతం ఎక్కువ.
4 శాతం తగ్గింన భారతీయ పురుషుల జీతం
ఐర్లాండ్ నుండి వచ్చిన ఈ నివేదిక చాలా విషయాలలో కళ్ళు తెరిపిస్తుంది. గణాంకాల ప్రకారం ఐర్లాండ్‌లో భారతీయ పురుషుల కంటే భారతీయ మహిళలు ఎక్కువ సంపాదిస్తున్నారు. ఈ పెరుగుదల 4 శాతం. గణాంకాల ప్రకారం, సగటున భారతీయ పురుషులు వారానికి 852.98 యూరోలు అంటే రూ. 77,875.37 సంపాదిస్తున్నారు. మనం భారతదేశం మినహా ఇతర దేశాల్లో స్త్రీ పురుషుల జీతం గురించి మాట్లాడితే.. స్త్రీ పురుష బేధాలు ఉండవని తెలుస్తోంది.
భారీగా సంపాదిస్తున్న భారతీయులు
ఐరిష్ సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ డేటా ప్రకారం వారం రోజులకు సగటు జీతం ప్రకారం భారతీయుల జీతం ఇతర దేశాల ప్రజల కంటే ఎక్కువగా ఉంది. ఐర్లాండ్‌లో భారతీయుల సగటు సంపాదన 873.38 యూరోలు అంటే రూ.79,704.66 అని నివేదికలో చెప్పబడింది. అనంతరం UK ప్రజలు నిలిచారు. ఐర్లాండ్‌లోని UK ప్రజల సగటు జీతం 710.32 యూరోలు అంటే రూ. 64,802.80. ఐర్లాండ్‌లో పనిచేసే UK పురుషుల వారపు సగటు జీతం 820.24 యూరోలు అంటే రూ. 74,837.86. ఐర్లాండ్‌లో పనిచేసే మహిళల వారపు సగటు జీతం 582.34 యూరోలు అంటే రూ. 53,132.75.
ఐర్లాండ్‌లో ఎంత మంది భారతీయులు ఉన్నారంటే
ఐరిష్ సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ నివేదిక ఐర్లాండ్ అంతటా చర్చించబడుతోంది. క్రమంగా ప్రపంచమంతటా వ్యాపిస్తోంది. అందరూ ఆశ్చర్య పడుతూనే భారతీయ మహిళల పని పట్ల నిబద్ధతను కొనియాడుతున్నారు. ఐర్లాండ్‌లో సుమారు 80,000 మంది ఎన్‌ఆర్‌ఐలు ఉన్నారు. వీరిలో భారతీయ పౌరుల సంఖ్య 45,000. ఐర్లాండ్‌లోని భారత రాయబారి అఖిలేష్ మిశ్రా మాట్లాడుతూ ఈ సంఖ్య భారతదేశ ప్రజల గొప్పతనాన్ని తెలియజేస్తుందని అన్నారు. ఇక్కడ పనిచేసే వ్యక్తులలో ప్రధానంగా మొదటి తరం నిపుణులు ఉన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతదేశంలోని టైర్ 2 , టైర్ 3 నగరాల్లో స్టార్టప్ విప్లవం వేగంగా అభివృద్ధి చెందింది, ఇందులో మహిళలు ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..