AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేక్‌ ఫాస్ట్ కి హెల్తీ ఓట్స్ ఇడ్లీ రెసిపీ..! సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా.. స్టెప్ బై స్టెప్ ఇలా చేయండి..!

ఇడ్లీ అనగానే బియ్యం, మినప్పప్పుతోనే తయారు చేస్తామనుకుంటారు. కానీ ఓట్స్‌తో చేసిన ఇడ్లీ మరింత ఆరోగ్యకరంగా, తేలికగా జీర్ణమయ్యేలా ఉంటుంది. తక్కువ కాలరీలు, ఎక్కువ ఫైబర్ ఉన్న ఈ రెసిపీ ప్రత్యేకంగా బరువు తగ్గే వారికీ, గ్లూటెన్-ఫ్రీ డైట్ అనుసరించే వారికి బెస్ట్. ఇప్పుడు సింపుల్‌గా ఇంట్లోనే తయారు చేయండి ఈ రెసిపీని.

బ్రేక్‌ ఫాస్ట్ కి హెల్తీ ఓట్స్ ఇడ్లీ రెసిపీ..! సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా.. స్టెప్ బై స్టెప్ ఇలా చేయండి..!
Healthy Oats Idli Recipe
Prashanthi V
|

Updated on: Mar 19, 2025 | 6:59 PM

Share

ఇడ్లీ అనగానే మినపపప్పు, బియ్యం మిశ్రమంతో తయారు చేసేది. అయితే మరింత ఆరోగ్యకరంగా తేలికగా జీర్ణమయ్యేలా ఓట్స్ ఇడ్లీ ట్రై చేయొచ్చు. ఇది గ్లూటెన్-ఫ్రీ మాత్రమే కాకుండా.. తయారీలోనూ చాలా తక్కువ సమయం పడుతుంది. ఈ హెల్తీ రెసిపీని ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు

  • ఓట్స్ – 1 కప్పు
  • సూజి (ఉప్పుమావు) – 1/2 కప్పు
  • పెరుగు – 1/2 కప్పు
  • కొత్తిమీర (సన్నగా తరిగినది) – 1 టేబుల్ స్పూన్
  • తురిమిన అల్లం – 1 టీస్పూన్
  • ఆవాలు – 1/2 టీస్పూన్
  • మినప్పప్పు – 1/2 టీస్పూన్
  • హింగు – 1/4 టీస్పూన్
  • కరివేపాకు – 2-3
  • ఈనో ఫ్రూట్ సాల్ట్ – 1/2 టీస్పూన్
  • ఉప్పు – తగినంత
  • నూనె – 2 టేబుల్ స్పూన్లు
  • నీరు – తగినంత

తయారీ విధానం

ముందుగా ఓట్స్‌ను గోధుమ రంగు వచ్చేంత వరకు తక్కువ మంటపై వేయించి మెత్తని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత గ్రైండ్ చేసిన ఓట్స్ పొడిని సూజి, పెరుగు, తగినంత నీటితో మిశ్రమం చేసుకుని మెత్తని బ్యాటర్‌లా తయారు చేసుకోవాలి. దీనిలో తురిమిన అల్లం, సన్నగా తరిగిన కొత్తిమీరను వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి.

ఇదిలా ఉంచి చిన్న పాన్ తీసుకుని అందులో ఆవాలు, మినప్పప్పు, హింగు, కరివేపాకు, తగినంత ఉప్పు వేసి వేగించి సువాసన వచ్చేంత వరకు తాలింపు సిద్ధం చేసుకోవాలి. ఆ తాలింపును ఓట్స్-సూజి మిశ్రమంలో వేసి మరోసారి బాగా కలపాలి. చివరిగా, ఈ మిశ్రమంలో ఈనో ఫ్రూట్ సాల్ట్‌ను వేసి మెల్లగా కలిపి తక్షణమే వాడాలి.

తయారైన బ్యాటర్‌ను ముందుగా నూనె రాసిన ఇడ్లీ ప్లేట్స్‌లో వేసి.. వేడిపెట్టిన స్టీమర్‌లో 10-12 నిమిషాలు మిడియం మంటపై ఆవిరితో ఉడకనివ్వాలి. ఇడ్లీలు పూర్తిగా ఉడికిన తర్వాత అవి చల్లారనివ్వాలి. తర్వాత వాటిని సాంబారు, కొబ్బరి చట్నీతో వడ్డించి ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్‌ను ఆనందంగా ఆస్వాదించండి.

ఎల్‌ఐసీ నుంచి కొత్త ప్లాన్.. 100 సంవత్సరాల వరకు జీవిత బీమా..!
ఎల్‌ఐసీ నుంచి కొత్త ప్లాన్.. 100 సంవత్సరాల వరకు జీవిత బీమా..!
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
బంగారం vs వెండి.. 2026లో ఏది కొంటే లాభం.. కనకవర్షం కురిపించేది..
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
JEE Main 2026లో టాప్‌ స్కోర్ కావాలా? ఐతే ఈ టాపిక్స్‌ మిస్ కావద్దు
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
ఏందిది ఆది..! ఇదేదో ముందే చేయొచ్చుగా
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? వెదర్ రిపోర్ట్ ఇదిగో
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
కవలలు ఇంట్లో నిద్రిస్తుండగా భారీ శబ్ధం.. లోపలికి వెళ్లి చూడగా..
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
ఊహించని బాంబు పేల్చిన ధురంధర్ 2.. వాళ్ల పరిస్థితేంటి..?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
భారతీయుల బహిష్కరణలో అమెరికా సెకండ్, టాప్‌లో ఏ దేశం ఉందో తెలుసా?
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేస్తున్న సందీప్ వంగా
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!
ఇక జీమెయిల్‌ వాడేవారికి పండగలాంటి వార్త.. అదిరిపోయే గుడ్‌న్యూస్‌!