Electric kettle: ఇన్నాళ్లు తెలీదే.. ఎలక్ట్రిక్ కేటిల్‌తో ఇవి కూడా చేసుకోవచ్చా?
ఈ రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితంలో మన పనులను సులభతరం చేసే గ్యాడ్జెట్లు ఎన్నో ఉన్నాయి. అయితే చాలా మంది వీటిని కొన్ని పరిమిత పనుల కోసమే వాడుతుంటారు. అటువంటి వాటిలో ఎలక్ట్రిక్ కేటిల్ ఒకటి. ఇది కేవలం నీళ్లు వేడి చేయడానికో లేదా టీ పెట్టుకోవడానికో మాత్రమే ఉపయోగపడుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ, ఎలక్ట్రిక్ కేటిల్ నిజంగా మీ వంటింట్లో ఒక ఆల్‌రౌండర్‌లా పనిచేస్తుంది. అదెలానో తెలుసుకుందాం.

మీరు హాస్టల్‌లో ఉండే స్టూడెంట్ అయినా లేదా ఆఫీసు హడావుడిలో ఉండే ప్రొఫెషనల్ అయినా, ఈ చిన్న గ్యాడ్జెట్ మీ పనులను నిమిషాల్లో పూర్తి చేస్తుంది. వంట గది నుంచే కాకుండా బ్యూటీ రొటీన్ వరకు దీని అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. ఉదయాన్నే టైమ్ లేనప్పుడు గబగబా టిఫిన్ చేయాలంటే ఎలక్ట్రిక్ కేటిల్ బెస్ట్ ఆప్షన్. నీటిని మరిగించి ఇన్స్టంట్ ఓట్స్ లేదా ఉప్మా మిక్స్‌లో పోస్తే చాలు. క్షణాల్లో మీకు ఓట్స్ రెడీ చేసి ఇస్తుంది. అంతేకాదు, అర్ధరాత్రి ఆకలేస్తే ఇందులోనే మ్యాగీ లేదా పాస్తా కూడా ఇట్టే వండేయవచ్చు.
ఎలక్ట్రిక్ కేటిల్ ఎన్ని విధాలుగా వాడొచ్చు
గుడ్లను ఉడకబెట్టడం: ఎలక్ట్రిక్ కేటిల్‌లో గుడ్లను ఉడకబెట్టవచ్చని చాలా మందికి తెలియదు. ఇందుకోసం కేటిల్‌లో నీళ్లు పోసి, గుడ్లు వేసి స్విచ్ ఆన్ చేయండి. స్టౌ మీద కంటే వేగంగా, ఎలాంటి శ్రమ లేకుండా నిమిషాల్లో గుడ్లు ఉడికిపోతాయి. వాటిని బయటకు తీసి పెంకు తీసి తినేయడమే.
వేడి వేడి సూప్, రైస్: మీరు వేడి వేడి సూప్ తాగాలనుకుంటే, కేటిల్‌లో నీటిని వేడి చేసి సూప్ మిక్స్ కలిపితే సరిపోతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇందులో అన్నం కూడా వండుకోవచ్చు. ఎలా అంటే ఇందులో సరైన మొతాదులో నీరు, బియ్యం వేస్తే చాలా అందులోని ‘స్టీమ్ సెన్సార్’ అన్నం సరిగ్గా ఉడికేలా చేస్తుంది.
కేటిల్ కేవలం వంట గదికే పరిమితం కాదు, దీని వల్ల మరికొన్ని ఉపయోగాలు ఉన్నాయి. పార్లర్‌కు వెళ్లే సమయం లేనప్పుడు, ముఖంపై మెరుపు కోసం కేటిల్‌లో నీటిని వేడి చేసి ఆవిరి పట్టుకోవచ్చు. ఇది చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే, వారి పాలు తాగే బాటిల్స్‌ను క్లీన్ చేయడానికి మరుగుతున్న నీరు చాలా అవసరం. కేటిల్‌లోని స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ నీటిని సురక్షితంగా, శుభ్రంగా ఉంచుతుంది. వాటితో మీరు ఈజీగా బాటిల్స్ క్లీన్ చేసుకోవచ్చు.
(Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించడం లేదు. వీటిపై మీకేవైనా సందేహాలు ఉంటే సదురు షోరూంకు వెళ్లి దాని ఉపయోగాలను కనుకొనవచ్చు)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
