AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Morning Hacks: ఉదయం అలసటగా ఉంటోందా..? ఇలా చేస్తే రోజంతా ఫుల్ ఎనర్జీ!

రాత్రి 7-8 గంటలు నిద్రపోయినా చాలా మందికి ఉదయాన అలసటగా, నీరసంగా అనిపిస్తుంది. కొందరు పడక మీద నుంచి కిందకు దిగేందుకు కూడా బద్ధకిస్తారు. ఏ పని చేయాలన్నా ఉత్సాహం లేక చాలా మంది ఇబ్బందిపడుతూ ఉంటారు. అయితే కొన్ని సులభమైన అలవాట్లు పాటిస్తే రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Morning Hacks: ఉదయం అలసటగా ఉంటోందా..? ఇలా చేస్తే రోజంతా ఫుల్ ఎనర్జీ!
Morning HabitsImage Credit source: Pexels
Janardhan Veluru
|

Updated on: Jul 08, 2026 | 2:00 PM

Share

రాత్రి ఏడెనిమిది గంటలు హాయిగా నిద్రపోయినా.. ఉదయం లేవగానే చాలా మందికి అలసట, బద్ధకంగా అనిపిస్తుంది. పొద్దెక్కుతున్నా మంచం దిగాలని అనిపించదు. రోజంతా నీరసంగా ఉండటం, ఏ పని చేయాలన్నా ఉత్సాహం లేకపోవడం వంటి సమస్యలు ఇబ్బందిపెడుతాయి. టీ లేదా కాఫీ తాగి శరీరానికి కొత్త ఉత్సాహం తెచ్చుకోవాలని ప్రయత్నించినా.. దాని ప్రభావం కొద్దిసేపటికే పరిమితమవుతుంది. నిపుణుల సలహా మేరకు.. ఉదయం నిద్రలేవగానే కొన్ని చిన్న అలవాట్లను పాటిస్తే శరీరం సహజంగానే యాక్టివ్‌గా మారుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు ఈ మూడు మార్నింగ్ అలవాట్లు ఎంతో ఉపయోగపడతాయి.

1. నిద్రలేవగానే ఒక గ్లాసు నీరు తాగండి

రాత్రంతా నిద్రపోయే సమయంలో శరీరానికి దాదాపు 7–8 గంటల పాటు నీరు అందదు. దీంతో శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. ఉదయం లేవగానే ఒక గ్లాసు సాధారణ నీరు తాగడం వల్ల శరీరానికి వెంటనే తేమ అంది.. బాడీ హైడ్రేట్ అవుతుంది. దీని వల్ల మెటబాలిజం చురుగ్గా పనిచేస్తుంది. శరీరంలోని అవయవాలు సక్రమంగా పనిచేసి అలసట, నీరసం తగ్గుతుంది. ఇది రోజును ఉత్సాహంగా ప్రారంభించడానికి సహాయపడుతుంది.

2. ఉదయపు లేత ఎండలో పావు గంట గడపండి

ఉదయం సూర్యకిరణాలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. నిద్రలేచిన తర్వాత కొద్దిసేపు బయటకు వెళ్లి లేత ఎండలో పావు గంట గడపండి. తద్వారా శరీరంలోని సహజ జీవ గడియారం సక్రమంగా పనిచేస్తుంది. దీని వల్ల హార్మోన్లు చురుకుగా విడుదలవుతాయి. బద్ధకం, నిద్రమత్తు తగ్గుతుంది. రోజంతా ఏకాగ్రత పెరుగుతుంది. రాత్రిపూట కూడా మంచి నిద్ర పట్టేందుకు సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

3. 10 నిమిషాల వ్యాయామం లేదా స్ట్రెచింగ్ చేయండి

ఉదయం లేవగానే గంటల తరబడి వ్యాయామం చేయాల్సిన అవసరం లేదు. కేవలం 10 నిమిషాల పాటు స్ట్రెచింగ్, యోగా లేదా ఇంట్లోనే కొద్దిసేపు నడవడం చాలా మేలు చేస్తుంది. దీని ద్వారా శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. కండరాలకు, మెదడుకు ఆక్సిజన్ ఎక్కువగా అంది శరీరం చురుగ్గా మారుతుంది. తద్వారా రోజంతా ఉత్సాహంగా పని చేసే శక్తి లభిస్తుంది.

ఈ అలవాట్లు కూడా ట్రై చేయండి

అలాగే ఉదయం నిద్రలేచిన వెంటనే ఈ అలవాట్లు కూడా పాటించడం మంచిది. ఉదయం లేచిన వెంటనే మొబైల్ ఫోన్ చూసే అలవాటు మానుకోవాలి. పోషకాలు కలిగిన అల్పాహారం తీసుకోవాలి. అధికంగా టీ, కాఫీ తాగే అలవాటు ఉంటే మానుకోవాలి. ప్రతిరోజూ ఒకే సమయానికి నిద్రపోయి, ఒకే సమయానికి లేవడానికి ప్రయత్నించండి.

రోజూ 7–8 గంటలు నిద్రపోయినా చాలా రోజుల పాటు అలసట, నీరసం సమస్యలు తగ్గకపోతే వైద్యుడిని సంప్రదించడం మంచిది. కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ సమస్యలు, రక్తహీనత, విటమిన్ లోపాలు, మధుమేహం లేదా నిద్ర సంబంధిత వ్యాధులు కూడా దీనికి కారణం కావచ్చు. ఇక్కడ ఇచ్చిన సమాచారం సాధారణ ఆరోగ్య అవగాహన కోసం మాత్రమే. మీకు దీర్ఘకాలిక అలసట లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించండి.

Also Read: జ్ఞాపకశక్తి తగ్గుతోందా? మెమొరీ పవర్‌ను పెంచే సీక్రెట్ టిప్స్ మీకోసం

Follow Us
మీ ఫొటోలతో మీకు తెలియకుండానే AI ఇమేజస్..!
మీ ఫొటోలతో మీకు తెలియకుండానే AI ఇమేజస్..!
రాత్రిళ్లు హఠాత్తుగా మేల్కొంటున్నారా? పీడకలలు, భయాలు వెంటాడుతు..
రాత్రిళ్లు హఠాత్తుగా మేల్కొంటున్నారా? పీడకలలు, భయాలు వెంటాడుతు..
స్వ్కాడ్‌లో తోపులున్నా.. టీమిండియా పతనానికి అసలు కారణం ఇదే..!
స్వ్కాడ్‌లో తోపులున్నా.. టీమిండియా పతనానికి అసలు కారణం ఇదే..!
రాత్రంతా నిద్రపోయినా ఉదయాన అలసటగా ఉంటోందా..?
రాత్రంతా నిద్రపోయినా ఉదయాన అలసటగా ఉంటోందా..?
ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఎందుకు దూరంగా ఉండాలి? పొరపాటున కలిస్తే..
ఆషాఢ మాసంలో భార్యాభర్తలు ఎందుకు దూరంగా ఉండాలి? పొరపాటున కలిస్తే..
PF ఖాతాదారులకు కేంద్రం భారీ గుడ్‌న్యూస్‌..వడ్డీ జమ తేదీ ఫిక్స్
PF ఖాతాదారులకు కేంద్రం భారీ గుడ్‌న్యూస్‌..వడ్డీ జమ తేదీ ఫిక్స్
కిర్రాక్ ఆర్పీ చేపల దుకాణాలు ఎందుకు బంద్ అయ్యాయో తెలుసా..?
కిర్రాక్ ఆర్పీ చేపల దుకాణాలు ఎందుకు బంద్ అయ్యాయో తెలుసా..?
గంగూలీని దాదా అని ఎందుకంటారు? 99 శాతం మందికి తెలియదు
గంగూలీని దాదా అని ఎందుకంటారు? 99 శాతం మందికి తెలియదు
4వ మ్యాచ్ నుంచి ఏకంగా నలుగురు ఔట్.. గంభీర్ షాకింగ్ డెసిషన్?
4వ మ్యాచ్ నుంచి ఏకంగా నలుగురు ఔట్.. గంభీర్ షాకింగ్ డెసిషన్?
సమోసా కోసం రైలు ఆపిన లోకో ఫైలెట్,కట్‌చేస్తే, రైల్వే సంచలన నిర్ణయం
సమోసా కోసం రైలు ఆపిన లోకో ఫైలెట్,కట్‌చేస్తే, రైల్వే సంచలన నిర్ణయం