Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karivepaku Pachadi: కంటికి, ఒంటికి ఎంతో మంచిదైన కరివేపాకు పచ్చడి.. స్పైసీగా ఇలా చేసుకుంటే చిటికెలో ఖాళీ చేస్తారు..

ఏ ఊర్లో అయినా కరివేపాకుకు కొదవుండదు. అంతలా మన ఆహారపు అలవాట్లలో ఇది భాగం. అయితే ఈ ఆకులు పోపులో వచ్చినా కూరల్లో కనిపించినా వేరి పక్కన పెట్టేస్తుంటారు. అందువల్ల ఇందులోని పోషకాలు అందకుండానే ఉండిపోతాయి. అందుకే ఈ సారి ఇలా కరివేపాకుతో పచ్చడిని చేసి చూడండి. ఇందులోని పోషకాలన్నీ శరీరానికి పుష్కలంగా చేరి ఎన్నో రకాల ప్రయోజనాలకు కలిగిస్తాయి. దీన్ని స్పైసీగా ఎలా చేసుకోవాలో చూడండి.

Karivepaku Pachadi: కంటికి, ఒంటికి ఎంతో మంచిదైన కరివేపాకు పచ్చడి.. స్పైసీగా ఇలా చేసుకుంటే చిటికెలో ఖాళీ చేస్తారు..
Karivepaku Pachadi Recepie
Follow us
Bhavani

|

Updated on: Mar 19, 2025 | 7:46 PM

కరివేపాకు.. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే ఈ ఆకును వేయందే వంట అసలు పూర్తే కాదు. ఎంతో చవకగా మార్కెట్లో దొరికే ఈ ఆకులు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. పోపు పెట్టాలన్నా, కారంపొడులకైనా చట్నీలకైనా ఇది లేకుండా పని పూర్తవదు. ఎన్నో రకాలుగా వాడే ఈ ఆకులను పెరట్లోనూ ఈజీగా పెంచుకోవచ్చు. దీని వల్ల కంటి ఆరోగ్యంతో పాటు, ఐరన్ లోపాన్ని కూడా మెరుగు చేసుకోవచ్చు. జుట్టు రాలే సమస్యకు ఇదే మంచి పరిష్కారం. ఒకప్పటిలా కరివేపాకు దొరకడం గగనమైంది. అందుకే ఒకేసారి మార్కెట్లో కట్టలుగా తెచ్చి నిల్వ చేసుకుంటున్నారు. కొన్నిసార్లు సరిగ్గా నిల్వ చేయకుండే వీటి ఆకులు వెంటనే వాడిపోతుంటాయి. అలాంటప్పుడు దీన్ని కరివేపాకు పచ్చడి చేస్తే వేడి వేడి అన్నంలోకి ఎంతో అద్భుతంగా ఉంటుంది. మరి ఆ రెసిపీ ఎంటో మీరూ తెలుసుకోండి.

కరివేపాకు పచ్చడి రెసిపీకి కావలసిన పదార్థాలు

కరివేపాకులు – పావు కిలో

చింతపండు – నిమ్మకాయ సైజులో

నూనె – సరిపడినంత

ఇంగువ – చిటికెడు

ఆవాలు – ఒక స్పూను

ఎండుమిర్చి – ఎనిమిది

మెంతి గింజలు – పావు స్పూను

శనగపప్పు – ఒక స్పూను

మినప్పప్పు – ఒక స్పూను

కరివేపాకు పచ్చడి రెసిపీ

1. కరివేపాకులను ముందుగానే శుభ్రంగా కడిగి గాలికి ఆరబెట్టుకోవాలి.

2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి.

3. ఆ నూనెలో మినప్పప్పు, శనగపప్పును వేసి వేయించుకోవాలి.

4. ఆ తర్వాత మెంతులను, ఎండుమిర్చిని కూడా వేసి వేయించాలి.

5. వీటన్నిటి తర్వాత ముందుగా ఆరబెట్టుకున్న కరివేపాకులను వేసి ఐదు నిమిషాల పాటు వేయించాలి.

6. తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.

7. మిక్సీ జార్లో వేయించిన కరివేపాకుల మిశ్రమం, చింతపండు, ఉప్పు కూడా వేసి రుబ్బుకోవాలి.

8. కొద్దికొద్దిగా నీరు పోసుకుని మెత్తగా రుబ్బుకోవాలి.

9. ఇప్పుడు ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకోవాలి.

10. దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టుకోవాలి.

11. చిన్న కళాయిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు ఇంగువ వేసి వేయించి ఈ తాలింపును పచ్చడిపై వేసుకోవాలి. అంతే టేస్టీ కరివేపాకు పచ్చడి రెడీ అయినట్టే. వారం రోజుల పాటు దీన్ని నిల్వ చేసుకోవచ్చు. కావలసి ఉంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. కరివేపాకు పచ్చడిని మరింత టేస్ట్ కావాలనుకుంటే కొన్ని కొత్తిమీర ఆకులను కూడా కలుపుకోవచ్చు. మీకు స్పైసీగా తినాలనిపిస్తే ఎండుమిర్చి ఎక్కువగా వేసుకోవచ్చు. లేకుంటే పచ్చిమిర్చిని జతచేసుకోవచ్చు. పచ్చిమిర్చిని వేయించి జోడిస్తేనే మంచి రుచిగా అనిపిస్తుంది. కారం తక్కువగా తినే వారు దీన్ని తక్కువగా కలుపుకోవాలి. ముఖ్యంగా చిన్న పిల్లలు. కరివేపాకు చర్మానికి సహజ టోనర్ లా పనిచేస్తుంది. దీని వల్ల జుట్టు కూడా సరికొత్త నిగారింపు సంతరించుకుంటుంది.

ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
ల్యాండింగ్‌ టైమ్‌లో విమాన చక్రం మిస్‌.. ఆ తర్వాత ??
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
రీల్స్‌ చూస్తున్న యువకుడికి షాక్.. అతని మంచం వద్దకు వచ్చిన చిరుత
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
నెల్లూరులో కొత్త రకం దొంగలు.. చెడ్డీ గ్యాంగ్‌ను మించి..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
ఉదయాన్నే వాష్ రూమ్ లో వింత శబ్ధాలు.. దగ్గరకు వెళ్ళి చూడగా..
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
చేపల కోసం వల వేసిన మత్స్యకారులు.. వలలో చిక్కింది చూసి షాక్‌
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
వారి పంట పండింది.. రూ.1 లక్షకు రూ.3 లక్షలు..
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
ఉదయాన్నే ఈ డ్రై ఫ్రూట్‌ తింటే అద్భుత లాభాలు మీ సొంతం
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
బాలిక నోట్లో ఏదో నల్లటి దారంలా కనిపించింది.. ఆస్పత్రికి వెళ్లగా..
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
వేసవి లో మామిడి పండ్లు తినే ముందు.. ఈ విషయాలు తప్పక తెలుసుకోండి
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌
మీకు తమ్ముడిగా పుట్టినందుకు గర్వంగా ఉంది' పవన్ ఎమోషనల్‌