Vastu Tips: వంటగదిలో గ్యాస్ స్టవ్ ఏ దిశలో ఉంటే మంచిది? ఏ వస్తువు ఎక్కడ ఉంచాలి?
మన భారతీయ హిందూ సాంప్రదాయంలో వాస్తు శాస్త్రాన్ని నమ్మేవాళ్లు చాలా మంది ఉంటారు. ఇంటిని నిర్మించాలన్నా.. ఇంట్లో వస్తువులనే ఏ మూనాల ఉంటే మంచిదో ఇలా రకరకాల వాటికి వాస్తును చూస్తుంటారు. వాస్తు ప్రకారం నడుచుకుంటూ ఇంట్లో లక్ష్మిదేవి నిలుస్తుందని, దీని వల్ల డబ్బు జమ అవుతుందని, అంతేకాకుండా కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని విశ్వసిస్తుంటారు
మన భారతీయ హిందూ సాంప్రదాయంలో వాస్తు శాస్త్రాన్ని నమ్మేవాళ్లు చాలా మంది ఉంటారు. ఇంటిని నిర్మించాలన్నా.. ఇంట్లో వస్తువులనే ఏ మూనాల ఉంటే మంచిదో ఇలా రకరకాల వాటికి వాస్తును చూస్తుంటారు. వాస్తు ప్రకారం నడుచుకుంటూ ఇంట్లో లక్ష్మిదేవి నిలుస్తుందని, దీని వల్ల డబ్బు జమ అవుతుందని, అంతేకాకుండా కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందని విశ్వసిస్తుంటారు. ఎవరి నమ్మకాలు వారికి అయినప్పటికీ వాస్తు శాస్త్రం ప్రకారమే నడుచుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఏ ఇంట్లోనైనా వంటగది చాలా ముఖ్యమైన ప్రదేశం. వాస్తు ప్రకారం వంటగదిని నిర్మించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. హిందూ మతం విశ్వాసాల ప్రకారం, అన్నపూర్ణ తల్లి వంటగదిలో నివసిస్తుంది. అటువంటి పరిస్థితిలో వాస్తుకు సంబంధించిన తప్పులు మీ జీవితంలో ప్రతికూల పరిణామాలను తెస్తాయి. వంటగదికి సంబంధించిన కొన్ని నియమాలు వాస్తు శాస్త్రంలో పేర్కొనబడ్డాయి. వీటిని పాటించడం వల్ల కుటుంబంలో ధనం, ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని వాస్తు శాస్త్రంలో ఉంది. ఇప్పుడు వంటగదికి సంబంధించిన వాస్తు నియమాలను కూడా తెలుసుకుందాం.
1. వంటగదిని ఆగ్నేయ మండలంలో (ఆగ్నేయం) నిర్మించాలి. తూర్పు దిశలో గ్యాస్ ఉంచండి. ఆహారం తయారు చేసే వ్యక్తి తూర్పు ముఖంగా ఉండాలి. ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు.
2. వంటగదిలో తాగునీరు, ఆర్‌ఓ మొదలైనవి ఈశాన్య లో ఉంచాలంటారు వాస్తు నిపుణులు. వంటగదిలోని సింక్ వంటగది ఈశాన్య లేదా నార్త్-వెస్ట్ జోన్‌లో ఉండాలని సూచిస్తున్నారు.
3. వంటగదిలోని ఎలక్ట్రిక్ ఉపకరణాలను సౌత్ జోన్/సౌత్-వెస్ట్ జోన్‌లో ఉంచవచ్చట. నీరు, అగ్నిని ఒకే వరుసలో ఉంచకూడదట. వంటగదిలో నలుపు, నీలం, బూడిద రంగులు వాడకూడదట.
4. ఇంటి ఆగ్నేయ మూల వంటగదికి అనువైన స్థానం. ఈ దిశలో నిర్మించిన వంటగది శుభప్రదంగా భావిస్తుంటారు.
5. వంటగదిలో అగ్ని, నీరు సమలేఖనం చేస్తే అప్పుడు కుటుంబంలో అసమ్మతి సంభావ్యత పెరుగుతుందట. చిన్న చిన్న విషయాలకే వివాదాలుంటాయి. ఆరోగ్య సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. వాటిని వేరు చేయడం సాధ్యం కాకపోతే, వాటి మధ్య ఎరుపు గీతను వేయవచ్చు. మరొక పరిష్కారంగా, మీరు వాటి మధ్య ఆకుపచ్చ మొక్కను ఉంచవచ్చు.
(నోట్: పైన తెలిపిన అంశాలు పలువురు పండితులు, శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి.)
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి