AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vintage Watches: వింటేజ్ వాచ్‌లకు ఫుల్ డిమాండ్.. ఎందుకో తెలుసా..?

Vintage Watches: గడియారం మన భవిష్యత్తును మార్చేది. మనం ఏంటో తెలిపేది. ప్రతి గడియారానికి ఒక కథ ఉంటుంది. ఆ కథ ఓ గతాన్ని గుర్తుచేస్తుంది. ఈ ఆధునిక యుగంలో గడియారం లోని ముళ్ళతో పరిగెడుతూ ఆధునిక సొగసుతో మిలతమవుతున్నారు. ఆటోమేటిక్‌గా..

Vintage Watches: వింటేజ్ వాచ్‌లకు ఫుల్ డిమాండ్.. ఎందుకో తెలుసా..?
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Jun 24, 2025 | 12:52 PM

Share

Vintage Watches: ఇవి కేవలం సమయాన్ని చూపించేటటువంటి వస్తువులు మాత్రమే కాదు.. మెకానికల్గా ఎంతో నైపుణ్యంతో కళతో కూడిన ఇంజనీరింగ్ అద్భుతాలు. కాలానికి ఇవి తీరని విలువలతో కూడినటువంటి సంపదలుగా చెప్పుకోవచ్చు. ఒక రకంగా ప్రపంచమంతా దీని చుట్టూ తిరుగుతుంది. ఇది తలుచుకుంటే చాలు ఎన్నెన్నో అద్భుతాలు మరెన్నో విపత్తులు దీని సొంతం. అదేంటి అనుకుంటున్నారా..? గడియారం లేని ప్రపంచం ఉండదు. అలాంటి గడియారాలకు ఈ మధ్యకాలంలో ఆదరణ పెరిగింది. టెక్నికల్ గా వచ్చే గడియారాల కన్నా పురాతన గడియారాలకు ఫుల్ డిమాండ్ పెరిగింది.

గడియారం మన భవిష్యత్తును మార్చేది. మనం ఏంటో తెలిపేది. ప్రతి గడియారానికి ఒక కథ ఉంటుంది. ఆ కథ ఓ గతాన్ని గుర్తుచేస్తుంది. ఈ ఆధునిక యుగంలో గడియారం లోని ముళ్ళతో పరిగెడుతూ ఆధునిక సొగసుతో మిలతమవుతున్నారు. ఆటోమేటిక్గా మూమెంట్ వినిపించే నిశ్శబ్ద టిక్ టిక్ అనే సౌండ్ నుంచి డ్రెస్సుకు మ్యాచింగ్ అయ్యేటటువంటి మెరుస్తున్న గడియారాల వరకు వచ్చాయి. అయితే ఈ గడియారాల్లో వ్యక్తిత్వాన్ని వ్యక్తపరిచే అద్భుతమైన ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అదెలా అంటే పురాతన వాచీలు. అవును పురాతన వాచ్‌లకు డిమాండ్ పెరిగింది. ప్రతి పురాతన వాచ్ కి ఒక ప్రత్యేకమైన వారసత్వం ఉంది. ఒక ప్రత్యేక ఆకర్షణ కూడా ఉంది. ఇప్పుడు ఆ పురాతన వాచ్‌ల కోసం ఎంత ఖర్చైనా పర్లేదు అంటూ వాటిని కొనేందుకు మొగ్గు చూపుతున్నారు వాచీ ప్రియులు.

అలాంటి వాచీలలో omega speed master, Seiko 5, Longines Master Collection, Zenith, Carrera ఈ వాచీలకు ఫుల్ డిమాండ్ పెరిగింది. ఈ పేర్లతో ఉన్న వాచ్‌లకు ఒక్కొక్క కథ ఉంది. ఆ కథ వెనుక ఒక పెద్ద చరిత్ర ఉంది. ఇప్పుడు వస్తున్నటువంటి ఆధునిక వాచీలతో పోలిస్తే లుక్కు ప్రకారంగా ఇతర టెక్నికల్ ప్రకారంగా ఎంతో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నాయి. దాదాపు 1832 ఏళ్ల నాటి నుండి ఉంటున్న వాచీలు కూడా ఇప్పుడు కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు పబ్లిక్. మరి కొంతమంది వాచిప్రియలు ఆర్డర్ ఇచ్చి మరి పురాతన బాచులకు మొగ్గు చూపుతున్నారు. ఈ విధంగా అత్యాధునికంగా వచ్చే వాచీలతో పోలిస్తే లుక్‌ ప్రకారంగా చేతికి సూట్ అయ్యే పురాతన వాచిలే మాకు ఇష్టం అంటూ చెప్పుకొస్తున్నారు వాచీప్రియలు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి