Vastu Tips: ఇంట్లో ఎక్కువ డబ్బు కూడబెట్టుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ ఒక్క పని చేసి చూడండి..!
ఉప్పు అనేది కేవలం వంటలో మాత్రమే కాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం శుభఫలితాలు అందించే ఒక ముఖ్యమైన అంశం. ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తొలగించి సంపదను పెంచేందుకు ఉప్పును సరైన విధంగా ఉపయోగించడం అవసరం. కొన్ని చిన్న వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా ఇంట్లో శుభత పెరిగి కుటుంబానికి ఆర్థిక స్థిరత్వం కలగనుంది.

ఉప్పు అనేది కేవలం వంటలో రుచిని మాత్రమే పెంచే పదార్థం కాదు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో శుభఫలితాలను తెచ్చిపెట్టగలదని నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో సంపద పెరగాలంటే ఉప్పును సరైన విధంగా ఉపయోగించడం చాలా ముఖ్యం. ఇది నెగెటివ్ ఎనర్జీని తొలగించి ఇంట్లో శుభంను పెంచడంలో సహాయపడుతుంది. కొన్ని చిన్న చిన్న వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా ఇంట్లో ఆనందం, ఐశ్వర్యం నెలకొనే అవకాశముంది.
వాస్తు ప్రకారం ఇంట్లో పశ్చిమం లేదా ఈశాన్య దిశలో ఉప్పును ఉంచడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చెబుతారు. ఈ విధంగా ఉంచిన ఉప్పు ఇంట్లో శుభమైన వాతావరణాన్ని కలిగించడమే కాకుండా ధనప్రాప్తికి కూడా తోడ్పడుతుంది. అయితే ఇంటి దక్షిణ దిశలో ఉప్పును ఉంచకూడదు. దీనివల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరిగి అప్పులు పెరిగే అవకాశం ఉంది. అలానే ఇంటి తూర్పు భాగంలో ఉప్పును నిల్వ చేయడం వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఇంట్లో అనుకోని సమస్యలు, గొడవలు, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటే ఉప్పును ఉపయోగించి కొన్ని వాస్తు పద్ధతులు పాటించవచ్చు. ఉదాహరణకు గుప్పెడు ఉప్పును కొద్దిగా ఆవాలుతో కలిపి ఇంటి చుట్టూ వేస్తే దిష్టి పోతుంది. అలాగే ఇది నెగెటివ్ ఎనర్జీని తొలగించి ఇంట్లో శుభతను పెంచుతుంది.
ఇక ఇంట్లో వాస్తు దోషాలు లేకుండా ఉండాలంటే ప్రతిరోజూ ఉప్పు నీటితో ఇంటిని శుభ్రం చేయాలి. ఇందుకు కొద్దిగా సముద్రపు ఉప్పును ఒక బకెట్ నీటిలో కలిపి ఆ నీటితో ఇల్లు తుడవాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లోని చెడు శక్తులు తొలగిపోతాయని, కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుందని చెబుతారు.
ఇంట్లో సంపద నిలకడగా ఉండాలంటే ఎర్రటి బట్టలో కొంత ఉప్పు తీసుకుని కిచెన్‌లో ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టాలి. ఈ పద్ధతిని పాటించడం వల్ల ఇంట్లో నిధి నిలకడగా ఉంటుందని ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
అలానే సాయంత్రం పూట ఉప్పు దానం చేయడం మంచిది కాదు. వాస్తు నిపుణుల ప్రకారం ఈ సమయంలో ఉప్పు దానం చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉప్పు దానం చేయాలంటే ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో చేయడం మంచిది.
ఈ చిన్న చిన్న వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా ఇంట్లో శుభఫలితాలను పొందొచ్చు. సంపద అభివృద్ధి చెందేందుకు, కుటుంబం ఆనందంగా జీవించేందుకు ఉప్పును ఇలా ఉపయోగించి చూడండి.