Watch Video: వేగంగా దూసుకెళ్తున్న కారులోంచి డబ్బులు వెదజల్లిన ఆకతాయిలు.. వైరల్‌గా మారిన ఘటన
నడిరోడ్డుపై ఆ యువకులు వెదజల్లిన నోట్లు నిజమైన నోట్లా లేక నకిలివా అనేది ఇంకా నిర్ధారించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. విసిరిన నోట్లు నిజమో, నకిలీవో గుర్తించేందుకు విచారణ చేపట్టామని, ఒకవేళ ఆ నోట్లు నిజమైతే కార్ల పైకప్పులపై నుంచి విసిరిన మొత్తంపైనా విచారణ జరుపుతున్నారు. ఇతర నిందితుల సమాచారాన్ని సేకరించేందుకు పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను, ఇతర ప్రాంతాల్లో అమర్చిన కెమెరాలను స్కాన్ చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ఓ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో అజ్ఞాత వ్యక్తులు తమ ఎస్‌యూవీని హైవేపై అతివేగంగా నడుపుతూ కారు పైకప్పు నుంచి డబ్బును రోడ్డుపైకి వెదజల్లుతున్నారు. ఈ ఘటనను కెమెరాలో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో చూస్తే.. కారు రూఫ్‌పై కొందరు, కారు కిటికీపై కొందరు కూర్చుని ఉన్నారు. ఈ దశలో నోట్లను రోడ్డుపై విసురుతున్నట్టుగా విజువల్స్‌లో నమోదైంది. ఈ వీడియో చూసిన పోలీసులు నిందితులను గుర్తించి వారందరికీ భారీ జరిమానా విధించారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఐదు కార్లకు రూ.33,000 జరిమానా విధించారు.
వైరల్ అవుతున్న వీడియోలో.. కార్లు హైవేపై వేగంగా వెళ్తూ సెక్టార్-37 నుంచి సిటీ సెంటర్ ఏరియా వైపు వెళ్తున్నాయి. ఎస్‌యూవీలలో ప్రయాణిస్తున్న వ్యక్తులు హైవేపై నోట్లను విసిరి పెళ్లి ఊరేగింపుకు వెళ్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నోయిడా పోలీసులు చర్యలు తీసుకున్నారు. నోయిడా ట్రాఫిక్ పోలీసులు వీడియోలో కనిపించిన ఐదు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొక్కరికి రూ. 33,000 చలాన్ జారీ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాహనాలతో పాటు మరో ఐదు వాహనాలను గుర్తించామని, ఇతర నిందితులను పట్టుకునేందుకు పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారని తెలిపారు. నోయిడా హైవేపై వేగంగా వెళ్తున్న కారు పైకప్పుపై నుంచి ఓ ధనవంతుడు కరెన్సీ నోట్లను విసిరిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
नोएडा- तेज रफ्तार गाड़ियों से नोट उड़ने का वीडियो वायरल,नोएडा ट्रैफिक पुलिस ने वायरल वीडियो का लिया संज्ञान,5 गाड़ियों की पहचान कर 33-33 हज़ार का चालान किया,काफिले में शामिल अन्य गाड़ियों की भी की जा रही पहचान,सेक्टर-37 से सिटी सेंटर तक जाने वाली गाड़ियों पर कार्रवाई,हुड़दंग करने… pic.twitter.com/92DG25xkSm
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) November 27, 2023
నడిరోడ్డుపై ఆ యువకులు వెదజల్లిన నోట్లు నిజమైన నోట్లా లేక నకిలివా అనేది ఇంకా నిర్ధారించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. విసిరిన నోట్లు నిజమో, నకిలీవో గుర్తించేందుకు విచారణ చేపట్టామని, ఒకవేళ ఆ నోట్లు నిజమైతే కార్ల పైకప్పులపై నుంచి విసిరిన మొత్తంపైనా విచారణ జరుపుతున్నారు. ఇతర నిందితుల సమాచారాన్ని సేకరించేందుకు పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను, ఇతర ప్రాంతాల్లో అమర్చిన కెమెరాలను స్కాన్ చేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..