AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tulasi Tea: వర్షాకాలంలో రోగనిరోధకశక్తి కోసం తులసి టీ బెస్ట్ మెడిసిన్.. ఎప్పుడు, ఎలా తాగాలంటే..

తులసి ఆకులు, అల్లం, సుగంధ ద్రవ్యాలతో తయారు చేసే సాంప్రదాయ ఆయుర్వేద మూలికా పానీయం. తులసి టీ వర్షాకాలంలో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వెచ్చదనాన్ని అందిస్తుంది. ఈ ఆరోగ్యకరమైన పానీయాన్ని ఎలా తయారు చేయాలి? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం..

Tulasi Tea: వర్షాకాలంలో రోగనిరోధకశక్తి కోసం తులసి టీ బెస్ట్ మెడిసిన్.. ఎప్పుడు, ఎలా తాగాలంటే..
Tulsi Tea
Surya Kala
|

Updated on: Jun 26, 2025 | 9:28 PM

Share

వర్షాకాలం మొదలైంది. దీంతో శరీరం వెచ్చగా, ఆరోగ్యంగా ఉంచుకోవాలని కోరుకుంటారు. ముఖ్యంగా ఉదయం జలుబు, గొంతు నొప్పి బాధపెడుతుంది. అలాంటి పరిస్థితిలో ఇంట్లో ఉండే రెండు ఔషధ పదార్థాలు – ఎండిన అల్లం (సొంటి), తులసి మీకు ఉపశమనం కలిగిస్తాయి. వీటితో తయారుచేసిన టీ రుచికరమైనది మాత్రమే కాదు.. మారుతున్న వాతావరణంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఒక అద్భుతమైన గృహ నివారణ కూడా.

తులసి టీ ప్రయోజనాలు:

  1. మారుతున్న వాతావరణంలో శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
  2. జలుబు, దగ్గు , గొంతు నొప్పి నుంచి ఉపశమనం అందిస్తుంది
  3. జీర్ణక్రియను బలపరుస్తుంది . శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతుంది
  4. సొంటి శరీరానికి వెచ్చదనాన్ని తెస్తుంది. అలసటను తొలగిస్తుంది.
  5. ఇవి కూడా చదవండి
  6. తులసి వైరస్‌లు , బ్యాక్టీరియా నుంచి రక్షిస్తుంది

తయారీకి కావాల్పసిన పదార్థాలు

  1. నీరు- 1 కప్పు
  2. తులసి ఆకులు- 4-5
  3. అల్లం పొడి (సొంటి) – 1/2 టీస్పూన్ పొడి
  4. తేనె (ఐచ్ఛికం)- 1 టీస్పూన్
  5. టీ ఆకులు- 1/2 టీస్పూన్ సాదా

తయారుచేసే విధానం: ముందుగా ఒక గిన్నె తీసుకుని 1 కప్పు నీరు అందులో వేయండి. ఇపుడు ఆ నీటిలో తులసి ఆకులు, సొంటి పొడిని వేయండి. టీ రుచిని కోరుకుంటే.. అందులో కొన్ని టీ ఆకులను జోడించండి. తక్కువ మంట మీద 5-7 నిమిషాలు మరిగించండి. ఇప్పుడు గ్యాస్ ఆపివేసి టీని ఫిల్టర్ చేయండి. టీ కొద్దిగా గోరువెచ్చగా మారినప్పుడు.. అందులో తేనె జోడించండి.

ఎప్పుడు, ఎలా తాగాలంటే

  1. ఉదయం ఖాళీ కడుపుతో లేదా సాయంత్రం మీకు చలిగా అనిపించినప్పుడు తీసుకోండి.
  2. రోజుకు ఒకటి లేదా రెండుసార్లు దీన్ని తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది.
  3. దీన్ని క్రమం తప్పకుండా తాగడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది.
  4. అయితే మీరు ఏదైనా మందులు తీసుకుంటుంటే లేదా గర్భవతిగా ఉంటే ఈ టీ తాగే ముందు ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించండి.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)