Video: కేటీఆర్ మామా.. హైదరాబాద్‌కు డిస్నీల్యాండ్ తీసుకురండి ప్లీజ్.. చిన్నారి రిక్వెస్ట్‌కు అదిరిపోయే రిప్లై
KTR: కేటీఆర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఈమేరకు నెటిజన్లు అడిగే ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇస్తుంటారు. అప్పుడప్పుడు నవ్వులు కూడా పూయిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వీడియోలోని చిన్నారి కూడా తన కోరికను కేటీఆర్‌కు వెల్లడించింది.
Viral Video: తెలంగాణలో రేపు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఫోకస్ అంతా రిజల్ట్ డేట్ పైనే ఫోకస్ చేస్తున్నారు. కాగా, నిన్నటితో అన్ని పార్టీల ప్రచారం ముగిసింది. నిన్నటి వరకు అన్ని పార్టీల నేతలు ప్రచారాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో జనాలకు హామీల వర్షం కురిపించారు. ఇదే సమయంలో ఓ చిన్నారి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ పంపింది. ఆ పాపకు కేటీఆర్ రిప్లై కూడా ఇవ్వడంతో ఈ వీడియో సోషల్ మీడియా వేదికగా వైరలవుతోంది. అలాగే నవ్వులు కూడా పూయిస్తోంది.
కేటీఆర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారనే సంగతి తెలిసిందే. ఈమేరకు నెటిజన్లు అడిగే ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలు ఇస్తుంటారు. అప్పుడప్పుడు నవ్వులు కూడా పూయిస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ వీడియోలోని చిన్నారి కూడా తన కోరికను కేటీఆర్‌కు వెల్లడించింది.
My daughter’s request to KTR on Telangana Elections.:-) pic.twitter.com/rjF8aHLrjD
— Surendra Vinayakam (@visurendra) November 14, 2023
‘కేటీఆర్ మామా.. హైదరాబాద్‌కు డిస్నీ ల్యాండ్ తీసుకురా ప్లీజ్’ అంటూ రిక్వెస్ట్ చేసింది. ఈ వీడియోను పాప తండ్రి సురేంద్ర వినాయకం (Surendra Vinayakam) ఎక్స్‌లో పోస్టు చేశాడు. దీంతో ఈ వీడియోపై కేటీఆర్ స్పందించి, తన స్టైల్లో ఆన్సర్ చేవారు. ‘ప్రామిస్ చేయలేను బేటా.. కానీ, తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తా’ అంటూ కేటీఆర్ రిప్లై ఇచ్చారు.
Can’t promise Beta but will try my best 👍 https://t.co/YwWrgHwBNH
— KTR (@KTRBRS) November 28, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..