Vastu Secrets: ఈ చిన్న చిన్న మార్పులు చేయండి చాలు..! ఇగ ఇంట్లో డబ్బే డబ్బు..!
కొంతమందికి ఎంత డబ్బు సంపాదించినా వాళ్ల దగ్గర అది నిలవదు. డబ్బు వచ్చిన వెంటనే ఖర్చు అయిపోతుంది. ఎంత జాగ్రత్తగా చూసుకున్నా చేతిలో ఉండదు. ఇది కేవలం డబ్బు సమస్యే కాదు.. ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ కూడా కారణం కావచ్చు. ఇలాంటి పరిస్థితులు మారాలంటే కొన్ని చిట్కాలు పాటించడం మంచిది.

ఇల్లు శుభ్రంగా ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని చాలా మంది నమ్ముతారు. ముఖ్యంగా ఇంట్లో దుమ్ము, చెత్త, వాసనలు ఉంటే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అందుకే ఇంటిని ప్రతిరోజూ శుభ్రంగా ఉంచుకోవాలి. పూల మొక్కలతో, అందమైన తోరణాలతో ఇంటికి కొత్త అందాన్ని తీసుకురావాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందని నమ్మకం.
ఇంట్లో పనికిరాని, పాడైపోయిన వస్తువులు ఉంటే.. అది డబ్బు నిలవకపోవడానికి ఒక సంకేతం అని అంటారు. ముఖ్యంగా పగిలిన గిన్నెలు, పగిలిన అద్దాలు, ఫోటో ఫ్రేమ్ లు వంటివి ఇంట్లో ఉంచడం మంచిది కాదు. ఇవి ఇంటికి అందాన్ని తగ్గించడమే కాకుండా.. మంచి శక్తులు ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటాయని చెబుతారు. అందుకే ఇంటిలో మంచి శక్తి ప్రవహించాలంటే పనికిరాని వస్తువులను తీసేయడం ఉత్తమం.
ఇంట్లోకి శక్తులు ప్రవేశించే మొదటి స్థానం ప్రధాన ద్వారం. అది శుభ్రంగా ఉండాలి. దానిపై కొంచెం శ్రద్ధ పెట్టాలి. ముఖ్యంగా ఇంటి గుమ్మం దగ్గర చెప్పులు లేదా మురికిగా ఉన్న వస్తువులు ఉంచకూడదు. ఈ అలవాటు వల్ల ఇంట్లోకి వచ్చే మంచి శక్తులు రావని వాస్తు నిపుణులు అంటున్నారు. అలాగే ప్రధాన ద్వారం ఎప్పుడూ శుభ్రంగా, ప్రకాశవంతంగా ఉండేలా చూసుకోవాలి.
గుడిలో దేవుళ్ళను పూలతో ఎలా అలంకరిస్తామో.. ఇల్లు కూడా అలాగే అందంగా కనిపించాలి. ఇంట్లో తులసి మొక్క, రంగురంగుల పూలతో అలంకరణ, ఇంట్లో చిన్న పూజ గది ఏర్పాటు చేయడం వల్ల మంచి శక్తులు ఇంటికి వస్తాయని అంటారు.
ఇంట్లో ఎక్కడైనా నీరు నిలిచిపోవడం లేదా కుళాయిల నుండి నీరు కారుతుంటే అది డబ్బు నష్టాన్ని సూచిస్తుందని నమ్మకం ఉంది. ఇవి సంపద ఇంట్లోకి రాకుండా అడ్డుకునే శక్తులని భావించవచ్చు. అందుకే ఇంట్లో నీటి లీకేజీలు ఉంటే వెంటనే సరిచేయాలి.
డబ్బు చేతిలో నిలవాలంటే కేవలం సంపాదించడం మాత్రమే కాదు.. ఇంటి శుభ్రత, మంచి శక్తులను ఇంట్లోకి ఆహ్వానించడం కూడా చాలా ముఖ్యమైనవి. పైన చెప్పిన సూచనలు పాటిస్తే మన ఇంట్లో డబ్బు సమృద్ధిగా ఉండి.. ఆర్థికంగా స్థిరపడతాం అని చాలా మంది నిపుణులు అంటున్నారు. చిన్న చిన్న మార్పులతో మీరు కూడా డబ్బును ఇంట్లో నిలిపే శక్తిని ఆహ్వానించవచ్చు.




